వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నాణ్యతా ప్రమాణాల విషయంలో ప్రజలలో చైతన్యం దేశానికి నూతన దిశా నిర్దేశం చేయనున్నాయి : ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ పియూష్ గోయల్.


బిఐఎస్ ప్రమాణాల క్లబ్లు ఏర్పాటుతో 2 లక్షల మందికిపైగా విద్యార్థులకు ప్రయోజనం. ఇలాంటి మరిన్ని క్లబ్ల ఏర్పాటు :శ్రీ గోయల్.

ప్రధానమంత్రి దార్శనికత దేశంలో నాణ్యమైన మౌలిక సదుపాయాల కల్పనకు వీలుకల్పించింది.: శ్రీ గోయల్

Posted On: 13 OCT 2023 8:55PM by PIB Hyderabad

నాణ్యతా ప్రమాణాల విషయంలో ప్రజలలో చైతన్యం,   అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశానికి నూతన దిశానిర్దేశం  
చేసేందుకు సహాయపడనున్నట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖమంత్రి శ్రీ పియూష్ గోయల్ అన్నారు.
ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.‘మెరుగైన ప్రపంచానికి ఉమ్మడి దార్శనికత: సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రమాణాలు’ పేరుతో ఏర్పాటైన కార్యక్రమంలో
మంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని భారత ప్రమాణాల సంస్థ (బ్యూరో ఆప్ ఇండియన్ స్టాండర్డ్స్ –బిఐఎస్) , న్యూఢిల్లీలోని భారత్ మండలంలో ఏర్పాటు చేసింది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా , ప్రజలలో నాణ్యతపై అవగాహన కల్పించడం జరిగిందని, ఇది ప్రపంచస్థాయి మౌలికసదుపాయాల కల్పనకు వీలు కల్పించిందని చెప్పారు. ఇందుకు
భారత్ మండలం ఇందుకు గొప్ప ఉదాహరణ అని ఆయన అన్నారు.


ఈ ప్రపంచశ్రేణి భవనంలో జి 20 శిఖరాగ్ర సమ్మేళనం నిర్వహించడంతో దేశం , అంతర్జాతీయంగా మంచి గౌరవాన్ని పొందిందని ఆయన అన్నారు.
.బిఐఎస్ కు సంబంధించిన చొరవ గురించి మాట్లాడుతూ శ్రీ పియూష్ గోయల్, ఇవాళ దేశవ్యాప్తంగా 7వేల బి.ఐ.ఎస్ ప్రమాణాల క్లబ్లు ఉన్నాయని దీనితొ సుమారు రెండు లక్షల మంది విద్యార్ధులు ప్రయోజనం పొందారని మంత్రి తెలిపారు.
వచ్చే ఏడాది నాటికి బిఐఎస్ ఇలాంటి పదివేల క్లబ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని ఆయన అన్నారు.
నాణ్యతా అంశాలపై కొత్త వీడియోలు, పుస్తకాలను రూపొందించడం జరుగుతుందని, వీటిని కొన్నింటిని ఈరోజు విడుదల చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రమాణాలకు సంబంధించిన అంశాలపై పంచాయతి స్థాయివరకు ప్రజలలో అవగాహన తీసుకువస్తున్నట్టు తెలిపారు.
రాగల రోజులలో ఇది మంచి ఫలితాలు ఇవ్వనున్నదని మంత్రి తెలిపారు.వినియోగదారుల వ్యవహారాల విభాగం దేశంలోని  ప్రతి పౌరుడి జీవితానికి సంబంధించిన అంశాలతో ప్రమేయం కలిగినదని శ్రీ గోయల్ అన్నారు. ప్రమాణాలకు సంబంధించిన వాతావరణం ఇటీవలి కాలంలో

బాగా విస్తరించిందని, ఇది దాదాపు అన్ని రంగాలకు విస్తరించిందని అన్నారు. ఇది వ్యవసాయం, రోడ్లు, ఆరోగ్య పరిరక్షణ, వివిధరాష్ట్రాలు, వివిధప్రవేటు రంగాలకు  విస్తరించిందని చెప్పారు.
ప్రమాణాల విషయంలో మన లక్ష్యాలు చేరుకునేందుకు ఎలాంటి లోపాలు లేని వస్తువులు ఉత్పత్తి చేసే దిశగా అందరూ ప్రయత్నాలు సాగించాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో  కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ , పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయమంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే,  వినియోగదారుల వ్వవహారాల
విభాగం కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్, వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ మతి నిధి ఖరే, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరక్టర్ జనరల్ శ్రీ ప్రమోద్ కుమార్ తివారి పాల్గొన్నారు.
ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని ప్రతి ఏడాది అక్టోబర్ 14న నిర్వహిస్తారు.  ప్రపంచ శ్రేణి ప్రమాణాల సంస్థలతో కొలాబరేషన్ను ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించడం జరుగుతుంది.

2023 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ ప్రమాణాల దినోత్సవ ఇతి వృత్తం‘ మెరుగైన ప్రపంచానికి ఉమ్మడి దార్శనికత: మెరుగైన ఆరోగ్యం,  సంక్షేమం కోసం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల చేర్పు’ గా ఉంది.
సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు 3 లో అంతర్జాతీయంగా ఆరోగ్య స్థితిని మెరుగుపరచడం, మాతృత్వ, శిశు మరణాలను తగ్గించడం, ప్రధాన వ్యాధులను ఎదుర్కొవడం, అందరికీ ఆరోగ్య సేవలను అందుబాటులోకి
తీసుకురావడం వంటివి  ఉన్నాయి. ఇది సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ, నాణ్యమైన సేవల అందుబాటు ఎలాంటి ఆర్ధిక భారం పడకుండా చూడడం వంటి వాటి గురించి ప్రస్తావిస్తుంది.  వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు,
వాక్సినేషన్లు, మెరుగైన ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన, వంటి వాటిద్వారా ఎస్.డి.జి 3 ఆరోగ్య కరమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు కృషి చేస్తుంది. ఇది వ్యక్తులకు, కమ్యూనిటీలకు, దేశానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇది సురక్షితమైన,మెరుగైన,  మందులు అందుబాటులో ఉండే లా చూడడంతోపాటు, , వాక్సిన్లను అందరికీ చేరువ చేస్తుంది. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు పరస్పర సహకారం , వినూత్న పరిష్కారాలు,
 అంతర్జాతీయంగా ఆరోగ్య అసమానతల తొలగింపు వంటి వాటిని పరిష్కరించవలసి ఉంది.
ఈ థీమ్ మరింత సుస్థిరమైన, సమ్మిళిత ప్రపంచం ఏర్పాటు ప్రాధాన్యతను తెలియజేస్తుంది. ఇది వ్యక్తుల మంచి ఆరోగ్యానికి బాగుకు ప్రాధాన్యతను ఇస్తుంది.
ఈ ఈవెంట్, ప్రపంచ వ్యాప్తంగా నాణ్యతా ప్రమాణాలను రంగంలో విశేషకృషి చేసిన వారి సేవలను గుర్తించేందుకు , ఈ దిశగా భవిష్యత్ అవకాశాలకు వీలుకల్పించేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడనుంది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్), దేశవ్యాప్తంగా వినియోగదారుల కార్యకలాపాలు కేంద్రంగా , ప్రపంచ ప్రమాణాల దినోత్సవం సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించింది. ఇందుకు
 ఈ సంస్థకుగల విస్తృత నెట్ వర్క్, ప్రాంతీయ, బ్రాంచ్  కార్యాలయాల ద్వారా దీనిని నిర్వహించింది.
ప్రపంచ ప్రమాణాల దినోత్సవం 2023 లో భాగంగా నాణ్యతా అనుసంధానత కార్యక్రమం నిర్వహించారు. ఇందులో యువతతో అనుసంధానత, మనక్ మహోత్సవ్, ఇంటింటి అనుసంధానత వంటి కార్యక్రమాలు చేపట్టారు.
వీటి ద్వారా వారు బిఐఎస్ కేర్ యాప్, బిఐఎస్ ప్రమాణాల గురించి ప్రచారం చేయడానికి ప్రజల ఇళ్లవద్దకు వెళ్లారు.

 

***


(Release ID: 1967990) Visitor Counter : 74


Read this release in: English , Urdu , Hindi