హోం మంత్రిత్వ శాఖ

సిక్కు కమ్యూనిటీ కోసం మోదీ ప్రభుత్వం చేసిన అపూర్వ కృషికి గాను ఢిల్లీ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రసంగించిన కేంద్ర హోం , సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


‘సిక్కు గురువులు మానవాళి కోసం, దేశం కోసం అసమాన త్యాగాలు చేశారు‘

‘గురు తేజ్ బహదూర్ జీ అమరత్వం పొందిన ప్రదేశంలోనే గురు తేజ్ బహదూర్ జీ స్మారకార్థం పండుగను జరుపుకోవాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించారు‘

‘మతం కోసం ప్రాణత్యాగం చేసే విషయానికి వస్తే, నిజమైన సిక్కు ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకోడు, సిక్కులు దేశం స్వాతంత్ర్యం పొందడం నుండి దేశాన్ని రక్షించడం వరకు సంపూర్ణ త్యాగాలు చేశారు‘

‘గురు గ్రంథ్ సాహిబ్ లో అన్ని మంచి బోధన లు ఇమిడి ఉన్నాయి, గురు గ్రంథ్ సాహిబ్ కంటే అన్ని మతాల గొప్ప సమానత్వ సందేశం మరొకటి ఉండదు‘

‘రాజకీయ ప్రేరేపిత హత్యలు జరిగిన 1984 అల్లర్లను ఏ నాగరికుడు మరచిపోలేడు‘

‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్ )ను ఏర్పాటు చేసి 300 కేసులను పునర్విచారణ చేయించి దోషులకు జైలు శిక్ష విధించారు‘

‘ఇన్నేళ్ల తర్వాత తొలిసారిగా 3,328 మంది బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు ప్రధాని మోదీ‘

‘పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో హింసకు గురైన సిక్కు సోదరీమణులకు 'పౌరసత్వ సవరణ చట్టం' కింద పౌరసత్వం ఇవ్వడానికి మో

Posted On: 13 OCT 2023 5:19PM by PIB Hyderabad

సిక్కు కమ్యూనిటీ కోసం మోదీ ప్రభుత్వం చేసిన అపూర్వ కృషికి గాను ఢిల్లీ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రసంగించారు.

దురాక్రమణదారుల అన్యాయానికి వ్యతిరేకంగా 10 తరాల పాటు  సుదీర్ఘమైన పోరాటం, త్యాగాల సంప్రదాయం సిక్కు కమ్యూనిటీకి తప్ప మరే ఇతర సామాజిక వర్గానికి కూడా ఉండదని శ్రీ అమిత్ షా అన్నారు. మానవాళి కోసం, దేశం కోసం సిక్కు గురువులు చేసిన త్యాగాలకు ప్రపంచంలో ఎవరూ సాటి రారని ఆయన అన్నారు. తొమ్మిదవ గురు తేజ్ బహదూర్ జీ త్యాగాన్ని మనం ఎప్పటికీ మరచిపోలేమని శ్రీ షా అన్నారు. కాశ్మీర్ లో ఔరంగజేబు దురాగతాలను ఎదుర్కొంటున్న కాశ్మీరీ పండిట్ల విజ్ఞప్తి మేరకు గురు తేజ్ బహదూర్ జీ కాలినడకన అక్కడికి చేరుకుని ప్రాణత్యాగం చేశారు. గురు తేజ్ బహదూర్ జీ స్మారకార్థం ఒక పండుగను జరుపుకోవాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్ణయించినప్పుడు, గురు తేజ్ బహదూర్ జీ అమరత్వాన్ని పొందిన అదే ప్రదేశాన్ని దాని కోసం ఎంచుకున్నారని ఆయన అన్నారు. అదే గోడపై ఆయనను స్తుతించే పదాలను రాసి,  ఎర్రకోటలోనే వేడుకలు నిర్వహించిన విషయాన్ని శ్రీ అమిత్ షా గుర్తు చేశారు. 

ప్రపంచంలోని ప్రతి మతం తన సొంత ఉద్దేశాలతో  యుద్ధం చేస్తుంటే, ఆ సమయంలో గురునానక్ దేవ్ జీ నుండి పదవ గురువు వరకు అందరూ ప్రపంచానికి అన్ని మతాల సమానత్వ సందేశాన్ని ఇచ్చారని, దీనిని నేటి వరకు ప్రపంచం మొత్తం అనుసరిస్తోందని, ఇది యావత్ భారతదేశానికి గర్వకారణమని కేంద్ర హోం మంత్రి అన్నారు. సిక్కు కమ్యూనిటీ మతాన్ని ముందుకు తీసుకు వెడుతూ కలిసి పనిచేస్తూ ముందుకు సాగిందని ఆయన అన్నారు. మతం కోసం ప్రాణత్యాగం చేసేటప్పుడు నిజమైన సిక్కు ఎన్నడూ వెనక్కి తిరిగి చూసుకోడని, సిక్కులు స్వాతంత్ర్యం నుంచి దేశ రక్షణ వరకు అత్యధిక త్యాగాలు చేశారని ఆయన అన్నారు. సిక్కు గురువుల బోధనలు, త్యాగాలను దేశం ఎన్నటికీ మరచిపోదని ఆయన అన్నారు.

గురునానక్ దేవ్ జీ అన్ని మతాల సమానత్వం అనే సందేశాన్ని ప్రపంచంలోని అనేక దేశాల్లో వ్యాప్తి చేశారని శ్రీ అమిత్ షా అన్నారు. గురునానక్ దేవ్ జీ కూడా ఎలాంటి స్వార్థం లేకుండా ప్రేమ సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేశారని ఆయన అన్నారు. గురు గ్రంథ్ సాహిబ్ లో అన్ని మంచి బోధనలు ఇమిడి ఉన్నాయని, గురు గ్రంథ్ సాహిబ్ ను మించిన అన్ని మతాల సమానత్వ సందేశం మరొకటి ఉండదని శ్రీ షా అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మహిళల నేతృత్వంలోని అభివృద్ధి కోసం రాష్ట్రాల చట్టసభలు , పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారని కేంద్ర హోం, సహకార మంత్రి తెలిపారు. మాతా ఖివి లంగర్ బోధనలతో సిక్కు పంత్ లో మహిళా సాధికారత సంప్రదాయం చాలా సంవత్సరాల క్రితమే ప్రారంభమైందని శ్రీ షా అన్నారు. సిక్కు మహిళలు స్వాతంత్య్ర పోరాటంలోనూ, దేశ పురోగతిలోనూ గణనీయమైన కృషి చేశారని చరిత్ర చెబుతోందని ఆయన అన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం అయినా, మొఘలులు, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాటం అయినా, విభజన భయానక పరిస్థితులలో అయినా, , స్వాతంత్య్రానంతరం దేశ సరిహద్దులను కాపాడటంలో అయినా సిక్కు సమాజం ఎప్పుడూ ముందుందని అన్నారు. “మన స్వాతంత్ర్య పోరాట చరిత్ర ధైర్యవంతులైన సిక్కుల త్యాగాలతో నిండి ఉంది, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, సిక్కులు జాతీయ భద్రత కోసం అత్యధిక త్యాగాలు చేశారు‘ అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో గత తొమ్మిదేళ్లలో గురు తేజ్బహదూర్ జీ 400వ ప్రకాశ్ పర్వ్ , గురు నానక్ దేవ్ జీ 550వ ప్రకాశ్ పర్వ్ , గురు గోబింద్ సింగ్ జీ 350వ ప్రకాశ్ పర్వ్ జరపడం,  లంగర్ పై జిఎస్ టి మినహాయింపు వంటి పలు ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టినట్లు శ్రీ అమిత్ షా తెలిపారు.  కర్తార్పూర్ సాహిబ్ కారిడార్ నిర్మాణం, సుల్తాన్ పూర్ లోధిని వారసత్వ నగరంగా మార్చడం, బ్రిటిష్ విశ్వవిద్యాలయంలో గురునానక్ దేవ్ జీ పేరిట ఒక పీఠాన్ని క ఏర్పాటు చేయడం, సిక్కు యాత్రికులు పాకిస్తాన్ కు వెళ్లడానికి సౌకర్యాలు కల్పించడం వంటి చొరవలు కూడా తీసుకున్నట్టు చెప్పారు.  1984 అల్లర్లను ఏ నాగరికుడు మర్చిపోలేడని, ఇలాంటి దారుణమైన హత్యలు రాజకీయ ప్రేరేపితమని ఆయన అన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం ఏర్పడే వరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, నిందితులు ఎవరూ ఒక్క రోజు కూడా జైలులో గడపలేదని,  విచారణ కమిషన్లు ఏర్పాటు చేసినా వాటి నుంచి కచ్చితమైన ఫలితాలు రాలేదని హోం మంత్రి అన్నారు. అయితే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రత్యేక దర్యాప్తు సంస్థ- సిట్ - ను ఏర్పాటు చేసి 300 కేసులను తిరిగి తెరిపించి దోషులకు జైలు శిక్ష పడేలా చేశారని శ్రీ షా అన్నారు. కేసులు ఇంకా కొనసాగుతున్నాయని, బాధితులకు మోదీ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. 3,328 బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి, జలియన్ వాలాబాగ్ స్మారక చిహ్నాన్ని పూర్వ వైభవం తెచ్చింది మోదీయేనని అన్నారు. పొరుగు దేశాలైన పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో చిత్రహింసలకు గురైన సిక్కు సోదరీమణులకు 'పౌరసత్వ సవరణ చట్టం' కింద పౌరసత్వం ఇవ్వడానికి మోదీ ప్రభుత్వం మార్గం తెరిచిందని చెప్పారు.

గురువుల ఆశీస్సులతో గురు సాహిబన్ కు సేవ చేసే అవకాశం లభించడం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర హోం మంత్రి అన్నారు. సమాజానికి, మానవాళికి సిక్కు సమాజం, సిక్కు గురువులు చేసిన కృషికి  ఎన్ని వేల సంవత్సరాలయినా కూడా రుణం తీర్చుకోలేమని శ్రీ అమిత్ షా అన్నారు.

 

***(Release ID: 1967659) Visitor Counter : 61