మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పూణేలో శనివారం గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (GIPE) 29వ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రసంగించారు, పూణేలోని సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీలో సింబయాసిస్ ఈశాన్య భవన్‌ను ప్రారంభించారు
విద్యార్థులు తమ సామర్ధ్యాలను పెంచుకొని భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని శ్రీ ప్రధాన్ వారిని కోరారు.
గొప్ప ఆలోచనలు చేయండి , సమాజ ఆకాంక్షలు మరియు ప్రపంచ బాధ్యతలను నెరవేర్చే దృక్పథంతో ముందుకు సాగండి - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
Posted On:
07 OCT 2023 4:36PM by PIB Hyderabad
పూణేలో శనివారం జరిగిన గోఖలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ (GIPE) 29వ స్నాతకోత్సవంలో కేంద్ర విద్య , నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత శాఖల మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా ;పాల్గొని స్నాతకోపన్యాసం చేశారు. మహారాష్ట్ర ఉన్నత & సాంకేతిక విద్యా శాఖ మంత్రి శ్రీ చంద్రకాంత్ పాటిల్; GIPE వైస్ ఛాన్సలర్, డాక్టర్ అజిత్ రానడే; ఇతర ప్రముఖులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు మరియు విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీ ప్రధాన్ తమ ప్రసంగంలో డిగ్రీలు పొందిన విద్యార్థులను అభినందించి తమ సామర్థ్యాన్ని మరియు జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ప్రోత్సహించారు. గోఖలే సంస్థ ఆలోచనల ద్రవీభవన స్థానం, అనుభవపూర్వక అభ్యాసానికి అది కేంద్రంగా ఉందని ఆయన తెలిపారు.
ప్రతిభావంతులైన యువశక్తి వల్ల వచ్చే ఇరవై ఐదేళ్లలో భారతదేశం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. గొప్పగా ఆలోచించి సమాజ ఆకాంక్షలతో పాటు ప్రపంచ బాధ్యతలను నెరవేర్చే దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన కోరారు.
ఇరవై ఒకటవ శతాబ్దం విజ్ఞాన ఆధారిత సమాజంగా ఉండబోతోందని, ఇక్కడ అభివృద్ధి, వృద్ధి, ఆర్థిక వ్యవస్థలు, సమాజానికి ప్రాథమిక వనరు జ్ఞానం అని ఆయన పేర్కొన్నారు. భారతీయులపై ఇప్పుడు ప్రపంచ బాధ్యతలు ఉన్నందున వారు గొప్పగా అలోచించి తమ దార్శనికతను, చర్యలను మొత్తం ప్రపంచం వైపు మళ్లించాలని ఆయన ఉద్ఘాటించారు.
భారత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సమయంలో సంస్థ అందించిన ముఖ్యమైన సహకారాన్ని అలాగే స్వాతంత్య్రానంతరం అనేక ముఖ్యమైన విధాన నిర్ణయాలను శ్రీ ప్రధాన్ ప్రత్యేకంగా నొక్కిచెప్పారు. ఇందులో వ్యవసాయం, విద్య, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, కుటుంబ నియంత్రణ, బ్యాంకింగ్ మరియు సహకార రంగాలపై ఆర్థిక పరిశోధనలు, ఇక్కడ జరిగిన సహకార ఉద్యమం ఉన్నాయి.
స్నాతకోత్సవం తదుపరి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ పూణేలోని సావిత్రీబాయి ఫూలే విశ్వవిద్యాలయంలో విద్యార్థి సమ్మాన్ సమారోహ్ కు హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతూ శ్రీ ప్రధాన్ పూణె నగర ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. భారతీయ నాగరికత దిశను చూపడంలో నగరం పోషించిన ప్రముఖ పాత్రను, పూణేలోని సావిత్రిబాయి ఫూలే విశ్వవిద్యాలయం అందుకు ఒక కేంద్రంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నేడు అభివృద్ధి చెందుతున్న వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు భారత్ నేతృత్వంలోని నమూనాలపై ఎంతో ఆపేక్షతో ఉన్నాయి. పూణేకు ఈ అంచనాలను అందుకోగల సామర్ధ్యం ఉంది అని మంత్రి అన్నారు.
విద్యా పరిశోధన, విధాన నిర్ణయాలు, విద్యాసంస్థలు, సంక్షేమ-కేంద్రీకృత పాలన మరియు మహిళల నేతృత్వంలో అభివృద్ధి, శాస్త్రీయ పరిశోధన మరియు మరెన్నో యోచలనతో సహా అనేక ముఖ్యమైన రంగాలలో పూణే సహకారాన్ని ఆయన నొక్కిచెప్పారు.
పూణేలో కొన్నాళ్ళు పనిచేసిన ప్రముఖ పర్యావరణ శాస్త్ర ప్రొఫెసర్ కిర్క్ ఆర్ స్మిత్ చేసిన ముఖ్యమైన సూచనలను కూడా ఆయన ప్రస్తావించారు. సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు ఎల్‌పిజి సబ్సిడీలపై ఆయన చేసిన సూచనలు ఉజ్వల పథకం ఆవిర్భావానికి దారితీశాయని శ్రీ ప్రధాన్ పేర్కొన్నారు.
పూణేలోని సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీలో శ్రీ ప్రధాన్ సింబయాసిస్ ఈశాన్య భవన్‌ను ప్రారంభించారు.
***
(Release ID: 1965824)
Visitor Counter : 94