వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచారం 3.0 మూడవ వారంలో వ్యవసాయ-రైతు సంక్షేమ శాఖ కార్యకలాపాలు

प्रविष्टि तिथि: 27 OCT 2023 2:07PM by PIB Hyderabad

డిపార్ట్ మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ స్పెషల్ క్యాంపెయిన్ 3.0  మూడవ వారంలో, వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కు చెందిన డిప్యూటీ సెక్రటరీ అండ్ నోడల్ ఆఫీసర్ , ఇద్దరు అండర్ సెక్రటరీల బృందం 2023 అక్టోబర్ 20 న డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ టెన్షన్, సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా, పియుఎస్ఎ , నేషనల్ సీడ్స్ కార్పొరేషన్, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కార్యాలయాలను సందర్శించి తమ పరిపాలనా నియంత్రణలో ఉన్న సబార్డినేట్ / అటాచ్డ్ కార్యాలయాలు , పిఎస్ యు ల పురోగతి,  విజయాలను సమీక్షించింది.

స్పెషల్ క్యాంపెయిన్ 3.0 సందర్భంగా ఈ సంస్థలు సాధించిన పురోగతిని సమీక్షించడానికి ఈ బృందం ఈ కార్యాలయ ఆవరణలోని ప్రతి మూలను పరిశీలించింది.

 

స్పెషల్ క్యాంపెయిన్ 3.0 మూడవ వారం పూర్తయ్యే నాటికి ట్విట్టర్, లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, కూ, ఫేస్ బుక్ , థ్రెడ్స్, పబ్లిక్ యాప్ వంటి వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం లలో ఈ డిపార్ట్ మెంట్ ,  దాని అనుబంధ / సబార్డినేట్ / ఫీల్డ్ ఆఫీసులు మొదలైన వాటి ద్వారా 240 కి పైగా ట్వీట్లు విడుదల చేయబడ్డాయి.

 

 అక్టోబర్ 20, 2023తో ముగిసిన  స్పెషల్ క్యాంపెయిన్ 3.0 లోని మూడవవారంలో డిపార్ట్ మెంట్ పురోగతి/ విజయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:-

ఎం పి ల నుంచి పెండింగ్ లో ఉన్న రిఫరెన్స్ ల సంఖ్య

  వరస నెం.

 ప్రామాణికాలు

 లక్ష్యాలు

 పురోగతి

1

 పరిశుభ్రం చేసిన ప్రదేశాల సంఖ్య

1000

889

2

ఎం పి ల నుంచి పెండింగ్ లో ఉన్న రిఫరెన్స్ ల  సంఖ్య

42

17

3

 పెండింగ్ లో ఉన్న ప్రజా ఫిర్యాదులు

3537

3537 *

4

 పెండింగ్ లో ఉన్న పి జి అప్పీల్స్

27

20

5

 రికార్డ్ నిర్వహణ

(సమీక్షించిన ఫిజికల్ ఫైళ్లు)

21041

21041 *

6

 రికార్డ్ నిర్వహణ 

(తొలగించిన ఫిజికల్ ఫైళ్లు)

8250

8250 *

7

 ఖాళీ అయిన స్థలం  (విస్తీర్ణం చదరపు అడుగులలో)

 

14500 sq. ft.

8

 లభించిన ఆదాయం  (సొమ్ము రూపాయలలో )

 

Rs. 192000/-

* ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, భౌతిక ఫైళ్ల సమీక్ష, పాత ఫిజికల్ ఫైళ్ల తొలగింపులో 100 శాతానికి పైగా పురోగతి సాధించారు.

 

ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ను తగ్గించడానికి 2023 సెప్టెంబర్ 14న న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల శాఖ (డీఏఆర్ పీజీ) సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ప్రత్యేక క్యాంపెయిన్ 3.0ను ప్రారంభించారు. స్పెషల్ క్యాంపెయిన్ 3.0 2023 సెప్టెంబర్ 15 నుండి 30 వరకు సన్నాహక దశ,  2023 అక్టోబర్ 2 నుండి 31 వరకు ప్రధాన దశ - ఇలా రెండు (2) దశలలో అమలు జరుగుతోంది.

సన్నాహక దశకోసం, అన్ని విభాగాలు ,  సబార్డినేట్ / అటాచ్డ్ ఆఫీసులు, పిఎస్ యు, స్వయంప్రతిపత్తి సంస్థలు ,  డిఎ అండ్ ఎఫ్ డబ్ల్యు  పరిపాలనా నియంత్రణలో ఉన్న అథారిటీల నోడల్ ఆఫీసర్లను డి ఎ పి ఆర్ జి మార్గదర్శకాల ప్రామాణికాల ప్రకారం పెండింగ్ లో ఉన్న వాటిని గుర్తించాలని కోరారు. 2023 అక్టోబర్ 2 నుండి 31 వరకు మెయిన్ / ఇంప్లిమెంటేషన్ దశలో ఈ లక్ష్యాలను సాధించడానికి ప్రత్యేక ప్రయత్నాలు జరిగాయి.

 

****


(रिलीज़ आईडी: 1972033) आगंतुक पटल : 82
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी