ఆయుష్
ప్రత్యేక ప్రచారం 3.0 దిశగా ఆయుష్ మంత్రిత్వ శాఖ కృషి
రెండవ వారంలో ప్రజా ఫిర్యాదుల అప్పీళ్ళలో 100 శాతాన్ని, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం
Posted On:
13 OCT 2023 6:31PM by PIB Hyderabad
పరిశుభ్రత కోసం ప్రత్యేక ప్రచారం 3.0లో ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిశుభ్రతను ప్రోత్సహించడం, వివిధ ప్రభుత్వ సంస్థలలో కార్యాలయాల అనుభవాలను మెరుగుపరచడం లక్ష్యంగా రెండవ వారంలో అంటే 7 నుంచి 13 అక్టోబర్ 2023వరకు నిర్వహించిన ప్రజా ఫిర్యాదులు (అప్పీల్), ప్రజా ఫిరాద్యులను పరిష్కారం కోసం పెట్టుకున్న లక్ష్యంలో 100 శాతాన్ని సాధించారు.
అక్టోబర్ 2, 2023 నుంచి ప్రారంభమైన దేశవ్యాప్త ప్రత్యేక ప్రచారం 3.0లో ఆయుష్ మంత్రిత్వ శాఖ తన సన్నాహక కృషిలో భాగంగా పెండెన్సీని దిగువన పేర్కొన్న అంశాల్లో గుర్తించింది -
ఎంపీల నుంచి వచ్చిన నిర్దేశాలు 30, పార్లమెంటరీ హామీలు 17, రాష్ట్ర ప్రభుత్వం 3, ప్రజా ఫిర్యాదులు 75, ప్రధానమంత్రి కార్యాలయం నిర్దేశాలు 3, ప్రజా ఫిర్యాదుల అప్పీల్ 24, ఫైళ్ళ నిర్వహణ 305, పారిశుద్ధ్య ప్రచారం 20. ఇందులో ప్రజా ఫిర్యాదుల అప్పీళ్ళు, ప్రజా ఫిర్యాదుల రంగంలో చెప్పుకోదగిన ప్రగతిని సాధించారు. ఈ రెండవ వారంలోనే 24 ఏళ్ళ ప్రజా ఫిర్యాదుల అప్పీళ్ళను పరిష్కరించారు. అలాగే, 75 ప్రజా ఫిర్యాదులను కూడా పరిష్కరించారు. మొత్తం 3 ప్రధానమంత్రి కార్యాలయం నిర్దేశాలలో, రెండింటిని పరిష్కరించారు. నిర్ణయించిన 20 పారిశుద్ధ్య ప్రచారాల్లో 15ను నిర్వహించారు. ప్రత్యేక ప్రచారం 3.0కు సంబంధించిన అన్ని లక్ష్యాలను సాధించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ సమన్వయం సాధించేందుకు కృషి చేస్తోంది.
ప్రత్యేక ప్రచారం 3.0ను 15 సెప్టెంబర్ 2023న అధికారికంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా గల తమ పారిశుద్ధ్య లక్ష్యాలను నిర్దిష్టంగా తెలుసుకునే సన్నాహక దశతో ఇది ప్రారంభం అయింది. దీని అనంతరం అక్టోబర్ 2 నుంచి అమలు దశ ప్రారంభమైంది. ప్రచారం సందర్బంగా కార్యాలయాల్లో జాగాను నిర్వహించడాన్ని, పని ప్రదేశ అనుభవాలను పెంచడంపై దృష్టి పెట్టారు. అత్యున్నత ప్రమాణాల పారిశుద్ధ్యాన్ని నిర్వహించి, ఆందోళనలను పరిష్కరించడానికి తాజా అడుగు ప్రచారం 3.0.
ప్రచారం సందర్భంగా, మంత్రిత్వ శాఖ కార్యాలయాల్లో చెత్తను తొలగించి, అందంగా చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇవి పని వాతావరణాన్ని, ఉద్యోగుల ఉత్పాదకతను పెంచే లక్ష్యంతో చేపట్టారు.
స్వచ్ఛతా హి సేవా పఖ్వాడాలో భాగంగా, చెత్త రహిత భారతదేశపు ప్రాముఖ్యతను పట్టి చూపుతూ, ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారుల చేత స్వచ్ఛత ప్రతిజ్ఞను చేయించారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా ప్రచార సమయంలో లక్ష్యాన్ని సాధించేందుకు ఉత్తమ కృషిని చేయవలసిందిగా సీనియర్ అధికారులను ఆదేశించారు. దీనికి అంకితమైన బృందం ఒకటి రోజువారీ పురోగతిని సమీక్షిస్తోంది. సంస్థలు, ఇనిస్టిట్యూట్‌లు, కౌన్సిళ్ళూ అన్నీ కూడా తమ ఆవరణలను, పొరుగు ప్రదేశాలు, బస్‌స్టాండ్‌లు, పార్కులు, ఔషధ మొక్కల తోటలను, చెరువులను, కుంటలను తదితరాలను శుభ్రం చేసే పనిని చేపట్టాయి. ఈ డ్రైవ్‌లో భాగంగా సీనియర్ అధికారులు, ఆయుష్ సిబ్బంది ఆయుష్ భవన్‌ను, తమతమ పొరుగుప్రాంతాలను శుభ్రం చేశారు.
స్వచ్ఛత ప్రచారంలోలా, రాష్ట్రాలు/ యుటిలు, పరిశోధనా మండళ్ళు, జాతీయ సంస్థలు, అనుబంధ, దిగువ సంస్థలు, ప్రభుత్వ సంస్థలను ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను చేపట్టవలసిందిగా ఆయుష్ మంత్రిత్వ శాఖ కోరింది. ఇంతకు ముందు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం అన్నది చెప్పుకోదగిన విజయాలు ఇచ్చిన ఫలితంగా, మంత్రిత్వ శాఖ తమ ర్యాంకింగ్‌ను మెరుగుపరచుకోగలిగింది.
పని ప్రదేశంలో అనుభవాన్ని పెంచడం, పరిశుభ్రతను ప్రోత్సహించడం, పెట్టుకున్న లక్ష్యాలను సాధించేందుకు తిరుగులేని నిబద్ధతతో అక్టోబర్ 31 వరకు ప్రత్యేక ప్రచారం కొనసాగుతుంది.
***
(Release ID: 1967796)
Visitor Counter : 83