వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

'రాగి ఉత్పత్తుల' కోసం క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లను నోటిఫై చేసిన డి పిఐఐటీ

Posted On: 23 OCT 2023 1:22PM by PIB Hyderabad

డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డి పిఐఐటీ), వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిబఐఎస్), వాటాదారులతో సంప్రదింపులు జరిపి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (క్యు సి ఒ)ను నోటిఫై చేయడానికి కీలక ఉత్పత్తులను గుర్తిస్తోంది. ఇది 318 ఉత్పత్తి ప్రమాణాలను కలిగి ఉన్న 60 కి పైగా కొత్త క్యూసిఓల అభివృద్ధికి దారితీసింది. ఇది తొమ్మిది ప్రమాణాల రాగి ఉత్పత్తులను కలిగి ఉంటుంది.

రాగి మృదువైన ,  సుతి మెత్తని లోహం, దీనిని వాహకత్వం కోసం విద్యుత్ తీగలు , కేబుల్స్. లోనూ, మన్నిక కోసం ప్లంబింగ్, పారిశ్రామిక యంత్రాలు,  నిర్మాణ సామగ్రి లోనూ, అధిక ఖచ్చితత్వంతో వేయగల మెషినబిలిటీ, తుప్పు నిరోధకత లోనూ ఉపయోగిస్తారు. రాగి,  దాని మిశ్రమాలను విద్యుత్ ఉత్పత్తి, పవర్ ట్రాన్స్ మిషన్, టెలికమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ లు , ఇంకా అనేక ఉపకరణాలలో ఉపయోగిస్తారు. కాబట్టి, రాగి ఉత్పత్తులు ఉత్తమ నాణ్యతతో ఉండాలి.దాని స్వచ్ఛతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదు.

డి పి ఐ ఐ టి 2023 అక్టోబర్ 20న క్యు సి ఒ కాపర్ ప్రొడక్ట్స్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2023ను నోటిఫై చేసింది, ఇందులో ఈ క్రిందివి ఉన్నాయి.

ఎలక్ట్రికల్ అప్లికేషన్ ల కోసంకాపర్ వైర్ రాడ్ లు

 

 వరస నెం.

 ఇండియన్ స్టాండర్డ్

 ఇండియన్ స్టాండర్డ్ పేరు

1

12444:2020

 ఎలక్ట్రికల్ అప్లికేషన్ ల కోసంకాపర్ వైర్ రాడ్ లు

2

613:2000

విద్యుత్ అవసరాల కోసం  కాపర్ రాడ్ లు,  బార్ లు

3

1897:2008

 విద్యుత్ అవసరాల కోసం  కాపర్ స్ట్రిప్

4

4171:1983

 సాధారణ అవసరాల కోసం  రాగి కడ్డీలు , బార్ లు

5

1545:1994

 కండెన్సర్లు, హీట్ ఎక్స్ఛేంజర్ ల కోసం సాలిడ్. రాగి,  రాగి గొట్టాలు

6

2501:1995

 సాధారణ ఇంజనీరింగ్ ప్రయోజనాల కోసం సాలిడ్ రాగి గొట్టాలు

7

14810:2000

 ప్లంబింగ్ కోసం రాగి గొట్టాలు- స్పెసిఫికేషన్

8

10773:1995

 శీతలీకరణ, ఎయిర్ కండిషనింగ్ ప్రయోజనాల కోసం రాగి ట్యూబులు

9

4412:1981

 సాధారణ ఇంజనీరింగ్ ప్రయోజనాల కోసం కాపర్ వైర్లు

 

ప్ర ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, నాణ్యమైన ఉత్పత్తుల తయారీ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ , "మన ప్రజల సామర్థ్యం , దేశ విశ్వసనీయతతో, అత్యున్నత నాణ్యత కలిగిన భారతీయ ఉత్పత్తులు సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. ప్రపంచ శ్రేయస్సుకు దోహదపడే ఆత్మనిర్భర్ భారత్ విలువలకు ఇది నిజమైన నివాళి అవుతుంది" అని అన్నారు.

దీనికి అనుగుణంగా డి పిఐఐటి తన పరిధిలోని పారిశ్రామిక రంగాలకు బి ఐ ఎస్, పరిశ్రమలు, ఇతర భాగస్వాముల సహకారంతో దేశంలో క్వాలిటీ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసే మిషన్ మోడ్ లో ఉంది. క్యు సి ఒ లు దేశంలో తయారీ నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తుల బ్రాండ్, విలువను కూడా పెంచుతాయి. అభివృద్ధి టెస్టింగ్ ల్యాబ్ లు, ప్రొడక్ట్ మాన్యువల్స్, టెస్ట్ ల్యాబ్ ల అక్రిడిటేషన్ మొదలైన వాటితో పాటు ఈ కార్యక్రమాలు భారతదేశంలో నాణ్యమైన పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడతాయి.

బి ఐ ఎస్  కన్ఫర్మేషన్ అసెస్మెంట్ రెగ్యులేషన్స్, 2018లోని స్కీమ్-1 కింద క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ (క్యు సి ఒ), నిర్బంధ రిజిస్ట్రేషన్ ఆర్డర్ (సి ఆర్ ఒ) నోటిఫికేషన్ ద్వారా తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయకపోతే ఏదైనా ఉత్పత్తికి జారీ చేసే ప్రామాణికం స్వచ్ఛంద ఆమోదం కోసం జారీ చేయబడుతుంది. క్యూసిఓలను నోటిఫై చేయడం ఉద్దేశం- దేశీయంగా తయారైన ఉత్పత్తుల నాణ్యతను పెంచడం, భారతదేశంలోకి నాసిరకం ఉత్పత్తుల దిగుమతులను నిరోధించడం, మానవ, జంతు లేదా మొక్కల ఆరోగ్యం,  పర్యావరణ భద్రత కోసం అక్రమ వాణిజ్య పద్ధతులను నిరోధించడం .

ఈ-గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి ఆరు నెలల గడువు ముగియడంతో క్యు సి ఒ  అమల్లోకి వస్తుంది. దేశీయ చిన్న/ సూక్ష్మ పరిశ్రమలను పరిరక్షించడానికి, క్యూసిఒ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సజావుగా అమలయ్యేలా చూడటానికి, చిన్న / సూక్ష్మ పరిశ్రమలకు కాలపరిమితికి సంబంధించి సడలింపులు ఇచ్చారు, చిన్న పరిశ్రమలకు అదనంగా మూడు నెలలు, క్యూసిఓ అమలుకు సంబంధించి సూక్ష్మ పరిశ్రమలకు అదనంగా ఆరు నెలలు ఇచ్చారు.

క్యు సి ఒ ల అమలుతో బిఐఎస్ చట్టం-2016 ప్రకారం నాన్ బిఐఎస్ సర్టిఫైడ్ ఉత్పత్తుల తయారీ, నిల్వ, అమ్మకాలు నిషేధించబడతాయి. బిఐఎస్ చట్టంలోని నిబంధనను ఉల్లంఘిస్తే మొదటి నేరానికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా కనీసం రూ.2 లక్షల జరిమానా విధించవచ్చు. రెండోసారి, ఆ తర్వాత నేరాలకు పాల్పడితే జరిమానా కనిష్టంగా రూ.5 లక్షలకు, వస్తువులు, వస్తువుల విలువకు పది రెట్లు పెరుగుతుంది.

ఈ ఉత్పత్తుల కోసం క్యుసిఒ అమలు వినియోగదారుల భద్రతకు మాత్రమే కాకుండా, దేశంలో తయారీ నాణ్యతా ప్రమాణాలను మెరుగుపరుస్తుంది . భారతదేశంలో నాసిరకం ఉత్పత్తుల దిగుమతులను నిరోధిస్తుంది. ఈ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్, ప్రొడక్ట్ మాన్యువల్స్ మొదలైనవి ఉన్నాయి.

పైన పేర్కొన్న కార్యక్రమాలతో, భారత ప్రభుత్వం దేశంలో మంచి నాణ్యత కలిగిన ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, తద్వారా "ఆత్మనిర్భర్ భారత్" ను సృష్టించాలనే ప్రధాన మంత్రి దార్శనికత సాకారమవుతుంది.

కాపర్ ప్రొడక్ట్స్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డర్, 2023ను ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.

***



(Release ID: 1970594) Visitor Counter : 39