రక్షణ మంత్రిత్వ శాఖ
అక్టోబర్ 16, 2023 నుంచి ప్రారంభం కానున్న సైనిక కమాండర్ల సమావేశం
Posted On:
14 OCT 2023 2:35PM by PIB Hyderabad
సైనిక కమాండర్ల సదస్సు న్యూఢిల్లీలో 16 నుంచి 20 అక్టోబర్ 2023 వరకు జరుగనుంది. రెండేళ్ళకు ఒకసారి జరిగే ఉన్నత స్థాయి కార్యక్రమం భావనాత్మక స్థాయిలో చర్చలకు వ్యవస్థాగత వేదికగా ఉంటూ, భారతీయ సైన్యం కోసం ముఖ్యమైన విధానపరమైన నిర్ణయాలకు సహకరించి, సులభతరం చేస్తుంది.
ఈ ఏడాది అనుసరిస్తున్న కొత్త ఫార్మట్‌కు కొనసాగింపుగా, రానున్న సైనిక కమాండర్ల సమావేశాన్ని హైబ్రిడ్ (మిశ్రమ) ఫార్మాట్‌లో నిర్వహిస్తోంది. ఇందులో సైనిక కమాండర్లు, ఇతర సీనియర్ అధికారులు తొలి రోజున దృశ్య మాధ్యమం ద్వారా కలుసుకొంటారు. మిగిలిన చర్చలను భౌతికంగా నిర్వహిస్తారు.
గౌరవ రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 18 అక్టోబర్ 2023న ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రక్షణ సిబ్బంది అధిపతి జనరల్ అనిల్ చౌహాన్, జనరల్ మనోజ్ పాండే, సైనిక సిబ్బంది అధిపతి జనరల్ మనోజ్ పాండే, ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌధరి, వైమానిక సిబ్బంది అధిపతి ప్రసంగించనున్నారు. భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు డాక్టర్ అజయ్ కుమార్ సూద్, జాతీయ భద్రత కోసం సాంకేతికతను వినియోగించుకోవడం అన్న అంశంపై ప్రసంగించనున్నారు.
ఉన్నత స్థాయి నాయకత్వం ప్రస్తుత/ భవిష్యత్ భద్రతా దృశ్యాలపై చర్చించడమే కాకుండా, భారతీయ సైన్యం కార్యనిర్వహణా సంసిద్ధతను సమీక్షిస్తారు. జరుగుతున్న పరివర్తన ప్రక్రియ, శిక్షణాంశాలు, హెచ్ఆర్ నిర్వహణకు సంబంధించిన అంశాలు, సిబ్బంది, సీనియర్లను ప్రభావితం చేస్తున్న సమస్యల వంటి కీలక అంశాలపై లోతైన చర్చలు చేయనున్నారు. విస్త్రతమైన పరిధితో సైనిక కమాండర్ల సమావేశం భారతీయ సైన్యం ప్రగతిశీలకంగా, భవిష్యత్తును దర్శించే, అనుకూల, భవిష్యత్ సంసిద్ధతను కలిగి ఉండేలా చూస్తుంది.
***
(Release ID: 1967803)
Visitor Counter : 80