రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర రహదారి & మౌలిక సదుపాయాల నిధి (సీఐఆర్‌ఎఫ్‌) కింద హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా, కాంగ్రా ప్రాంతం కోసం రూ.154.25 కోట్ల విలువైన పథకాలను ఆమోదించిన శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 06 OCT 2023 4:34PM by PIB Hyderabad

దేశంలో రవాణా సాఫీగా జరిగేలా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం మోదీ ప్రభుత్వ ప్రాధాన్యత అని కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్ర రహదారి & మౌలిక సదుపాయాల నిధి (సీఐఆర్‌ఎఫ్‌) కింద హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా, కాంగ్రా ప్రాంతం కోసం రూ.154.25 కోట్ల విలువైన పథకాలనుకు ఆమోదించినట్లు వెల్లడించారు.

ప్రకృతి వైపరీత్యాల వల్ల హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభావితమైందని, ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కొత్త అనుమతులపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డా, కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్‌తో చర్చించినట్లు శ్రీ గడ్కరీ ఇటీవల చెప్పారు.

ఈ అనుమతుల కింద, రూ.50.60 కోట్లతో స్వాన్ నదిపై రెండు వంతెనలు, రూ.103.65 కోట్లతో బియాస్ నదిపై పాంగ్ డ్యామ్ నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.

 

****


(Release ID: 1965061) Visitor Counter : 106