ప్రధాన మంత్రి కార్యాలయం

భారత వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి దిశగా ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్ కృషిపై తన ఆలోచనలను అక్షరబద్ధం చేసిన ప్రధానమంత్రి

Posted On: 07 OCT 2023 2:39PM by PIB Hyderabad

   భారత వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధనకు ప్రొఫెసర్ ఎం.ఎస్‌.స్వామినాథన్ కృషిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆలోచనలను అక్షరబద్ధం చేశారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“వ్యవసాయ రంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధం చేయడానికి ప్రొఫెసర్ ఎం.ఎస్‌. స్వామినాథన్ చిరస్మరణీయ కృషి చేశారు. దీనికి సంబంధించి నా ఆలోచనలు కొన్నింటిని గ్రంథస్థం చేశాను. మన రైతుల సౌభాగ్యం కోసం ఆయన అవిరళ కృషి చేశారు” అని పేర్కొంటూ ఈ రచన ఆంగ్లభాష లింకు https://www.narendramodi.in/prof-swaminathan-s-unyielding-commitment-eng ను ప్రజలతో పంచుకున్నారు. అదేవిధంగా దీనికి సంబంధించిన హిందీ భాష లింకు https://www.narendramodi.in/hi/prof-swaminathan-s-unyielding-commitment-hin ను పంచుకుంటూ- “ఇవాళ మన దేశంలో మనం చూస్తున్న ఆధునిక-ప్రగతిశీల వ్యవసాయానికి ప్రొఫెసర్ ఎం.ఎస్‌.స్వామినాథన్ పునాది వేశారు. నా ఈ వ్యాసం ఆయన అమూల్య, నిర్విరామ కృషికి అంకితం చేస్తున్నాను” అని ప్రధాని పేర్కొన్నారు.


 

 

 

***


DS/TS



(Release ID: 1965492) Visitor Counter : 93