రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ప్రత్యేక ప్రచారం 3.0 అమలు దశ యొక్క మూడవ వారంలో రక్షణ శాఖ

Posted On: 19 OCT 2023 4:48PM by PIB Hyderabad

స్వచ్ఛత అభియాన్ ప్రత్యేక ప్రచారం 3.0 లో భాగంగా రక్షణ శాఖ  అమలు దశ (02-31 అక్టోబర్, 2023) యొక్క మూడవ వారంలో పరిశుభ్రత కార్యక్రమం కొనసాగుతోంది. ప్రత్యేక ప్రచారం 3.0 యొక్క సన్నాహక దశలో, రక్షణ శాఖ భారతదేశం అంతటా మొత్తం 3066 ప్రాంతాలు/ప్రదేశాలను గుర్తించింది. స్వచ్ఛత అభియాన్‌ను ప్రజల-కేంద్రీకృత భాగస్వామ్యం తో చేపట్టాలి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, మిలిటరీ హాస్పిటల్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, సైనిక్ స్కూల్స్, క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ మరియు కంటోన్మెంట్స్ వంటి వివిధ సంస్థలకు సంబంధించిన స్థానాలలో పరిశుభ్రత కార్యక్రమం కొనసాగుతోంది . 18.10.23 నాటికి 1832 అటువంటి ప్రదేశాలను ఇప్పటికే శుభ్రం చేసారు.

 

18.10.2023 వరకు మొత్తం 28,859  ఫైళ్లను ఇప్పటికే సమీక్షించారు అలాగే అలాంటి 16,485 ఫైళ్లను తొలగించాలని ప్రతిపాదించబడింది. 18.10.23 న  మొత్తం 92,850 చదరపు అడుగుల స్థలం ఖాళీ చేసారు అలాగే నిరుపయోగ వాహనాల వేలం మరియు ఇతర చెత్త మరియు వాడుకలో లేని వస్తువులను పారవేయడం ద్వారా రూ. 55.43 కోట్ల ఆదాయం వచ్చింది.

 

కొనసాగుతున్న ప్రచారంలో అమలు చేయబడిన ఉత్తమ పద్ధతులలో భాగంగా, కంటోన్మెంట్ బోర్డ్ డెహ్రాడూన్ పాలిథిన్ వ్యర్థాలను పారవేయడం కోసం డెహ్రాడూన్ కంటోన్మెంట్ ప్రాంతంలో "పాలిథీన్ కచ్రా బ్యాంక్"ని ప్రారంభించింది. పాలిథిన్ వ్యర్థాలు అంటే చిప్స్ రేపర్, పాలిథిన్ ప్యాకింగ్ బ్యాగులు, పాలిథిన్ బస్తాలు మొదలైన వాటిని ప్రజల నుండి కిలో రూ.03/- చొప్పున కొనుగోలు చేస్తారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని మూడు ప్రదేశాల్లో పాలిథిన్ కచ్రా బ్యాంకుల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 

సేకరించిన పాలిథిన్ వ్యర్థాలను హై డెన్సిటీ కాంపోజిట్ పాలిమర్ (హెచ్ డీ సీ పీ ) టైల్స్, బోర్డులు మొదలైన వాటి తయారీకి ఉపయోగిస్తారు. కంటోన్మెంట్ బోర్డు ప్రతి నెలా కనీసం 70 టన్నుల నుండి గరిష్టంగా 100 టన్నుల పాలిథిన్ వ్యర్థాలను కొనుగోలు చేస్తుంది.

 

నిరుపయోగంగా పడివున్న పాలిథిన్ బ్యాగులను వ్యర్థాలను ప్రజలు తమ ఇంటి మూలలలో  సేకరించి ఉంచవచ్చు అలాగే అటువంటి పాలిథిన్ వ్యర్థాలను విక్రయించడానికి నెలలో ఏ రోజునైనా సమీపంలోని "పాలిథిన్ కచ్రా బ్యాంక్"కి వెళ్లవచ్చు. అంతే కాకుండా ఇంటి నుండి చెత్తను సేకరించే వ్యక్తికి కూడా పాలిథిన్ వ్యర్థాలను ఇవ్వవచ్చు.

 

***



(Release ID: 1969722) Visitor Counter : 32


Read this release in: English , Urdu , Hindi , Tamil