సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
పెన్షనర్లు, పెన్షనర్ల సంక్షేమ విభాగం లక్ష్యాలను సాధించేందుకు పెద్ద ఎత్తున సాగుతున్న 3.0 ప్రత్యేక ప్రచారం
దేశవ్యాప్తంగా 30 పరిశుభ్రతా స్థలాలను కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్లు, వాటి అనుబంధ సంస్థల ద్వారా గుర్తింపు.
మరింత సులభతర జీవనానికి వీలుగా సులభతర నిబంధనలపై ప్రత్యేక దృష్టి.
Posted On:
05 OCT 2023 3:09PM by PIB Hyderabad
పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ విభాగం, తమ డిపార్టమెంట్ పరిధిలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ల ద్వారా ప్రత్యేక 3.0 ప్రచార కార్యక్రమాన్ని చేపడుతోంది.ఇందుకు సంబంధించి ఈ విభాగం 2023 సెప్టెంబర్ 15 నుంచి ముందస్తు ఏర్పాట్ల కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రచార కార్యక్రమం సందర్భంగా పరిశుభ్రతకు సంబంధించి వివిధ ప్రదేశాలను ఎంపిక చేయడం తో ప్రారంభమైంది.
ప్రధాన ప్రచార కార్యక్రమం 2023 అక్టోబర్ 2న ప్రారంభమైంది.. ఇది 2023 అక్టోబర్ 31 వరకు కొనసాగుతుంది. దీని ద్వారా పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారం, స్వచ్ఛతను వ్యవస్థాగతం చేయడం, అంతర్గత పర్యవేక్షక వ్యవస్థలను బలోపేతం చేయడం , రికార్డుల నిర్వహణను మెరుగుపరచడం వంటివి దీనిద్వారా చేపడతారు.
ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి సన్నద్ధతా చర్యలు మొదలైనప్పటి నుంచి పెన్షనర్ల సంక్షేమ విభాగం, కేంద్రప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్లు దేశవ్యాప్తంగా పరిశుభ్రతా కార్యక్రమం నిర్వహించాల్సిన 50 ప్రదేశాలను గుర్తించాయి. ప్రత్యేక ప్రచార కార్యక్రమం 3.0 సన్నద్ధత దశలో , అదనపు కార్యదర్శి (పెన్షన్ ) డిఒపిపిడబ్ల్యు , ఎంపిక చేసిన ప్రదేశాలలో పరిశుభ్రం చేయవలసిన ప్రదేశాలను ముందస్తుగా పరిశీలించి చూడడం జరిగింది . ప్రచార కార్యక్రమ సమయంలో పరిశుభ్రతా లక్ష్యాలను సాధించేందుకు సీనియర్ అధికారులు అందరూ గట్టి కృషిచేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.. ఏక్ తారీక్,ఏక్ ఘంటా కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయిలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి (పిపి) శ్రీ జితేంద్ర సింగ్, పెన్షన్ విభాగ కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్ , ఇతర అధికారులతో కలసి న్యూఢిల్లీలోని నీతి మార్గ్ నెహ్రూ పార్క్ లో శ్రమదానం నిర్వహించడంతో పాటు మొక్కలునాటారు. పరిశుభ్రతా కార్యక్రమాలు చేపట్టడంలో రోజువారీ పురోగతి గురించి ఒక ప్రత్యేక అధికారుల బృందం పర్యవేక్షిస్తుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ఎస్.సి.పి.డి.ఎం పోర్టల్ లో అప్ డేట్ చేస్తారు. దీనిని డిపార్టమెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, పబ్లిక్ గ్రీవెన్సెస్ ( పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం) నిర్వహిస్తోంది.
ఇప్పటివరకు లక్ష్యాల గుర్తింపు విజయవంతంగా పూర్తి అయింది. ఈ ఏడాది ఈ విభాగం 5000 ప్రజాఫిరర్యాదుల పరిష్కారం,600 ప్రజా ఫిర్యాదుల అప్పీళ్ల పరిష్కారానికి లక్ష్యంగా నిర్ణయించుకుంది. 1358 భౌతిక ఫైళ్లను ఈ ప్రచార కార్యక్రమం సందర్బంగా సమీక్షించాలని నిర్ణయించారు. 883 ఎలక్ట్రానిక్ ఫైళ్లు మూసివేసేందుకు గుర్తించారు.
ఎక్స్ ( పూర్వపు ట్విట్టర్ ) మాధ్యమంలో, స్వచ్ఛతా ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు డిపార్టమెంట్ 50 ట్వీట్లు పోస్ట్ చేసింది. స్వచ్ఛతకు సంబంధించిన లక్ష్యాలను సమర్ధంగా చేరుకునేందుకు ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది .
****
(Release ID: 1965325)
Visitor Counter : 91