మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పనిప్రదేశ్ సామర్ధ్యాన్ని పెంచడంః నైపుణ్యాల అభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రచారం 3.0
प्रविष्टि तिथि:
21 OCT 2023 3:23PM by PIB Hyderabad
నైపుణ్యాల అభివృద్ధి & వ్యవస్థాపకత (ఎంఎస్‌డిఇ) మంత్రిత్వ శాఖ ప్రస్తుతం మూడవవారం తన సంచలనాత్మక చొరవ, ప్రత్యేక ప్రచారం 3.0ను కొనసాగిస్తోంది. అక్టోబర్ 2, 2023న ప్రారంభమైన ఈ చొరవ, కార్యనిర్వహణను ఆదర్శీకరించి, అనుకూలపరిచి, జాతీయ సంస్థలు, ఇనిస్టిట్యూట్‌లు, దిగువ విభాగాలు, ఎంఎస్‌డి ఆవరణల వ్యాప్తంగా సామర్ధ్యాన్ని పెంచుతుంది.
సమర్ధవంతమైన స్థల నిర్వహణ, మెరుగుపరిచిన పనిప్రదేశ వాతావరణాన్ని సృష్టించడం చుట్టూ ఈ ప్రత్యేక ప్రచారం 3.0 నడుస్తోంది. పారిశుద్ధ్యంలో ఉన్నత ప్రమాణాలను, కార్యాచరణ సమర్ధతలో గణనీయమైన పురోగతిని ఈ ప్రచారం పట్టి చూపుతుంది.
సన్నాహక దశలో ఎంఎస్‌డిఇ పెండింగ్‌లో ఉన్న విషయాలను పరిష్కరించడానికి, ప్రచార సమయ వ్యవధిలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిస్కరించడానికి ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను నిర్దేశించింది. మంత్రిత్వ శాఖ రికార్డుల ప్రకారం 2023 అక్టోబర్ 20 వరకు ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడం, భౌతిక ఫైళ్ళను సమీక్షించడం, పరిశుభ్రత ప్రచారాలను నిర్వహించడం, స్థలాన్ని ఖాళీ చేసి ఉపయోగించడంలో గణనీయమైన పురోగతిని సాధించింది.
తన ఆధీన సంస్థలతో కలిసి ఎంఎస్‌డిఇ ప్రత్యేక ప్రచారం 3.0 ముగింపు నాటికి అపరిష్కృతంగా ఉన్న అన్ని విషయాలను పరిష్కరించడానికి స్థిరమైన నిబద్ధతను కలిగి ఉంది. ఇది దాని సమర్ధత, జవాబుదారీతనం పట్ల అంకితభావాన్ని నొక్కి చెబుతుంది.
ఈ చొరవ పురోగతిని 6 అక్టోబర్ 2023న & 16 అక్టోబర్ 2023న సీనియర్ అధికారులతో కలిసి కార్యదర్శి అతుల్ కుమార్ త్రివేది వ్యక్తిగతంగా సమీక్షించారు. ఈ అధికారులు ప్రచార లక్ష్యాలను చేరుకోవడానికి శ్రద్ధగా పని చేస్తోంది. అలాగే ప్రచార లక్ష్యాలను విజయవంతంగా అమలు చేయడానికి రోజువారీ పురోగతిని పర్యవేక్షించే అప్రమత్తమైన బృందం వీరికి మద్దతును ఇస్తోంది.
***
(रिलीज़ आईडी: 1969858)
आगंतुक पटल : 133