రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రైళ్లలో మహిళల భద్రత కోసం ఆర్ పీ ఎఫ్ అంకితం - ఢిల్లీ హాఫ్ మారథాన్ 2023లో టీమ్ ఆర్ పీ ఎఫ్ పరుగులు


2023లో రైళ్ల లో ప్రమాదకర పరిస్థితుల నుండి 862 మంది మహిళలను ఆర్ పీ ఎఫ్ రక్షించింది

"ఆపరేషన్ నాన్హే ఫరిష్తే" కింద స్టేషన్లు మరియు రైళ్లలో ప్రమాదంలో ఉన్న 2,898 మంది తోడులేని బాలికలను ఆర్ పీ ఎఫ్ రక్షించింది అలాగే వారు ప్రమాదాలలో పడకుండా నిరోధించారు.

Posted On: 15 OCT 2023 2:06PM by PIB Hyderabad

మహిళలకు రైళ్లలో భద్రతను సురక్షితమైన ప్రయాణాన్ని ప్రచారం చేయడానికి ఈరోజు ఢిల్లీ హాఫ్ మారథాన్ 2023లో 25 మంది సభ్యుల ఆర్ పీ ఎఫ్ బృందం పాల్గొంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో మహిళల భద్రత మరియు రక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో ఆర్ పీ ఎఫ్  యొక్క వివిధ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రన్ వెనుక లక్ష్యం. ముఖ్యంగా, "మేరీ సహేలి" చొరవపై దృష్టి కేంద్రీకరించబడింది.

 

మహిళలకు సాధికారత కల్పించడం అనేది  భారతదేశం అభివృద్ధి దృష్టి కోణం లో చర్చించలేని భాగం. మన గౌరవ ప్రధానమంత్రి ఊహించిన సుసంపన్నమైన భారతదేశాన్ని సాధించడం బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేకించి విస్తృతమైన ప్రజా రవాణా నెట్‌వర్క్‌లో మహిళల భద్రతను నిర్ధారించడంపై ఆధారపడి ఉంటుంది. రైల్వేలు ప్రజా రవాణా యొక్క ప్రాథమిక మార్గంగా పనిచేస్తున్నందున, ప్రతిరోజూ రైలులో ప్రయాణించే మహిళల భద్రత మన దేశం యొక్క సమగ్ర అభివృద్ధికి కీలకమైనది.

 

రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్ పీ ఎఫ్ ) మహిళా రైల్వే ప్రయాణికుల భద్రతను పెంపొందించేందుకు కృషి చేస్తోంది. భారతదేశం యొక్క విస్తారమైన రైల్వే నెట్‌వర్క్‌లో పనిచేస్తున్న "మేరీ సహేలి" బృందాలు, సుదూర రైళ్లలో ఒంటరిగా ప్రయాణించే లక్షలాది మహిళలకు సహాయం మరియు భద్రతను అందిస్తున్నాయి. రైళ్లలో మరియు రైల్వే ప్రాంగణంలో మహిళల భద్రతను నిర్ధారించడానికి ఆర్ పీ ఎఫ్  యొక్క మహిళా సిబ్బంది వారి పురుష సహచరులతో కలిసి పని చేస్తారు.

2023లో ఆర్ పీ ఎఫ్  సిబ్బంది అద్భుతమైన పనితీరును ప్రదర్శించారు,  రైళ్ల లో ప్రమాదకర పరిస్థితుల నుండి 862 మంది మహిళలను రక్షించారు. "ఆపరేషన్ నాన్హే ఫరిష్తే" కింద వారు స్టేషన్లు మరియు రైళ్లలో ప్రమాదంలో ఉన్న 2,898 మంది తోడులేని బాలికలను రక్షించారు, వారు ప్రమాదాల మార్గంలో పడకుండా నిరోధించారు. అలాగే వారు మానవ అక్రమ రవాణాదారుల బారి నుండి 51 మంది మైనర్ బాలికలను మరియు 6 మంది మహిళలను రక్షించారు.

 

ఆర్ పీ ఎఫ్  మహిళా సిబ్బంది రైలు ప్రయాణాల్లో ప్రసవానికి గురైన 130 మంది తల్లులకు వారి గోప్యత మరియు గౌరవాన్ని అత్యంత సగౌరవంగా అందించారు. ఆర్ పీ ఎఫ్  సిబ్బంది 185,000 కంటే ఎక్కువ హెల్ప్‌లైన్ కాల్‌లకు ప్రతిస్పందిస్తూ ప్రయాణీకుల సమస్యలను, ముఖ్యంగా నిరుపేదలు, అనారోగ్యంగా ఉన్నవారు, వృద్ధులు మరియు ప్రత్యేక సామర్థ్యం ఉన్న మహిళల సమస్యలను పరిష్కరించడానికి వేగంగా చర్యలు తీసుకున్నారు.

 

ప్రజలలో అవగాహనను పెంచడానికి మరియు సహకారాన్ని పొందేందుకు ఆర్ పీ ఎఫ్  బృందం 15 అక్టోబర్ 2023న ఢిల్లీ హాఫ్ మారథాన్‌లో పాల్గొంది, ఈ ఉదాత్తమైన లక్ష్య సాధన కోసం ఆర్ పీ ఎఫ్  బృందం మరింత ముందుకు వెళుతుంది. డైరెక్టర్ జనరల్ నుండి కానిస్టేబుల్స్ వరకు వివిధ స్థాయిలలో వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్న 25 మంది సభ్యుల  బృందం  ఆర్ పీ ఎఫ్  యొక్క దేశవ్యాప్తతను సూచిస్తుంది. ఈ బృందంలో పంజాబ్, పశ్చిమ బెంగాల్ మరియు మహారాష్ట్రకు చెందిన నలుగురు మహిళా ఆర్ పీ ఎఫ్  సిబ్బంది ఆర్ పీ ఎఫ్  నారిశక్తి ప్రతినిధులుగా ఉన్నారు. మారథాన్ మార్గంలో ఆర్ పీ ఎఫ్  సిబ్బంది ప్రజలతో మమేకమై బ్యానర్‌లను ప్రదర్శించారు మరియు రైల్వేలలో మహిళల భద్రతను ప్రచారం చేయడానికి మరియు ఈ లక్ష్యాన్ని సాధించడానికి లబ్దిదారుల నుండి మద్దతును కోరేందుకు కరపత్రాలను పంపిణీ చేశారు. 

 

***


(Release ID: 1967984) Visitor Counter : 53