ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజిటల్ సాంకేతిక విజ్ఞానం రంగం లో సహకారం అనే అంశం పై భారతదేశాని కి మరియుఫ్రాన్స్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 11 OCT 2023 3:22PM by PIB Hyderabad

డిజిటల్ సాంకేతిక విజ్ఞాన రంగం సహకారం అనే అంశం పై భారతదేశ గణతంత్రాని కి చెందిన ఎలక్ట్రానిక్స్ ఇన్ ఫార్ మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎమ్ఇఐటివై) కు మరియు ఫ్రెంచ్ గణతంత్రాని కి చెందిన ఇకానమీ, ఫైనాన్స్ ఇండస్ట్రియల్ ఎండ్ డిజిటల్ సావర్ నిటీ మంత్రిత్వ శాఖ కు మధ్య ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎంఒయు) పై సంతకాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది.

 

 

వివరాలు:

డిజిటల్ టెక్నాలజీలకు సంబంధించిన సమాచారాల విషయంలో పరస్పరం సన్నిహిత సహకారాన్ని మరియు ఒక పక్షాని కి మరొక పక్షం ఇచ్చి పుచ్చుకోవడాలను ప్రోత్సహించాలి అనేది ఈ ఎంఒయు యొక్క ఉద్యేశ్యం గా ఉంది. ఈ ఎంఒయు లో ప్రతిపాదించిన అంశాల కు అనుగుణం గా ప్రతి ఒక్క భాగస్వామి తన దేశం లో డిజిటల్ టెక్నాలజీ ని అందుబాటు లోకి తీసుకు రావడాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యాన్ని పరస్పరం సమర్థించవలసి ఉంటుంది.

 

 

ప్రధాన ప్రభావం:

డిజిటల్ టెక్నాలజీ రంగం లో జి2జి మరియు బి2బి సంబంధి ద్వైపాక్షిక సహకారాన్ని వృద్ధి చెందింప చేసుకోవడం జరుగుతుంది. ఐటి రంగం లో ఉపాధి అవకాశాల ను పెంపొందింపచేసే మెరుగైన సహకారాన్ని ఈ ఎంఒయు లో సూచించడమైంది.

 

 

 

అమలు వ్యూహం మరియు లక్ష్యాలు:

ఈ ఎంఒయు లో భాగం గా సహకారం అనేది ఉభయ పక్షాలు సంతకాలు చేసిన తేదీ నాటి నుండి మొదలవుతుంది. ఆ సహకారం అయిదు సంవత్సరాల పాటు అమలు లో ఉంటుంది.

 

 

 

పూర్వరంగం:

సమాచార సాంకేతికత రంగం లో అప్పటికే విజయవంతం గా అమలవుతున్న మరియు సరిక్రొత్త గా ఉనికి లోకి వస్తున్న విభాగాల లో అంతర్జాతీయ సహకారాన్ని ద్వైపాక్షిక మరియు ప్రాంతీయ స్థాయిల లో ప్రోత్సహించాలి అనేది ఎమ్ఇఐటివై కి ఇచ్చిన ఆదేశాల లో ఒకటి గా ఉంది. డిజిటల్ సాంకేతికత రంగం లో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందింప చేయాలన్న తన ప్రయత్నం లో భాగం గా, ఎమ్ఇఐటివై ద్వైపాక్షిక మరియు బహుపక్షీయ వేదికల లో వివిధ దేశాల సరిసాటి సంస్థల తో/ఏజెన్సీల తో కలసి ఎంఒయు లను/ఒప్పందాల ను కుదుర్చుకొంది. ఈ మార్పు చెందుతున్న ముఖచిత్రం లో, ఈ విధమైన పరస్పర సహకారం మాధ్యం తో వ్యాపార అవకాశాల ను అన్వేషించడం కోసం మరియు డిజిటల్ రంగం లో పెట్టుబడి ని ఆకర్షించడం కోసం అత్యవసర చొరవ తీసుకోవలసి ఉన్నది.

 

భారతదేశం మరియు ఫ్రాన్స్ ఇండో-యూరోపియన్ రీజియన్ లో చాలా కాలం గా వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు గా ఉన్నాయి. భారతదేశం మరియు ఫ్రాన్స్ వాటి పౌరుల కు సాధికారిత ను కల్పించేటటువంటి విధం గాను, ఈ డిజిటల్ యుగం లో వారు పూర్తి స్థాయి లో పాలుపంచుకొనేందుకు పూచీపడే విధం గాను ఒక సమృద్ధమైనటువంటి డిజిటల్ ఇకో సిస్టమ్ ను అభివృద్ధి పరచేందుకు మరియు ఆ దిశ లో భాగస్వామ్యాన్ని నెలకొల్పుకొనేందుకు కట్టుబడి ఉన్నాయి.

 

 

2019వ సంవత్సరం లో ప్రకటించిన సైబర్ సెక్యూరిటీ ఎండ్ డిజిటల్ టెక్నాలజీ సంబంధి ఇండో - ఫ్రెంచ్ రోడ్ మ్యాప్ ప్రాతిపదిక న భారతదేశం మరియు ఫ్రాన్స్ ఉన్నతమైనటువంటి డిజిటల్ టెక్నాలజీస్, మరీ ముఖ్యంగా ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ తో ముడిపడ్డటువంటి గ్లోబల్ పార్ట్ నర్ శిప్ (జిపిఎఐ) యొక్క రూపురేఖలు సహా సూపర్ కంప్యూటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్, ఇంకా క్వాంటమ్ టెక్నాలజీ ల రంగం లో ఒక మహత్వాకాంక్ష యుక్త ద్వైపాక్షిక సహకారాన్ని అనుసరిస్తూ ముందంజ వేస్తున్నాయి.

 

 

 

***


(Release ID: 1966885) Visitor Counter : 76