సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అక్టోబరు 12న ప్రపంచ దృష్టి దినోత్సవం నిర్వహణ

Posted On: 11 OCT 2023 1:19PM by PIB Hyderabad

 

ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో గురువారం రోజు ప్రపంచ దృష్టి దినోత్సవం జరుపుకుంటారు. అంధత్వం, దృష్టి లోపంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి ఉద్దేశించిన ప్రపంచ కార్యక్రమం ఇది. ఈ సంవత్సరం అక్టోబర్ 12న దీనిని నిర్వహిస్తున్నారు. 'పనిలో ఉన్నప్పుడు మీ కళ్ళను ప్రేమించండి' అనేది ఈ సంవత్సరం నేపథ్యాంశం. కార్యాలయాల్లో పని చేస్తున్నప్పుడు దృష్టిని రక్షించుకోవాల్సిన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది. కార్మికుల కంటి ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేలా వ్యాపారవేత్తలను ప్రేరేపిస్తుంది.

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం & సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని దివ్యాంగుల సాధికారత విభాగం, దేశంలోని దివ్యాంగుల సంక్షేమం కోసం ఉద్దేశించిన నోడల్ విభాగం. దృష్టి లోపం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి, 12 అక్టోబర్ 2023న ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని ఈ విభాగం, దాని అనుబంధ సంస్థలు నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను అవి చేపడతాయి.

 

***


(Release ID: 1966701) Visitor Counter : 69


Read this release in: Urdu , English , Hindi , Tamil