సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ప్రతిభావంతమైన ఫిర్యాదుల పర్యవేక్షక వ్యవస్థ (ఐజిఎంఎస్‌) 2.0 ప్రజా ఫిర్యాదుల పోర్టల్‌, ట్రీ డాష్‌ బోర్డులో యంత్ర ఆధారిత విశ్లేషణను ప్రారంభించిన కేంద్ర మంత్రి డాక్టర్‌ జితేంద్ర సింగ్‌


డిజిటల్‌ డిఎఆర్‌పిజి అంశం కింద డిఎఆర్‌పిజి ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0ను పెద్ద ఎత్తున చేపట్టింది..

దేశవ్యాప్తంగా గల ఏకీకృత సేవల పోర్టల్స్‌ విషయంలో ప్రధాన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఆధునిక సాంకేతికత.కృత్రిమ మేథ వినియోగించడంపై దృష్టిపెట్టడం జరిగింది.

Posted On: 11 OCT 2023 10:19AM by PIB Hyderabad

కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 2023 సెప్టెంబర్ 29న డిఎఆర్పిజిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమం చేపట్టారు. దీని థీమ్ డిటిటల్ డిఎఆర్పిజి. ఈ డిజిటల్ డిఎఆర్పిజి కింద  పరిపాలనా సంస్కరణల విభౄగం, ప్రజా ఫిర్యాదుల విభాగం దేశవ్యాప్తంగా గల ఏకీకృత సేవలు అందించే పోర్ఠళ్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 కింద పలు  ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రజా ఫిర్యాదుల విషయంలో పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించేందుకు, కృత్రిమ మేథ, భవిష్యత్ సాంకేతికతల సహాయంతో  ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, సుస్థిర విధానాలను ప్రమోట్ చేయడం, పరిశుభ్రత, సరైన రీతిలో రికార్డులను సిద్ధంగా ఉంచడం వంటివి చర్యలు ఇందులో చేపట్టారు.

ఏకీకృత సేవల పోర్టళ్లు:

డిఎఆర్పిజి ఇందుకు సంబంధించి 27 మంది సీనియర్ అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సేవల హక్కు కమిషనర్లు, రైట్ టు సర్వీస్ చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికారులు,పాల్గొన్నారు.ఈ – సర్వీసుల కింద దేశవ్యాప్తంగా అందించడానికి వీలైన 164 సేవలను గుర్తించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఉన్న 56 తప్పనిసరి ఈ –సేవలకు తోడు ఈ 164  ఈ–సర్వీసులను గుర్తిస్తారు. ఆర్.టి.ఎస్ ఛీఫ్ కమిషనర్లకు, డిఎఆర్పిజి ప్రచురణలైన ఎన్.ఇ.ఎస్.డి.ఎ ల విషయం గురించి మరింత అవగాహన కల్పించడం జరిగింది.డిఎఆర్పిజి ఎన్ఇ.ఎస్.డి.ఎ నెలవారీ నివేదికలను ఆరింటిని విడుదల చేసింది. ఇవి పలు ఈ– సర్వీసులకు , తప్పనిసరి ఈ–సర్వీసులకు కనీస ప్రమాణాలను నిర్దేశిస్తున్నాయి.వీటిని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్.ఇ. ఎస్డిఎ డాష్ బోర్డులో ప్రదర్శిస్తాయి.  తమంత తాముగా  సేవలు అందించే , అలాగే ఏకీకృత సేవల, పోర్టళ్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రోత్సహించేలా వాటికి అవగాహన కల్పించేందుకు కూడా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆయా రంగాల వారీగా ఈ –సర్వీసులు , ఆఫ్లైన్ సేవలను ఆన్లైన్ ప్లాట్ ఫారం కు తీసుకువచ్చే పరివర్తనాత్మక అవకాశాలు ఆయా రాష్ట్రాల వారీగా తెలియజేస్తూ ఈ అంశాలను చర్చించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 14,736 ఈ –సర్వీసులు అందిస్తున్నాయి. ఇందులో జమ్ముకాశ్మీర్ అత్యధిక సంఖ్యలో 1028 ఈ–సర్వీసులను అందిస్తున్నది. 2016 తప్పనిసరి ఈ –సర్వీసులలో 1505 ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. దీనితో ఇవి 74.6 శాతం అందుబాటులో ఉన్నట్టు అయింది. జమ్ము కాశ్మీర్, కేరళ, ఒడిషా రాష్ట్రాలు తాము అందించే సేవలలో నూరుశాతం ఏవలను తాము గుర్తించిన ఏకీకృత సర్వీసు డెలివరీ పోర్టల్ ద్వారా అంటే ఈ– ఉన్నత్, ఈ– సేవనమ్,ఒడిషా వన్, వంటి వాటిద్వారా అందిస్తున్నాయి.   ఏకీకృత సర్వీసు పోర్టళ్లు అందుబాటులోకి వచ్చేందుకు అన్ని చర్యలూ తీసుకోనున్నట్టు  ఆర్.టి.ఎస్ కమిషనర్లు తెలిపారు.  అలాగే ఈ– సర్వీసులను పూర్తిస్థాయిలో వివిధ రాష్ట్రాలలో అమలులోకి తెచ్చేందుకు కృషి చేయనున్నట్టు తెలిపారు.

ప్రజా ఫిర్యాదులలో పెండింగ్ కేసుల తగ్గింపు: డిఎఆర్పిజి, పిసిజిఆర్ఎఎంఎస్పై 17 వ నెలవారీ నివేదికను విడుదల చేసింది. దీనిని సెప్టెంబర్ 7న విడుదల చేసింది. ఇందులో అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాల వారు సకాలంలో ఫిర్యాదుల పరిష్కారం చేసే దిశగా తీసుకోవలసిన చర్యలపై వారికి అవగాహన కల్పించడం జరిగింది. ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 కింద నాణ్యమైన రీతిలో ఫిర్యాదులు పరిష్కారానికి తీసుకోవలసని చర్యలను వారికి తెలియజేయడం జరిగింది. సెప్టెంబర్ 2023 నెలలో అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలలో ఫిర్యాదుల పరిష్కార సమయం సగటున 19 రోజులుగా ఉంది.

ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి  కృత్రిమ మేథ, ఇంజనీరింగ్ సాంకేతికత అమలు:

కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ ల శాఖ సహాయమ ంత్రి  డాక్టర్ జితేంద్ర సింగ్ ఐజిఎంఎస్ 2.0 ప్రజా ఫిర్యాదలు పోర్టల్ ను, ఆటోమేటెడ్ అనాలిసిస్ ను ట్రీ డాష్ బోర్డులో 2023 సెప్టెంబర్ 29న  ప్రారంభించారు. ప్రతిభావంతమైన ఫిర్యాదుల  పర్యవేక్షక వ్యవస్థ (ఐజిఎంఎస్) 2.0 డాష్ బోర్డు ను ఐఐటి కాన్పూర్ వారు అమలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి, డిఎఆర్పిఇ తో ఐఐటి కాన్పూర్ ఒక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. సిపిజిఆర్ఎఎంఎస్ను కృత్రిమ మేథ సామర్ధ్యాలతో ఉన్నతీకరించేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ డాష్ బోర్డు వివిధ ఫిర్యాదులకు సంబంధించిన గణాంకాలు, విశ్లేషణను తెలియజేస్తుంది. ఎన్ని ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఎన్ని పరిష్కారమయ్యాయి  రాష్ట్రాలు జిల్లాల వారీగా దాఖలైన ఫిర్యాదులు, పరిష్కారమైన వాటి వివరాలను ఆయా మంత్రిత్వశాఖ ల వారీగా కూడా ఈ డాష్ బోర్డు అందిస్తుంది.  దీనికితోడు ఈ డాష్ బోర్డు, అసలు ఫిర్యాదులు రావడానికి మూల కారణాన్ని కూడా విశ్లేషించి చూడడానికి అధికారులకు ఉపకరిస్తుంది.

సి.పి.గ్రామ్స్ లో భారత్ జిపిటి:

డిఎఆర్పిజి, భారత్ జిపిటి టీమ్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ఈ టీమ్ కు ఐఐటి ముంబాయి నాయకత్వం వహిస్తోంది. సిపిగ్రామ్స్ లో పౌరుల ఫిర్యాదుల పరిష్కారాన్ని మరింత సులభతరం చేసేందుకు ఇది ఉపకరిస్తుంది.

దీనికితోడు, డిఎఆర్పిజి 145 ప్రజా ఫిర్యాదులను పరిష్కరించింది.  మొదటి వారంలో 100 శాతం ఫైళ్లను  సమీక్షించింది. సమీక్ష అనంతరం 447 భౌతిక ఫైళ్లను మొదటి వారంలో తొలగించడం జరిగింది. 1317 ఫైళ్లు మూసివేతకు గుర్తించారు. వీటిని ఈ ఆఫీస్లో విజయవంతంగా మూసివేశారు.

ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన పురోగతిని రోజువారీ లెక్కన ఉన్నతస్థాయి అదికారులు పర్యవేక్షిస్తున్నారు. ఈ విభాగం 3.0 ప్రచార కార్యక్రమం సందర్భంగా గత సంవత్సరం చేపట్టిన 2.0 ప్రచారం కన్న మంచి మెరుగైన ఫలితాన్ని సాధించే లక్ష్యంతో  గట్టి కృషి చేస్తోంది.

 

***



(Release ID: 1966876) Visitor Counter : 54