సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
54వ ఐఎఫ్ఎఫ్ఐ, 2023కి ఇండియన్ పనోరమా 2023 అధికారిక ఎంపికను ప్రకటించింది
54వ ఐఎఫ్ఎఫ్ఐలో 25 ఫీచర్ ఫిల్మ్‌లు, 20 నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు ప్రదర్శిస్తారు
‘ఆటం, (మలయాళం)’ ప్రారంభ ఫీచర్ ఫిల్మ్, ఇండియన్ పనోరమా 2023
‘ఆండ్రో డ్రీమ్స్ (మణిపురి)’ ప్రారంభ నాన్-ఫీచర్ ఫిల్మ్, ఇండియన్ పనోరమా 2023
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ప్రధాన భాగం అయిన ఇండియన్ పనోరమా, 25 ఫీచర్ ఫిల్మ్‌లు, 20 నాన్-ఫీచర్ ఫిల్మ్‌ల ఎంపికను ప్రకటించింది. ఎంపిక చేసిన చిత్రాలు 2023 నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరిగే 54వ ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శిస్తారు.
నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. కొన్ని షరతులు, విధానాలకు అనుగుణంగా ఇండియన్ పనోరమా సినిమాటిక్, నేపథ్య, సౌందర్య శ్రేష్ఠత కలిగిన ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్‌లను ఎంపిక చేయడం జరుగుతుంది. భారతీయ పనోరమ ఎంపిక భారతదేశంలోని చలనచిత్ర ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తుతో రూపొందించడం జరిగింది. ఇందులో ఫీచర్ ఫిల్మ్‌ల నుండి మొత్తం పన్నెండు మంది జ్యూరీ సభ్యులు, ఆరుగురు జ్యూరీ సభ్యులు నాన్-ఫీచర్ ఫిల్మ్‌ల నుంచి సంబంధిత ఛైర్‌పర్సన్‌ల నేతృత్వంలోని ఉన్నారు. వారి వ్యక్తిగత నైపుణ్యాన్ని ఉపయోగించి, ప్రముఖ జ్యూరీ ప్యానెల్‌లు సంబంధిత వర్గాలు భారతీయ పనోరమా చిత్రాల ఎంపికకు దోహదం చేస్తాయి.
ఫీచర్ ఫిల్మ్స్
పన్నెండు మంది సభ్యులతో కూడిన ఫీచర్ ఫిల్మ్ జ్యూరీకి ప్రముఖ సినీ దర్శకుడు, నటుడు, నిర్మాత డాక్టర్ టి.ఎస్.నాగాభరణ నేతృత్వం వహిస్తున్నారు; విభిన్నమైన తమ వర్గానికి వ్యక్తిగతంగా, సమిష్టిగా ప్రాతినిధ్యం వహిస్తూ, వివిధ ప్రశంసలు పొందిన చలనచిత్రాలు, చలనచిత్ర సంబంధిత వృత్తుల సభ్యులతో ఫీచర్ జ్యూరీ ఏర్పాటు అయింది:
1. శ్రీ ఏ.కార్తీక్ రాజా, సినిమాటోగ్రాఫర్
2. శ్రీ అంజాన్ బోస్, చిత్ర దర్శకుడు, నిర్మాత
3. శ్రీ డాక్టర్. ఇటిరని సమంత, చిత్ర నిర్మాత, జర్నలిస్ట్
4. శ్రీ కే.పి.వ్యాసన్, చిత్ర నిర్మాత, దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్
5. శ్రీ కమలేష్ మిశ్రా, చిత్ర దర్శకుడు, స్క్రిప్ట్ రైటర్
6. శ్రీ కిరణ్ గంటి, ఫిల్మ్ ఎడిటర్, దర్శకుడు
7. శ్రీ మిలింద్ లేలే, చిత్ర దర్శకుడు, నిర్మాత
8. శ్రీ ప్రదీప్ కురుబ, చిత్ర దర్శకుడు
9. రమా విజ్, నటి
10. శ్రీ రోమి మీటీ, చిత్ర దర్శకుడు
11. శ్రీ సంజయ్ జాదవ్, చిత్ర దర్శకుడు, సినిమాటోగ్రఫీ
12. శ్రీ విజయ్ పాండే, చిత్ర దర్శకుడు, ఎడిటర్
408 సమకాలీన భారతీయ చలనచిత్రాల విస్తృత స్పెక్ట్రం నుండి 54వ ఐఎఫ్ఎఫ్ఐ లో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించడానికి 25 ఫీచర్ ఫిల్మ్‌ల ప్యాకేజీ ఎంపిక చేశారు. క్రింది ఫీచర్ ఫిల్మ్‌ల ప్యాకేజీ భారతీయ చలనచిత్ర పరిశ్రమ చైతన్యం, వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది.
ఇండియన్ పనోరమా 2023లో ఎంపిక చేసిన 25 చలన చిత్రాల జాబితా క్రింది విధంగా ఉంది:
క్రమ సంఖ్య
|
సినిమా టైటిల్
|
భాష
|
దర్శకుని పేరు
|
-
|
ఆరారిరారో
|
కన్నడ
|
సందీప్ కుమార్ వి
|
-
|
ఆట్టం
|
మలయాళం
|
ఆనంద్ ఏకర్షి
|
-
|
అర్ధాంగిని
|
బెంగాలీ
|
కౌశక్ గంగూలీ
|
-
|
డీప్ ఫ్రిడ్జ్
|
బెంగాలీ
|
అర్జున్ దత్తా
|
-
|
ధాయ్ ఆఖర్
|
హిందీ
|
ప్రవీణ్ అరోరా
|
-
|
ఇరట్ట
|
మలయాళం
|
రోహిత్ ఎం.జి. కృష్ణన్
|
-
|
కాదల్ ఎంబాతు పొత్తు ఉదమై
|
తమిళ్
|
జయప్రకాశ్ రాధాకృష్ణ
|
-
|
కాథల్
|
మలయాళం
|
జో బేబీ
|
-
|
కాంతారా
|
కన్నడ
|
రిషబ్ షెట్టి
|
-
|
మల్లికాప్పురమ్
|
మలయాళం
|
విష్ణు శశి శంకర్
|
-
|
మందలి
|
హిందీ
|
రాకేష్ చతుర్వేది ఓం
|
-
|
మిర్బీన్
|
కర్బి
|
మ్రిదుల్ గుప్త
|
-
|
నీల నీరా సురియాన్
|
తమిళ్
|
సంయుక్త విజయన్
|
-
|
నా తాన్ కేస్ కోడు
|
మలయాళం
|
రితీష్ బాలకృష్ణ పొడువల్
|
-
|
పొక్కాలం
|
మలయాళం
|
గణేష్ రాజ్
|
-
|
రబింద్ర కాబ్య రహస్య
|
బెంగాలీ
|
సాయంతన్ ఘోషాల్
|
-
|
సనా
|
హిందీ
|
సుధాన్షు సరియా
|
-
|
ది వాక్సిన్ వార్
|
హిందీ
|
వివేక్ రంజన్ అగ్నిహోత్రి
|
-
|
వాద్
|
హిందీ
|
జస్పాల్ సింగ్ సంధు
|
-
|
విడుతలై పార్ట్ -1
|
తమిళ్
|
వెట్రి మారన్
|
ప్రధాన స్రవంతి సినిమా విభాగం
|
-
|
2018-ఎవ్రీ వన్ ఐస్ ఏ హీరో
|
మలయాళం
|
జుడే ఆంథోనీ జోసెఫ్
|
-
|
గుల్మొహర్
|
హిందీ
|
రాహుల్ వి చిట్టెల్లా
|
-
|
పొన్నియిన్ సెల్వన్ పార్ట్-2
|
తమిళ్
|
మణి రత్నం
|
-
|
సిర్ఫ్ ఏక్ బందా కాఁఫీ హై
|
హిందీ
|
అపూర్వ్ సింగ్ కార్కీ
|
-
|
ది కేరళ స్టోరీ
|
హిందీ
|
సుదీప్తో సేన్
|
ఇండియన్ పనోరమా 2023 ప్రారంభ చలనచిత్రం కోసం ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ ఆనంద్ ఎకర్షి దర్శకత్వం వహించిన ఆట్టం (మలయాళం) చిత్రం ఎంపిక చేసింది.
నాన్ -ఫీచర్ ఫిలిమ్స్
ఆరుగురు సభ్యులతో కూడిన నాన్-ఫీచర్ ఫిల్మ్ జ్యూరీకి ప్రఖ్యాత డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ అరవింద్ సిన్హా నేతృత్వం వహిస్తున్నారు. నాన్-ఫీచర్ జ్యూరీ వివిధ ప్రశంసలు పొందిన చలనచిత్రాలు, చలనచిత్ర సంబంధిత వృత్తులకు వ్యక్తిగతంగా ప్రాతినిధ్యం వహించే క్రింది సభ్యులతో ఏర్పాటు చేశారు:
1. శ్రీ అరవింద్ పాండే, చిత్ర దర్శకుడు, రచయిత
2. శ్రీ బాబీ వాహేన్గబం, చిత్ర దర్శకుడు, నిర్మాత
3. శ్రీ దీప్ భుయాన్, చిత్ర దర్శకుడు
4. శ్రీ కమలేష్ ఉదాసీ, చిత్ర దర్శకుడు, నిర్మాత
5. పౌశాలి గంగూలీ, యానిమేటర్, చిత్ర దర్శకురాలు, స్క్రీన్ రైటర్
6. శ్రీ వరుణ్ కూర్కొటి , చిత్ర దర్శకుడు
239 సమకాలీన భారతీయ నాన్-ఫీచర్ ఫిల్మ్‌ల విస్తృత స్పెక్ట్రం నుండి 54వ ఐఎఫ్ఎఫ్ఐలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శించడానికి 20 నాన్-ఫీచర్ ఫిల్మ్‌ల ప్యాకేజీ ఎంపిక చేయబడింది. నాన్-ఫీచర్ ఫిల్మ్‌ల ప్యాకేజీ, సమకాలీన భారతీయ విలువలను డాక్యుమెంట్ చేయడానికి, వినోదాన్ని మరియు ప్రతిబింబించేలా అభివృద్ధి చెందుతున్న, స్థిరపడిన చిత్రనిర్మాతల సామర్థ్యాన్ని ఉదాహరణగా చూపుతుంది.
ఇండియన్ పనోరమా 2023లో ఎంపిక చేసిన 20 నాన్-ఫీచర్ ఫిల్మ్‌ల జాబితా క్రింది విధంగా ఉంది:
క్రమ సంఖ్య.
|
చిత్రం పేరు
|
భాష
|
దర్శకులు
|
1
|
1947: బ్రేక్సిట్ ఇండియా
|
ఇంగ్లీష్
|
సంజీవన్ లాల్
|
2
|
ఆండ్రో డ్రీమ్స్
|
మణిపూరి
|
లొంగజం మీనా దేవి
|
3
|
బాసన్
|
హిందీ
|
జీతాన్క్ సింగ్ గుర్జార్
|
4
|
బ్యాక్ టు ది ఫ్యూచర్
|
ఇంగ్లీష్
|
ఎంఎస్ బిష్త్
|
5
|
బారూర్ జాంగ్జర్
|
అస్సామీస్
|
ఉత్పల్ బొర్పుజరి
|
6
|
బెహ్రుపియా - ది ఇంపెర్సొనేటర్
|
హిందీ
|
భాస్కర్ విశ్వనాథన్
|
7
|
భంగార్
|
మరా
|
సుమిరా రాయ్
|
8
|
నాన్సీ నీలం (ఛేంజింగ్ ల్యాండ్స్కేప్ )
|
తమిళ్
|
ప్రవీణ్ సెల్వం
|
9
|
చుపి రోహ్
|
డోగ్రి
|
దిశా భరద్వాజ్
|
10
|
గిద్ (ది స్కావెంజర్)
|
హిందీ
|
మనీష్ సైని
|
11
|
కథాబోర్
|
అస్సామీస్
|
కేశర్ జ్యోతి దాస్
|
12
|
లాచిత్ (ది వారియర్)
|
అస్సామీస్
|
పార్థసారథి మహంత
|
13
|
లాస్ట్ మీట్
|
మణిపురి
|
వారిబమ్ దొరేంద్ర సింగ్
|
14
|
లైఫ్ ఇన్ లూమ్
|
హిందీ, తమిళ్, అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్
|
ఎడ్మన్డ్ రాన్సన్
|
15
|
మౌ: ది స్పిరిట్ డ్రీమ్స్ అఫ్ చేరా
|
మిజో
|
శిల్పిక బోర్డోలాయ్
|
16
|
ప్రదక్షిణ
|
మరాఠీ
|
ప్రథమేష్ మహాలే
|
17
|
సదబహార్
|
కొంకణి
|
సుయాశ్ కామత్
|
18
|
శ్రీ రుద్రం
|
మలయాళం
|
ఆనంద జ్యోతి
|
19
|
ది సీ అండ్ సెవెన్ విలేజెస్
|
ఒరియా
|
హిమాంశు శేఖర్ కాటువ
|
20
|
(Release ID: 1970598)
Visitor Counter : 125