ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రారంభమైన ఒక సంవత్సరంలోపు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA)-ఆధారిత స్కాన్ , షేర్ సేవలను ఉపయోగించి 1 కోటి ఓపిడి టోకెన్లు జారీ
రోగులకు ఈ డిజిటల్ ఓపిడి రిజిస్ట్రేషన్ సేవలు అమలు చేయడంలో ముందున్న ఉత్తరప్రదేశ్, కర్ణాటక, జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రాలు
సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి స్కాన్, షేర్ వంటి మరిన్ని సౌకర్యాలు ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత అందుబాటులోకి తీసుకరావడానికి జాతీయ ఆరోగ్య సంస్థ చర్యలు
Posted On:
10 OCT 2023 11:27AM by PIB Hyderabad
ప్రారంభమైన ఒక సంవత్సరంలోపు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA)-ఆధారిత స్కాన్ , షేర్ సేవలను ఉపయోగించి 1 కోటి ఓపిడి టోకెన్లు జారీ చేసి జాతీయ ఆరోగ్య సంస్థ ప్రధాన మైలురాయిని అధిగమించింది. కాగిత రహిత ఆరోగ్య సేవలు అందించడానికి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) కింద జాతీయ ఆరోగ్య సంస్థ 2022 అక్టోబర్ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఔట్-పేషెంట్ డిపార్ట్‌మెంట్ ( ఓపిడి ) రిజిస్ట్రేషన్ కౌంటర్‌లో ఉంచిన QR కోడ్‌ను స్కాన్ చేసి తక్షణ రిజిస్ట్రేషన్ కోసం వారి వివరాలను ABHA ప్రొఫైల్‌ను పొందుపరచుకోవడానికి వీలుగా సౌకర్యం ప్రారంభమయింది. ఈ సేవ ప్రస్తుతం భారతదేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 419 జిల్లాల్లో 2,600 పైగా ఆరోగ్య కేంద్రాల్లో అమలు జరుగుతోంది.
రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడానికి, రోగులకు మెరుగైన సేవా సౌకర్యాన్ని అందించడానికి స్కాన్,షేర్ సౌకర్యాన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తమ ప్రజారోగ్య సౌకర్యాలలో వేగంగా అమలు చేస్తున్నాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పబ్లిక్ డాష్‌బోర్డ్ (https://dashboard.abdm.gov.in/abdm/) లో పొందుపరిచిన గణాంకాల ప్రకారం ఢిల్లీ, భోపాల్ , రాయ్‌పూర్ నగరాల్లోని ఎయిమ్స్ లో ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని తెలుపుతున్నాయి. మొదటి పదిహేను స్థానాల్లో ఉన్న ఆసుపత్రుల్లో తొమ్మిది ఆస్పత్రులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవే.ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ABHA-ఆధారిత స్కాన్, షేర్ సేవను ఉపయోగించి ఓపిడి టోకెన్లు జారీ చేసి ఆరోగ్య సేవలు ఎక్కువగా అందిస్తున్న జాబితాలో కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ , ఢిల్లీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు తర్వాత స్థానంలో ఉన్నాయి. ఎయిమ్స్ న్యూఢిల్లీ, ఎస్ఆర్ఎన్ హాస్పిటల్, ప్రయాగ్‌రాజ్, ఎయిమ్స్ , రాయ్‌పూర్‌తో స్కాన్ , షేర్ సర్వీస్‌లో అత్యుత్తమ పనితీరును కనబరిచి ఆరోగ్య సేవలు అందిస్తున్నాయి.
పెరుగుతున్న డిజిటల్ సేవల సంఖ్య పట్ల జాతీయ ఆరోగ్య సంస్థ సీఈఓ హర్షం వ్యక్తం చేశారు. " ఆరోగ్య సంరక్షణ సేవలు సులువుగా, సమర్ధంగా అందించడం లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ABDM ప్రారంభమైంది. ఓపిడి కౌంటర్లలో ఏర్పాటు చేసిన స్కాన్, షేర్ సౌకర్యాన్ని సులువుగా ఉపయోగించవచ్చు.దీనివల్ల రోజుకు దాదాపు 1 లక్ష మంది రోగులు క్యూ లో వేచి ఉండకుండా సులువుగా ఆరోగ్య సేవలు పొందుతున్నారు. రోజులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకరావడానికి ఈ సేవను ఫార్మసీ కౌంటర్ ,లేబొరేటరీ లో కూడా అమలు చేయడానికి చర్యలు జరుగుతున్నాయి. పెద్ద వయస్సులో ఉన్న రోగులు, గర్భిణీ స్త్రీలు ,ఇతరులకు సౌలభ్యం, సౌకర్యం కలిగించడానికి అవసరమైన చర్యలు అమలు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.దీనివల్ల ABHA-ఆధారిత రిజిస్ట్రేషన్ గల రోగులు తమ ప్రిస్క్రిప్షన్‌లు, ఫార్మసీ స్లిప్‌లు, డయాగ్నస్టిక్ రిపోర్ట్‌లు డిజిటల్ విధానంలో లభిస్తాయి" అని జాతీయ ఆరోగ్య సంస్థ సీఈఓ వివరించారు.
స్కాన్, షేర్ సేవలు మరింత ఎక్కువగా జరిగేలా చూసేందుకు సౌకర్యాలు కలిగి ఉన్న ఆసుపత్రులు, డిజిటల్ సొల్యూషన్ సంస్థలను జాతీయ ఆరోగ్య సంస్థ ప్రోత్సహిస్తోంది. డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ (DHIS) కింద స్కాన్, షేర్ లావాదేవీలకు ప్రోత్సాహకాలను కూడా అందిస్తుంది. డిజిటల్ హెల్త్ ఇన్సెంటివ్ స్కీమ్ కి సంబంధించిన మరిన్ని వివరాలు : https://abdm.gov.in/DHIS లో అందుబాటులో ఉన్నాయి
***
(Release ID: 1966321)
Visitor Counter : 162