అంతరిక్ష విభాగం

అబార్ట్ మిషన్-1 (టివి-డి1) టెస్ట్ ఫ్లైట్ విజయం “గగన్‌యాన్” ప్రయోగానికి ముందు వరుస సీక్వెన్షియల్ ట్రయల్ ఫ్లైట్‌లను తెలియజేస్తుందని చెప్పిన కేంద్ర అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అంతరిక్ష రంగాన్ని స్వయం నిర్దేశిత నిబంధనలు మరియు సంకెళ్ల నుండి "అన్‌లాక్" చేసినప్పటి నుండి ఇస్రోలో మానసిక స్థితి ఉల్లాసంగా ఉంది మరియు అంతరిక్ష ప్రాజెక్టులలో సహకరించడానికి పరిశ్రమతో పాటు ప్రైవేట్ భాగస్వాములు ఒకరితో ఒకరు పోటీపడుతున్నారని తెలిపిన డాక్టర్ జితేంద్ర సింగ్

“గగన్‌యాన్‌” మిషన్ ద్వారా క్రూడ్ హ్యూమన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించే ఇస్రో ప్రయాణంలో నేటి వ్యాయామం మొదటి అడుగు: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 21 OCT 2023 12:18PM by PIB Hyderabad

ఈ ఉదయం అబార్ట్ మిషన్-1 (టివి-డి1) టెస్ట్ ఫ్లైట్ విజయం చివరి “గగన్‌యాన్‌” ప్రారంభానికి ముందు వరుస సీక్వెన్షియల్ ట్రయల్ ఫ్లైట్‌లను తెలియజేస్తుందని కేంద్ర  సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. మొత్తం ప్రక్రియ అనుకున్నట్లుగా పూర్తి అయిన వెంటనే, "గగన్‌యాన్‌" క్రూ మాడ్యూల్ (సిఎం) ప్రారంభ వెర్షన్‌ను మోసుకెళ్ళే ఒకే ఇంజన్ రాకెట్‌తో ) దాని స్ప్లాష్ కోసం పారాచూట్‌ను ఉపయోగించి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తు వరకు వెళ్లింది.

 

1.jpg

 

"గగన్‌యాన్" మిషన్ ద్వారా సిబ్బందితో కూడిన మానవ అంతరిక్ష నౌకను ప్రయోగించే ఇస్రో ప్రయాణంలో ఇది కీలకమైన దశ అని అంతరిక్ష శాఖ సహాయ మంత్రి అన్నారు. నేటి ప్రయోగం గగన్‌యాన్ మిషన్‌లోని క్రూ మాడ్యూల్‌పై క్రూ ఎస్కేప్ సిస్టమ్ పనితీరును పరీక్షించిందని ఆయన చెప్పారు. ప్రాథమికంగా ఇది భద్రతా యంత్రాంగాన్ని పరీక్షించింది. ఒకవేళ మిషన్ పనిచేయకపోవడం వల్ల ఆగిపోయినట్లయితే ఇది "గగన్‌యాన్‌" మిషన్  సిబ్బందిని స్పేస్‌క్రాఫ్ట్ నుండి తప్పించుకోవడానికి అనుమతిస్తుందని చెప్పారు.

 

చంద్రయాన్-3 విజయవంతంగా మూన్ ల్యాండింగ్ అయిన రెండు నెలల తర్వాత ఈరోజు జరిగిన ఈవెంట్ వ్యవస్థలు మరియు విధానాల పరీక్షల శ్రేణికి మార్గం సుగమం చేసిందని చివరికి 2025వ సంవత్సరంలో అంతరిక్షంలోకి భారతీయ వ్యోమగామిని ప్రయోగించే లక్ష్యంతో ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష రంగాన్ని స్వయం నిర్దేశిత నిబంధనలు మరియు సంకెళ్ల నుండి "అన్‌లాక్" చేసినప్పటి నుండి ఇస్రోలో మానసిక స్థితి ఉల్లాసంగా ఉంది మరియు అంతరిక్ష ప్రాజెక్టులలో సహకరించండానికి పరిశ్రమతో పాటు ప్రైవేట్ భాగస్వాములు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని డాక్టర్‌ జితేంద్ర సింగ్ చెప్పారు. ఇది బూస్ట్ ఇవ్వడమే కాకుండా విజ్ఞానం మరియు ఆర్థిక పరంగా భారీ విలువ జోడింపును అందించింది. దీనికి నిదర్శనం ఏంటంటే మూడు సంవత్సరాల స్వల్ప వ్యవధిలో విజయవంతమైన స్టార్టప్‌ల సంఖ్య 5 కంటే తక్కువ నుండి 150 కంటే ఎక్కువకు చేరిందని ఆయన తెలిపారు.

 

2.jpg


"వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్" అనే సామెతను ఉటంకిస్తూ ఈ రోజు సాధించిన టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1 (టివి-డి1) "గగన్‌యాన్" ప్రాజెక్ట్ నుండి సిబ్బంది తప్పించుకునే విధానాన్ని ప్రదర్శించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ టెస్ట్ ఫ్లైట్ మిగిలిన అర్హత పరీక్షలు మరియు మానవరహిత మిషన్‌లకు వేదికగా నిలుస్తుందని ఇది భారతీయ వ్యోమగాములతో మొదటి గగన్‌యాన్ మిషన్‌కు దారితీస్తుందని అన్నారు.

"గగన్‌యాన్" మిషన్‌లో మానవ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉందని మంత్రి అన్నారు. క్రూ మాడ్యూల్ (సిఎం) అనేది సిబ్బందికి అంతరిక్షంలో పర్యావరణం వంటి భూమితో నివాసయోగ్యమైన స్థలం, అయితే సర్వీస్ మాడ్యూల్ (ఎస్‌ఎం) అనేది కక్ష్యలో ఉన్నప్పుడు సిఎంకి అవసరమైన సహాయాన్ని అందించడానికి ఉపయోగించబడుతుంది.

ప్రధాని మోదీ సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో భారతదేశ అంతరిక్ష కార్యక్రమం అంతరిక్షంలోకి తన మొదటి మానవ సహిత మిషన్ మరియు తరువాత చంద్రునిపైకి మొదటి భారతీయ వ్యోమగామిని దింపడం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన తెలిపారు.

 

image.png


డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇటీవలి చంద్రయాన్-3 మరియు ఆదిత్య ఎల్‌1 మిషన్‌లతో సహా గత 4 నుండి 5 సంవత్సరాలలో ఊపందుకున్న భారత అంతరిక్ష కార్యక్రమాల విజయాన్ని పురస్కరించుకుని భారతదేశం ఇప్పుడు కొత్త మరియు ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని సాధించాలని ప్రధాని మోదీ చెప్పారని అన్నారు. 2035 నాటికి 'భారతీయ అంతరిక్ష స్టేషన్' (భారత అంతరిక్ష కేంద్రం) ఏర్పాటు చేయడం మరియు 2040 నాటికి చంద్రునిపైకి మొదటి భారతీయుడిని పంపడం వంటి లక్ష్యాలు ఇందులో ఉన్నాయని చెప్పారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రంగాన్ని అన్‌లాక్ చేయడం ద్వారా  అంతరిక్ష రంగంలో భారతదేశ సత్తానుఈ రోజు ప్రపంచం గుర్తిస్తోందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

 

****



(Release ID: 1969809) Visitor Counter : 87