శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఆరోగ్య సంరక్షణలో ప్రపంచ ప్రమాణాలను చేరుకోవడానికి ప్రభుత్వ-ప్రైవేట్ సమన్వయం అత్యవసరం: రెండు వైపుల నుండి వనరులను ఆరోగ్య కరంగా భర్తీ చేయడం కూడా సరసమైన ధరలలో ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణను అందించడానికి సహాయపడుతుంది: డాక్టర్ జితేంద్ర సింగ్


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ళ నాయకత్వంలో విధాన ప్రణాళికా మార్పులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించాయి.

తక్కువ ఖర్చుతో ఆరోగ్య సంరక్షణ లక్ష్యాన్ని లక్ష్యం ప్రపంచ ప్రమాణాలతో చేరుకోవడానికి ప్రభుత్వ-ప్రైవేట్ సంపూర్ణ సమన్వయం అత్యవసరం: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

అనుమానాలకు తావులేదు; ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల నాయకత్వ కాలంలో విధాన ప్రణాళికలో మార్పులు పరస్పర నమ్మకాన్ని కలిగించాయి: డాక్టర్ జితేంద్ర సింగ్

“న్యూఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమైన తర్వాత ప్రపంచ ప్రమాణాలను, ప్రపంచ వ్యూహాలను, ప్రపంచ దృక్పథాన్ని నెరవేర్చాలనే ఆకాంక్షలను ప్రధాని నిర్దేశించారు”

సిఐఐ నిర్వహించిన 15వ గ్లోబల్ మెడ్ టెక్ సమ్మిట్ లో ప్రసంగించిన జితేంద్ర సింగ్

Posted On: 06 OCT 2023 4:48PM by PIB Hyderabad

భారత్ వంటి దేశానికి ఆరోగ్య సంరక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేటు సమన్వయం అత్యవసరమని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. రెండు వైపుల నుంచి వనరులను ఆరోగ్యకరంగా ఉపయోగించుకోవడం ద్వారా ప్రపంచ స్థాయి వైద్య సేవలను సహేతుక ధరలకు అందించడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.

న్యూఢిల్లీలో సిఐఐ నిర్వహించిన 15వ గ్లోబల్ మెడ్ టెక్ సమ్మిట్ 2023లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పీఎంవో, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ, స్పేస్ శాఖ సహాయ మంత్రి ప్రారంభోపన్యాసం చేశారు.

ఇకపై సందేహాలకు తావులేదని, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల నాయకత్వ కాలంలో విధాన ప్రణాళికా మార్పులు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య పరస్పర నమ్మకాన్ని సృష్టించాయని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

“సాధారణంగా హెల్త్ కేర్ రంగంతో పాటు మెడ్ టెక్, బయోటెక్ రంగాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమల మధ్య భారీ సమన్వయానికి అవకాశం ఉందని” అన్నారు.

కోవిడ్ మహమ్మారి నుండి బయటపడటానికి భారతదేశానికి సహాయపడిన మిషన్ సురక్ష, ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య భీమా పథకం ఆయుష్మాన్ భారత్ విజయాలను డాక్టర్ జితేంద్ర సింగ్ ఉదహరించారు. మరెక్కడా లేని ఈ ఏకైక  పథకం వ్యాధికి వ్యతిరేకంగా రక్షణ ఇచ్చిందని అన్నారు.భారత్ ను గ్లోబల్ మెడ్ టెక్ లీడర్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

“ఫార్మా మెడ్ టెక్ స్కీమ్ ( పి ఆర్ఐపి )లో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ను ప్రోత్సహించడం, నూతన వైద్య పరికరాల విధానం, 2024 నాటికి బీమా సుగామ్ పోర్టల్ అభివృద్ధి, హెల్త్ కేర్, మెడ్ టెక్ రంగాన్ని ముందుకు నడిపించే కొత్త డ్రగ్స్, మెడికల్ డివైజెస్ అండ్ కాస్మొటిక్స్ బిల్లును పునరుద్ధరించడం వంటి విధానాలను ప్రభుత్వం రూపొందించింద”. అని చెప్పారు.

ఇన్నోవేషన్ కు మద్దతు ఇచ్చే , పెంపొందించే సరైన పర్యావరణ వ్యవస్థను ప్రధాని మోదీ ప్రభుత్వంలో సృష్టించారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అంకుర సంస్థల భారీ విజయాన్ని ఉటంకిస్తూ, ప్రధాన మంత్రి ఎంటర్ ప్రెన్యూర్ షిప్ , అభివృద్ధి చెందుతున్న పరిశ్రమకు అనువైన వాతావరణాన్ని సృష్టించారని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

న్యూఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతం అయిన తర్వాత ప్రపంచ ప్రమాణాలను, అంతర్జాతీయ వ్యూహాలను, అంతర్జాతీయ దృక్పథాన్ని నెరవేర్చాలనే ఆకాంక్షలను ప్రధాని నిర్దేశించారని తెలిపారు.

అడ్డంకుల మధ్య పనిచేసే యుగం ముగిసిందని, మన అన్వేషించని వనరుల విస్తారమైన సామర్థ్యాన్ని వెలికితీయడానికి  ప్రైవేట్ రంగంతో కలిసి పని చేస్తున్నామని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావించారు.ప్రధాని మోదీ తలపెట్టిన అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎన్ఆర్ఎఫ్) పరిశోధన - అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది .రాబోయే ఐదు  సంవత్సరాలలో భారతదేశాన్ని గ్లోబల్ ఆర్ అండ్ డి లీడర్ గా ఉంచుతుంది.

అనుసంధన్ ఎన్ఆర్ఎఫ్ శాస్త్రీయ, సాంకేతిక ఆవిష్కరణలు, హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ విజ్ఞానాన్ని మిళితం చేస్తుంది. దీనికి ప్రధానంగా ప్రభుత్వేతర వనరులు నిధులు సమకూరుస్తాయి. అనుసంధన్ అనేక విధాలుగా అమెరికా ఎన్ఆర్ఎఫ్ కంటే మెరుగ్గా ఉంటుందన్నారు.

భారత్ ను. ఆత్మనిర్భర్ గా తయారు చేయడానికి, అమృతకాల్ సమయంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, ప్రైవేట్ రంగం ప్రతిసారీ ప్రభుత్వం వైపు చూడటం మానుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

'మన ఆలోచనా ధోరణి (మైండ్ సెట్) మార్చుకోవాలి. రెండు శతాబ్దాల వలస పాలన తర్వాత మన మూలాలను కోల్పోయిన మన సంస్కారాన్ని తిరిగి కనుగొనడానికి మూడు తరాలు పడుతుందని‘ ఆయన అన్నారు.

నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ కె పాల్ తన ప్రసంగంలో,  సంస్కరించబడిన పరిశోధన,  అభివృద్ధి సామర్థ్యాలు, దేశీయ తయారీ స్థాయిని పెంచడం, పరిశ్రమ-విద్యా సహకారం , ప్రపంచ భాగస్వామ్యం ద్వారా ఆరోగ్యకరమైన భారతదేశానికి దోహదపడతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ డీఓపీ కార్యదర్శి ఎస్ అపర్ణ, సీడీఎస్సీఓ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ, సి డి ఎస్ ఎస్ సి ఒ,  సీఐఐ నేషనల్ హెల్త్ కేర్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ నరేష్ ట్రెహాన్ తదితరులు ప్రసంగించారు.

                               

<><><>



(Release ID: 1965216) Visitor Counter : 70