సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ మరుగుజ్జు అవగాహన దినోత్సవం నిర్వహించిన కేంద్ర దివ్యాంగుల సాధికారత విభాగం
Posted On:
26 OCT 2023 1:17PM by PIB Hyderabad
అంతర్జాతీయ మరుగుజ్జు అవగాహన దినోత్సవాన్ని ఏటా అక్టోబర్ 25న నిర్వహిస్తారు. మరుగుజ్జుకు కారణమయ్యే ఎముక పెరుగుదల సంబంధిత రుగ్మత అయిన అకోండ్రోప్లాసియా గురించి అవగాహన కల్పించడానికి ఈ రోజును ఉద్దేశించారు. భారత్‌లో, కేంద్ర సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దివ్యాంగుల సాధికారత విభాగం (డీఈపీడబ్ల్యూడీ) ప్రపంచ మరుగుజ్జు అవగాహన దినోత్సవాన్ని నిర్వహించింది. తన అనుబంధ సంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 20కి పైగా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, ముఖాముఖిలు, పోస్టర్ తయారీ, వెబ్‌నార్లు, చర్చలు వంటివి చేపట్టింది.
***
(Release ID: 1971752)
Visitor Counter : 92