రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్వాస్లా 75 సంవత్సరాల వార్షికోత్సవాలు పురస్కరించుకుని మొట్టమొదటిసారిగా నిర్వహించిన మారథాన్ లో పాల్గొన్న 13,500 మంది ప్రజలు

Posted On: 16 OCT 2023 12:08PM by PIB Hyderabad

నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డిఏ), ఖడక్వాస్లా స్థాపించి 75 సంవత్సరాలైన సందర్బంగా ఏడాది పొడవునా జరుపుకునే వేడుకల్లో భాగంగా, అక్టోబర్ 15న తన ప్రాంగణంలో మొట్టమొదటి మారథాన్‌ను నిర్వహించింది. అందరికీ స్ఫూర్తివంతంగా ఉండాలన్న ఉద్దేశంతో 'ఎన్డిఏ మారథాన్' దేశవ్యాప్తంగా 13,500 మంది వ్యక్తులను ప్రేరేపిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా యువతకు, అకాడమీ శిక్షణ సౌకర్యాలు, వారసత్వంపై అత్యున్నత స్థాయి ప్రత్యేక సంగ్రహావలోకనం ఇచ్చింది.
ఈ కార్యక్రమంలో 42-కిలోమీటర్ల పూర్తి మారథాన్, 21-కిలోమీటర్ల హాఫ్-మారథాన్, 10-కిలోమీటర్ల , 5-కిలోమీటర్ల, 3-కిలోమీటర్ల పరుగులతో సహా బహుళ రేసు విభాగాలు ఉన్నాయి, అన్నీ ఏకకాలంలో జరుగుతాయి. ఎన్డిఏ మహారాష్ట్రలోని పూణేలోని ఖడక్వాస్లాలో, సహ్యాద్రి పర్వత శ్రేణుల దిగువన ఉంది. 7,015 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ఎన్డిఏ క్యాంపస్  చుట్టూ సుందరమైన కొండలు, పెద్ద సరస్సు ఉంది. ఎన్డిఏ క్యాంపస్ లోపల రన్నింగ్ ట్రాక్ 21-కిమీ లూప్, ఇది క్యాంపస్ లో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

మారథాన్‌లో పాల్గొన్న ఎక్కువ వయసు కలిగిన వ్యక్తికి 96 ఏళ్లు, అత్యంత తక్కువ వయసు కలిగిన చిన్నారికి ఐదేళ్లు. 

వివిధ కేటగిరీల నుండి విజేతలు ఈ క్రింది విధంగా ఉన్నారు:

 

దూరం 

కేటగిరీ 

వయో పరిమితి 

మొదటి స్థానం 

రెండవ స్థానం 

మూడవ స్థానం 

42-km

Male

18 - 35 yrs

Nishu Kumar

Shrikanta Mahato

Ganesh

Khomane

36 - 45 yrs

Krishna

Sirothia

Lt Col

Swaroop

Singh Kuntal

Vasant

Pandita

 

 

Female

18 - 35 yrs

Lt Cdr Anjani Pandey

Rajni Singh

Ravita

Ramvilas Rajbhar

36 - 45 yrs

Ashwini Gokul Deore

Arti Chandan Agrawal

Neha Lodha

21-km

Male

18 - 35 yrs

Parasaran Halihol

Cdt Aron Bett

Cdt Ahmed

Ali

36 - 45 yrs

Sanjay Negi

Ankush Gupta

Yogesh Sanap

Female

18 - 35 yrs

Vedanshi Joshi

Bhavneet Kaur

Priyanka

Dashrath Paikrav

36 - 45 yrs

Anubhuti

Chaturvedi

Netra

Anju

Chaudhary

10-km

Male

14 - 18 yrs

Mohit Yadav

Vaibhav Sanjay Yedage

Avinash Londhe

19 - 35 yrs

Anurag

Konkar

Anandu

Ashok AS

Kommindhala Purushotham

36 - 45 yrs

Narendra Patel

Sachin Nikam

Ajit Nikam

Female

14 - 18

yrs

Paridhi

Budhwar

Siddhi Madhav Gurav

Hreeya

Nerav shah

19 - 35 yrs

Cdt Ritul

Cdt Ishita

Sangwan

Jayshree Vanama

36 - 45 yrs

Trupti Gupta

Haseena Themali

Aditi Mohiley

 

జనవరి 16, 2024 నాటికి ఎన్డిఏ 75 అపూర్వమైన  వసంతాలు పూర్తి చేసుకుంటుంది. జనవరి 16, 2023న ప్రారంభమై ఏడాది పొడవునా సాగే ఉత్సవాల్లో భాగంగా, వివిధ విద్యా, క్రీడలు, అడ్వెంచర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 

***


(Release ID: 1968347) Visitor Counter : 59