కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

“జాతీయ బ్రాడ్‌కాస్టింగ్ విధానం” రూపకల్పన కోసం ట్రాయ్‌ జారీ చేసిన ముందస్తు సంప్రదింపుల పత్రంపై వ్యాఖ్యలు స్వీకరించడానికి చివరి తేదీ పొడిగింపు

నాడు పోస్టు చేయడమైనది: 11 OCT 2023 4:05PM by PIB Hyderabad

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌), “జాతీయ బ్రాడ్‌కాస్టింగ్ విధానం” రూపకల్పన కోసం అవసరమైన సలహాలు, సూచనల కోసం ఈ ఏడాది సెప్టెంబర్ 21న ముందస్తు సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. ముందస్తు సంప్రదింపుల పత్రంపై సంబంధిత వర్గాల నుంచి వ్యాఖ్యలు స్వీకరించడానికి చివరి తేదీని 10 అక్టోబర్ 2023గా నిర్ణయించింది.

సమయం పొడిగింపు కోసం వాటాదార్ల నుంచి వచ్చిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని, వ్యాఖ్యలు సమర్పించడానికి గడువును 31 అక్టోబర్ 2023 వరకు పొడిగించింది.

ఈ-మెయిల్ ఐడీలు advbcs-2@trai.gov.injtadvbcs-1@trai.gov.inకి ఎలక్ట్రానిక్ రూపంలో వ్యాఖ్యలను పంపవచ్చు. మరింత వివరణ/సమాచారం కోసం సలహాదారు (బీ&సీఎస్‌) శ్రీ అనిల్ కుమార్ భరద్వాజ్‌ను ఫోన్‌లో సంప్రదించవచ్చు. నం. +91-11-23237922.

 

****


(రిలీజ్ ఐడి: 1966699) సందర్శకుల సూచీ సంఖ్య : : 117
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , Gujarati , Tamil , Urdu , English