వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
డ్రమ్ములు, టిన్లకు ప్రమాణాల నియంత్రణ ఉత్తర్వులు జారీచేసిన డిపిఐఐటి.
Posted On:
23 OCT 2023 1:20PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన, పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి), భారత ప్రమాణాల సంస్థ (బిఐఎస్)తో , సంబంధిత పక్షాలతో సంప్రదించి,
నాణ్యాతా ప్రమాణాల ఉత్తర్వుల జారీకి పలు కీలక ఉత్పత్తులను గుర్తించింది. దీనితో కొత్తగా 318 ఉత్పత్తుల ప్రమాణాలకు సంబంధించి 60 నాణ్యాతా
ప్రమాణాల ఉత్తర్వుల జారీకి వీలు కల్పించింది. ఇందులో డ్రమ్ములు, టిన్లకు సంబంధించి ఏడు ప్రమాణాలు ఉన్నాయి.
డ్రమ్ అనేది గుండ్రంగా ఉండే ఒక కంటైనర్. దీనిని పౌడర్, పాక్షిక ఘన పదార్థాలు, ద్రవ రూప పదార్ధాల పాకేజింగ్కు దీనిని వాడుతారు.
డ్రమ్లను సాధారణంగా ద్రవరూప పదార్ధాలను, పాక్షిక ఘన పదార్ధాలు పౌడర్లను రవాణాకు సాధారణంగా వినియోగిస్తారు. టిన్ అనేది కూడా ఒక కంటైనర్. ఇది టిన్ కోటింగ్ గల షీట్ మెటల్తో తయారైనది ప్రత్యేకించి,
ఆహార పదార్ధాల ప్యాకేజింగ్కు, పౌడర్ పాకింగ్కు లేదా పాక్షిక ఘన పదార్దాలు, లేదా ద్రవరూప పదార్ధాల పాకింగ్కు దీనిని వాడుతారు.
డ్రమ్ములు, టిన్నులను మౌలికంగా వివిధ రకాల పదార్ధాలను ఉదాహరణకు మండే స్వభావం గల రసాయనాలు, టాక్సిక్ రసాయనాల , ప్రమాదకర పదార్ధాల రవాణాకు వాడుతారు.
వీటిని వివిధ పరిశ్రమలలో వ్యర్థాల నిర్వహణకు , ఆరోగ్య సంరక్షణ , ఫుడ్ సర్వీసులు వంటి వాటికి వాడుతారు. అందువల్ల ఈ డ్రమ్ములు, టిన్లు మంచి నాణ్యమైనవిగా ఉండాలి. ఎలాంటి లీకేజి లేకుండా , కలుషితం కాకుండా,
అగ్నిప్రమాదాలకు గురికాకుండా ఇవి సరిగా తగిన ప్రమాణాలతో ఉండాలి.
డిపిఐఐటి , డ్రమ్లు, టిన్లకు సంబంధించి న నాణ్యతా ప్రమాణాల నియంత్రణ ఆర్డర్ ,2023ను 2023 అక్టోబర్ 20న జారీచేసింది.
అవి కింది విధంగా ఉన్నాయి.
క్రమసంఖ్య
|
భారత ప్రమాణాలు (ఐఎస్)
|
భారత ప్రమాణాలకు సంబంధించిన వస్తువులు
|
1
|
13997:2014
|
పెద్ద ఓపెన్ టాప్ డ్రమ్ములు,
|
2
|
1783 (Part 1) :2014
|
పెద్ద డ్రమ్ములు, గ్రేడ్ –ఎ, ఫిక్స్డ్ ఎండ్ డ్రమ్ములు
|
3
|
1783 (Part 2) :2014
|
పెద్ద డ్రమ్ములు, గ్రేడ్ –బి, ఫిక్స్డ్ ఎండ్ డ్రమ్ములు
|
4
|
2552:1989
|
స్టీలు డ్రమ్ములు(గాల్వనైజ్ డ్, గాల్వనైజ్ కానివి)
|
5
|
3575:1993
|
బిటుమన్ డ్రమ్ములు
|
6
|
916:2000
|
చతురస్రాకార టిన్లు ,సాలిడ్ టిన్లు
|
7
|
10325:2000
|
చతురస్రాకారపు టిన్నులు– 15 కిలోల టిన్లు లేదా లీటర టిన్నులు
నెయ్యి, వనస్పతి, వంటనూనెలు, బేకరీ ఉత్పత్తులకోసం వాడే టిన్నులు
|
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నాణ్యతతో కూడిన ఉత్పత్తుల తయారీ ప్రాధాన్యతను తెలియజేస్తూ, “మన ప్రజల సామర్ధ్యం, దేశ విశ్వసనీయత తో భారతీయ ఉత్పత్తులు అత్యున్నత నాణ్యతో ప్రపంచ వ్యాప్తం అవుతున్నాయి ”అని అన్నారు.
ఇది నిజంగా ఆత్మనిర్భర్ భారత్కు ఇది నిజమైన గుర్తింపు గా చెప్పుకోవచ్చు. ఇది అంతర్జాతీయ సుసంప్నతకు ఒక గొప్ప శక్తిగా పనిచేస్తుంది. ఈ విలువలకు అనుగుణంగా డిపిఐఐటి , దేశంలో నాణ్యతా ప్రమాణాలను
కర్తవ్య దీక్షతో చేపట్టేందుకు చర్యలుతీసుకుంటున్నది. తన పరిధిలోని పారిశ్రామిక రంగాలలో నాణ్యతా ప్రమాణాలను పాటింపచేసేలా చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు బిఐఎస్, పరిశ్రమ వర్గాలు, ఇతర స్టేక్ హోల్డర్లతో
కలిసి ముందుకు సాగుతున్నది. క్యు.సి.ఒలు దేశంలో తయారీ నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా, మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ వాల్యూ ఉత్పత్తుల విలువను పెంచుతున్నాయి. ఈ చర్యల ద్వారా ప్రమాణాల
పరిశీలన ప్రయోగశాలల అభివృద్ధి, ప్రాడక్ట్ మాన్యువల్స్, పరీక్షా ప్రయోగశాలల గుర్తింపు తదితరాలు ఇందులో ఉన్నాయి. ఇవి దేశంలో నాణ్యాతావాతావరణాన్ని అభివృద్ధి చేసేందుకు ఉపకరిస్తాయి.
ఏదైనా ఉత్పత్తికి ప్రమాణాలను జారీ చేస్తే వాటిని తయారీ దారు తమంత తాముగా ఐచ్ఛికంగా వాటిని పాటించవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తప్పనరి నాణ్యాత నియంత్ర ణ ఆర్డర్ , స్కీమ్ 1 కింద నోటిఫై చేసినపుడు,
స్కీమ్ 2 తప్పనిసరి రిజిస్ట్రేషన్ ఆర్డర్ (సిఆర్ఒ)ను బిఐఎస్ ప్రమాణాల అసెస్మెంట్ రెగ్యులేషన్స్ 2018 ప్రకారం జారీచేసినపుడు మాత్రం వాటిని తప్పకుండా పాటించవలసి ఉంటుంది.
క్యుసిఒ ని నోటిఫై చేయడంలో ఉద్దేశం, దేశీయంగా తయారైన ఉత్పత్తుల నాణ్యతను పెంచడం. నాశిరకం ఉత్పత్తుల దిగుమతులను నిరొధించడం.అలాగే మానవ, జంతు ఆరోగ్య రక్షణ, వృక్ష సంరక్షణకు వీలుగా అనుచిత వాణిజ్య పద్ధతులను నిరోధించడం. పర్యావరణ పరిరక్షణకు వీటిని జారీచేయడం జరుగుతుంది.
క్యుసి.ఒఈ –గెజిట్ జారీ అయిన తేదీ నుంచి త ఆరునెలల కాలం ముగిసిన అనంతరం అమలులోకి వస్తుంది. దేశీయ, చిన్న, స్థూక్ష్మ పరిశ్రమలను పరిరక్షించేందు, క్యు..సి.ఒను సులభంగా అమలు చేసేందుకు,
సులభతర వాణిజ్యానిఇకి,చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు ఆయా గడువులకు సంబంధించి కొన్ని సడలింపులు కూడా ఇచ్చారు.
క్యుసిఒల అమలుకు చిన్న పరిశ్రమలకు అదనంగా మూడు నెలలు, సూక్ష్మ సంస్థలకు మరో మూడు నెలల సమయం ఇవ్వడం జరిగింది. ఇవి కాక, డ్రమ్ములు, టిన్ల విషయంలో పొడి రూపంలోని పదార్ధాలు, పాక్షిక ఘన పదార్ధాలు,
లేదా ద్రవరూపంలోని పదార్ధాలను దేశంలోకి దిగుమతి చేసుకునేటపుడు కూడా మినహాయింపులు ఇచ్చారు.
క్యుసిఒ అమలుతో తయారీ, నిల్వ, బిఐఎస్ సర్టిఫికేట్ లేని ఉత్పత్తుల అమ్మకం బిఐఎస్ చట్టం 2016 కింద నిషేధం.
బిఐఎస్ చట్టం లోని నిబంధనలను ఉల్లంఘించిన వారికి రెండేళ్లవరకు జైలు శిక్ష, తొలి తప్పుకు 2 లక్షల రూపాయల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
రెండో సారి ఇదే తప్పుచేస్తే కనీస పెనాల్టీ 5 లక్షల రూపాయలవరకు ఉంటుంది. పెనాల్టీని ఆయా కేసులను బట్టి వస్తువులు, ఉత్పత్తుల విలువకు పదిరెట్ల వరకు విధించవచ్చు.
క్యుసిఒ ప్రమాణాలను ఈ ఉత్పత్తులకు అమలు చేయడం, వినియోగదారుల రక్షణకే కాకుండా, ఇది దేశంలో తయారీ నాణ్యతను పెంపొందిస్తుంది. అలాగే దేశంలోని నాశిరకం ఉత్పత్తులు దిగుమతి కాకుండా నిరోధిస్తుంది.
నాణ్యతా పరిరక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలతోపాటు, నాణ్యతా ప్రమాణాల పరీక్షకు ప్రయోగశాలలు, ప్రాడక్టు మాన్యువల్స్ వంటివి ఇండియా లొ నాణ్యమైన ఉత్పత్తుల తయారీ వాతావరణం ఏర్పడుతుంది.
పైన పేర్కొన్న చర్యల ద్వారా, భారత ప్రభుత్వం దేశంలో ప్రపంచశ్రేణి నాణ్యత గల ఉత్పత్తులను తయారు చేయాలని సంకల్పంగా పెట్టుకుంది. తద్వారా ప్రధానమంత్రి దార్శనికత అయిన ఆత్మనిర్భర భారత్ సాకారమవుతుంది.
డ్రమ్ములు, టిన్ల (నాణ్యతా నియంత్రణ )ఆర్డర్ 2023, ను కింద క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చు..
***
(Release ID: 1970597)
Visitor Counter : 67