రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రైల్ వే ఉద్యోగులకు 1968.87 కోట్ల రూపాయలవిలువైన ఉత్పాదకత తో ముడిపడినటువంటి బోనస్ (పిఎల్ బి) కి ఆమోదం  తెలిపిన  మంత్రిమండలి

Posted On: 18 OCT 2023 3:25PM by PIB Hyderabad

అర్హత కలిగిన నాన్-గజెటెడ్ రైల్ వే ఉద్యోగులు అందరికి 2022-23 ఆర్థిక సంవత్సరాని కి గాను 78 రోజుల వేతనాని కి సమానమైనటువంటి ఉత్పాదకత తో ముడిపడ్డ బోనస్ (పిఎల్ బి) ని ఇవ్వడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని తెలిపింది. ఈ రైల్ వే ఉద్యోగుల లో ట్రాక్ మేంటెనర్, లోకో పైలట్ లు , ట్రేన్ మేనేజర్ లు (గార్డు లు), స్టేశన్ మాస్టర్ లు, సూపర్ వైజర్ లు, టెక్నీశియన్ లు, టెక్నీశియన్ హెల్పర్ లు, పాయింట్స్ మన్, మినిస్టీరియల్ స్టాఫ్ మరియు ఇతర గ్రూప్ సిస్టాఫ్ (ఆర్ పిఎఫ్/ఆర్ పిఎస్ఎఫ్ సిబ్బంది మినహా) ఉన్నారు.

 

రైల్ వే సిబ్బంది శ్రేష్ఠమైన పనితీరు కు గుర్తింపు గా 11,07,346 మంది రైల్ వే ఉద్యోగుల కు 1968.87 కోట్ల రూపాయల పిఎల్ బి ని చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదాన్ని తెలియజేసింది. 2022-23 వ సంవత్సరం లో రైల్ వేస్ పనితీరు చాలా బాగుంది. రైల్ వేస్ రికార్డు స్థాయి లో 1509 మిలియన్ టన్నుల సరకుల ను మరియు సుమారు 6.5 బిలియన్ మంది ప్రయాణికుల ను గమ్యస్థానాల కు చేర్చింది.

 

ఈ రికార్డు స్థాయి ప్రదర్శన కు అనేక అంశాలు తోడ్పడ్డాయి. ఆ యా అంశాల లో రైల్ వేస్ లో ప్రభుత్వం రికార్డు స్థాయి మూలధన వ్యయాన్ని చొప్పించినందువల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడడం, కార్యకలాపాల లో సామర్థ్యం పెరగడంతో పాటుగా ఉత్తమమైన సాంకేతిక విజ్ఞానం వంటివి భాగం గా ఉన్నాయి.

 

పిఎల్ బి ని చెల్లించడం అనే ప్రక్రియ రైల్ వే ఉద్యోగులు కష్టపడి పనిచేస్తూ వారి పనితీరు ను మరింత గా మెరుగు పరచుకోవడాని కి ప్రేరణ ను ఇచ్చేటటువంటి ఒక ప్రోత్సాహకం గా ఉండబోతోంది.

 

 

**


(Release ID: 1968944) Visitor Counter : 56