ఆర్థిక మంత్రిత్వ శాఖ

గ‌త ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆర్ధిక సంవ‌త్స‌రం 2023-24లో 09 అక్టోబ‌ర్ 2023 నాటికి పెరిగిన ప్ర‌త్య‌క్ష ప‌న్నుల వ‌సూళ్ళు


17.95% పెరిగిన స్థూల ప్ర‌త్య‌క్ష ప‌న్నుల వ‌సూళ్ళు

21.82% అధికంగా ప్ర‌త్య‌క్ష ప‌న్ను వ‌సూళ్ళు (వాప‌సుల నిక‌రం)

1 ఏప్రిల్‌, 2023 నుంచి 09 అక్టోబ‌ర్ 2023 మ‌ధ్య‌కాలంలో రూ. 1.50 ల‌క్ష‌ల కోట్ల మేర‌కు రిఫండ్ల విడుద‌ల

Posted On: 10 OCT 2023 5:35PM by PIB Hyderabad

అక్టోబ‌ర్ 09, 2023 వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ప‌న్ను వ‌సూళ్ళ తాత్కాలిక గ‌ణాంకాలు రూ. 11.07 ల‌క్ష‌ల కోట్ల‌ స్థూల వ‌సూళ్ళ‌తో స్థిర‌మైన వృద్ధిని న‌మోదు చేయ‌డాన్ని కొన‌సాగిస్తున్నాయి. గ‌త ఏడాది ఇదే కాలానికి సంబంధించిన స్థూల వ‌సూళ్ళ‌కంటే ఇది 17.95% ఎక్కువ‌.
ప్ర‌త్య‌క్ష ప‌న్ను వ‌సూళ్ళు, తిరిగి చెల్లింపుల నిక‌రం రూ. 9.57 ల‌క్ష‌ల కోట్లు. ఇది గ‌త ఏడాది ఇదే కాలంలో చేసిన నిక‌ర వ‌సూళ్ళ కంటే 21.82% ఎక్కువ‌. ఆర్ధిక సంవ‌త్స‌రం 2023-24కు ప్ర‌త్య‌క్ష ప‌న్నుల మొత్తం బ‌డ్జెట్ అంచ‌నాల‌లో ఈ వ‌సూళ్ళు 52.50%గా ఉంది.  
స్థూల రాబ‌డి వ‌సూళ్ళ ప‌రంగా కార్పొరేట్ ఆదాయ‌పు ప‌న్ను (సిఐటి), వ్య‌క్తిగ‌త ఆదాయ‌పు ప‌న్ను (పిఐటి) వృద్ధి రేటు విష‌యానికి వ‌స్తే, సిఐటి వృద్ధి రేటు 7.30% కాగా, పిఐటి వృద్ధి రేటు 29.53% (పిఐటి మాత్ర‌మే)/ (ఎస్‌టిటితో స‌హా పిఐటి) 29.08%గా ఉంది. 
వాప‌సులు స‌ర్దుబాటు చేసిన త‌ర్వాత‌, సిఐటి సేక‌ర‌ణ‌ల‌లో నిక‌ర వృద్ధి 12.39% కాగా, పిఐటి సేక‌ర‌ణ‌ల‌లో 32.51% (పిఐటి మాత్ర‌మే)/ 31.85% (ఎస్‌టిటి స‌హా పిఐటి) గా ఉంది. 
ఏప్రిల్ 1, 2023 నుంచి 09 అక్టోబ‌ర్ 2023 వ‌ర‌కు రూ. 1.50 ల‌క్ష‌ల కోట్ల వాప‌సు మొత్తం విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. 

 

***
 



(Release ID: 1966878) Visitor Counter : 32


Read this release in: Hindi , English , Urdu , Marathi