సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రత్యేక ప్రచారం 3.0 లక్ష్యాలను చేరుకోవడానికి సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖలో పరిశుభ్రత కార్యక్రమం సజావుగా సాగుతోంది.
Posted On:
19 OCT 2023 4:50PM by PIB Hyderabad
సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న దాని అధీన/అనుబంధ కార్యాలయాల్లో ప్రత్యేక ప్రచారం 3.0 సజావుగా సాగుతోంది. ఇప్పటి వరకు 366 బహిరంగ పరిశుభ్రత ప్రచార కార్యక్రమాలు నిర్వహించి 592 ప్రదేశాలను శుభ్రం చేశారు. 5095 కిలోల చెత్త పారవేశారు. 13541 భౌతిక ఫైళ్లు సమీక్షించారు, 941 ఈ-ఫైళ్లు మూసివేయడం కోసం గుర్తించారు. ఇతర కార్యకలాపాలతో సహా ఎం పీ ల నుండి వచ్చిన 13 పెండింగ్ సూచనలు అమలుచేశారు. ప్రచార కాలానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలు మరియు విజ్ఞప్తుల లక్ష్యాలు ఇప్పటికే పరిష్కరించబడ్డాయి.
పరిశుభ్రత ప్రయత్నాల పై అవగాహన కల్పించడానికి మరియు స్వచ్ఛత సందేశాన్ని వ్యాప్తి చేయడం లో భాగంగా ప్రచారం కోసం మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా, ఇతర మాధ్యమాలు ఇతర ప్లాట్‌ఫారమ్‌లను కూడా చురుకుగా ఉపయోగిస్తోంది. మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రచారం యొక్క 2వ వారం వరకు 300 కంటే ఎక్కువ ట్వీట్లు పోస్ట్ చేయబడ్డాయి/మళ్లీ తిరిగి పోస్ట్ చేసారు.
శుభ్రపరచబడిన ప్రదేశాల నమూనా చిత్రాలు (ముందు & తరువాత) మరియు సోషల్ మీడియా పోస్ట్‌లు క్రింద ఉన్నాయి:-
ముందు
తర్వాత
(Release ID: 1969720)
Visitor Counter : 56