రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ప్రచారం 3.0 మూడవ వారంలోకి ప్రవేశించిన రక్షణ విభాగం
వ్యర్ధాల నుంచి సంపద, భూమిని పరిక్షించండి అన్న చొరవల కింద స్టీల్, ప్లాస్టిక్ వ్యర్ధాలతో రహదారులను నిర్మించిన బిఆర్ఒ
Posted On:
19 OCT 2023 4:23PM by PIB Hyderabad
స్వచ్ఛ భారత అభియాన్ కు అనుగుణంగా రక్షణ శాఖ ప్రత్యేక ప్రచారం 3.0 అమలు దశ (02-31 అక్టోబర్, 2023) మూడవ వారంలో ఉంది. సాగుతున్న ప్రచారం సందర్భంగా వినియోగిస్తున్న ఉత్తమ కార్యాచరణ పద్ధతుల్లో భాగంగా, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఒ) ఉక్కు ఉత్పత్తి ద్వారా వెలువడే వ్యర్ధపదార్ధమైన ఉక్కు చిట్టాన్నిఉపయోగించి ఒక రహదారిని నిర్మించారు. వ్యర్ధాల నుంచి సంపద చొరవలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌లో జోరామ్- కోలోరియాంగ్ మధ్య ఒక కిలోమీటర్ పొడవున నిర్మించిన ఈ రహదారికి 1200 ఎంటి ల ఉక్కు చిట్టాన్ని ఉపయోగించారు.
భూమిని పరిరక్షించండి అన్న పిలుపుకు స్పందించిన బిఆర్ఒ, లడాఖ్‌లో అధిక ఎత్తైన ప్రాంతంలోని సంకులో ప్లాస్టిక్ వ్యర్ధాలను ఉపయోగించి రహదారి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేశారు. ఇది ఈ రహదారులను మన్నికైనవిగా, చవకగా, పర్యావరణ అనుకూలంగా చేస్తుంది.
***
(Release ID: 1969726)
Visitor Counter : 56