రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

రెండు ఐరోపా దేశాల‌తో భార‌త్‌కు గ‌ల ర‌క్ష‌ణ సంబంధాల‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ఇట‌లీ& ఫ్రాన్స్‌ల‌లో ప‌ర్య‌టించ‌నున్న ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌

Posted On: 08 OCT 2023 11:06AM by PIB Hyderabad

ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 09 నుంచి 12 అక్టోబ‌ర్ 2023 వ‌ర‌కు ఇట‌లీ, ఫ్రాన్స్‌ల‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. త‌న రెండు దేశాల ప‌ర్య‌ట‌న తొలి ద‌శ‌లో ర‌క్ష‌ణ మంత్రి ఇట‌లీ ర‌క్ష‌ణ మంత్రి గౌడో క్రిసెట్టోతో రోమ్‌లో స‌మావేశం కానున్నారు. ఇట‌లీ ప్ర‌ధాన మంత్రి మార్చి 2023లోభార‌త్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు భార‌త్‌, ఇట‌లీల మ‌ధ్య సంబంధాలు వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యంగా ఎదిగాయి. 
రెండ‌వ& అంతిమ ద‌శ‌లో శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఫ్రాన్స్ సాయుధ ద‌ళాల మంత్రి సెబాస్టియ‌న్ లెకోమూతో క‌లిసి పారిస్‌లో 5వ వార్షిక ర‌క్ష‌ణ చ‌ర్చ‌ను నిర్వ‌హించ‌నున్నారు. భార‌త్‌, ఫ్రాన్స్‌లు ఇటీవ‌లే త‌మ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్య వేడుక‌ జ‌రుపుకున్నారు. ప్ర‌ముఖ‌మైన పారిశ్రామిక స‌హ‌కారం స‌హా ఇరు దేశాలు లోతైన‌, విస్త్ర‌త‌మైన ర‌క్ష‌ణ సంబంధాల‌ను క‌లిగి ఉన్నాయి. 
రోమ్‌లోనూ, పారిస్‌లోనూ ర‌క్ష‌ణ మంత్రి ర‌క్ష‌ణ ప‌రిశ్ర‌మ సిఇఓల‌తోనూ, సీనియ‌ర్ ప్ర‌తినిధుల‌తోనూ పారిశ్రామిక స‌హ‌కారానికి గ‌ల సంభావ్య అవ‌కాశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. 

***


(Release ID: 1965825) Visitor Counter : 120