వ్యవసాయ మంత్రిత్వ శాఖ

'పరిశోధన నుంచి ఫలితం : సరైన, సుస్థిర వ్యవసాయ ఆహార వ్యవస్థ' అనే అంశంపై ఏర్పాటైన అంతర్జాతీయ పరిశోధన సదస్సును ప్రారంభించనున్న భారత రాష్ట్రపతి


సదస్సులో పాల్గోనున్న కేంద్ర వ్యవసాయ , రైతు సంక్షేమ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్; భారతదేశం జీ-20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్, సిజిఏఐఆర్ తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆండ్రూ కాంప్‌బెల్

మహిళల నేతృత్వంలో అభివృద్ధి సాధించాలని ఇటీవల జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశం తీర్మానం ఆమోదించిన నేపథ్యంలో జరుగుతున్న సదస్సు ముఖ్యమైనది: డాక్టర్ హిమాన్షు పాఠక్

Posted On: 06 OCT 2023 3:58PM by PIB Hyderabad

'పరిశోధన నుంచి ఫలితం :  సరైన, సుస్థిర వ్యవసాయ ఆహార వ్యవస్థ' అనే అంశంపై 2023 అక్టోబర్ 9వ  ఏర్పాటైన అంతర్జాతీయ పరిశోధన సదస్సును  భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. న్యూ ఢిల్లీలోని పూసాలోని ఎన్ఏఎస్ సి  కాంప్లెక్స్‌లో నాలుగు రోజుల పాటు సదస్సు జరుగుతుంది. 

 ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్స్ కన్సార్టియం జెండర్ ఇంపాక్ట్ ప్లాట్‌ఫారమ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ నిర్వహిస్తున్నాయి. వ్యవసాయం,ఆహార వ్యవస్థలో మార్పులు తీసుకుని రావడానికి జరుగుతున్న ప్రయత్నాలకు మహిళలు నాయకత్వం వహించి అమలు జరిపేలా చూసేందుకు దోహదపడే పరిశోధనలు జరిగేలా చూసేందుకు రెండు సంస్థలు సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. సదస్సులో  కేంద్ర వ్యవసాయ , రైతు సంక్షేమ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్; భారతదేశం జీ-20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్, సిజిఏఐఆర్   తాత్కాలిక ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆండ్రూ కాంప్‌బెల్ పాల్గొంటారు. 

సదస్సు వివరాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ ఈరోజు మీడియాకు వివరించారు. మహిళల నేతృత్వంలో  అభివృద్ధి సాధించాలని ఇటీవల జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశం తీర్మానం ఆమోదించిన నేపథ్యంలో జరుగుతున్న సదస్సు ప్రాధాన్యత సంతరించుకుందని  డాక్టర్ హిమాన్షు పాఠక్ అన్నారు.    "వాతావరణ మార్పు, ఆహార భద్రత,   పోషకాహారానికి సంబంధించిన అంశాల్లో   మహిళలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించి, నిర్ణయాధికారాన్ని కల్పించడం లాంటి అంశాలు సదస్సులో చర్చకు వస్తాయి" అని  డాక్టర్ పాఠక్ తెలిపారు. 

అత్యాధునిక జ్ఞానాన్ని పంచుకోవడం, లింగ-సమానత్వం సాధించడం, సమగ్ర సమాజాభివృద్ధి,  స్థితిస్థాపకంగా ఉండే ఆహార వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి  పరిశోధనఫలితాలు క్షేత్ర స్థాయిలో అమలు జరిగేలా చూసేందుకు అవసరమైన చర్యలను సదస్సులో చర్చిస్తామని  ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్స్ కన్సార్టియం జెండర్ ఇంపాక్ట్ ప్లాట్‌ఫారమ్   డైరెక్టర్ డాక్టర్ నికోలిన్ డి హాన్ తెలిపారు. 

"ప్రపంచవ్యాప్తంగా, వ్యవసాయ-ఆహార వ్యవస్థలలో లింగ అసమానత చాలా ముఖ్యమైన సవాలుగా మిగిలిపోయింది. కోవిడ్ -19 మరియు వాతావరణ మార్పు వంటి సంక్షోభాల వల్ల ప్రస్తుత అసమానతలు మరింత పెరుగుతున్నాయి. పురుషులతో పోల్చి చూస్తే మహిళలకు  ఆహార భద్రత తక్కువగా ఉంటుంది.  వరదలు, కరువుల వంటి సంఘటనలు మహిళలపై ప్రభావం చూపుతున్నాయి.లింగ సమానత్వం, మహిళా సాధికారతపై ప్రపంచ లక్ష్యాలను సాధించడానికి పరిశోధన, సాక్ష్యాలు,ఆచరణాత్మక అవగాహన కార్యక్రమాలు అమలు జరగాల్సి ఉంటుంది' అని  ”డాక్టర్ డి హాన్ అన్నారు. 

ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్స్ కన్సార్టియం జెండర్ ఇంపాక్ట్ ప్లాట్‌ఫారమ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ నిర్వహిస్తున్న సదస్సు లింగ సమానత్వం కోసం పనిచేస్తున్న పరిశోధకులు, ఇతర రంగాలలో పరిశోధనలు నిర్వహిస్తున్న వారు ఒక ప్రపంచ వేదిక పైకి వచ్చి వ్యవసాయ రంగంలో లింగ సమానత్వం కోసం జరుగుతున్న ప్రయత్నాలు చర్చించి మహిళల నాయకత్వంలో వ్యవసాయ-ఆహార వ్యవస్థల అభివృద్ధికి దోహదపడే సూచనలు చేస్తారు. 

సదస్సులో  140 కంటే ఎక్కువ మౌఖిక ప్రదర్శనలు, 85 పోస్టర్లు, 25 ఉన్నత స్థాయి చర్చలు, ముఖ్య ఉపన్యాసాలు ఉంటాయి.  60 సమాంతర సదస్సులు కూడా జరుగుతాయి.  అంతర్జాతీయ ప్రతినిధులు, భారతదేశానికి చెందిన  మహిళా పారిశ్రామికవేత్తలు తమ పని, ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు.  పరిశోధనా సంస్థలు, జాతీయ వ్యవసాయ పరిశోధన, విస్తరణ వ్యవస్థలు, ప్రభుత్వేతర సంస్థలు, ప్రజా  సంస్థలు, పెట్టుబడిదారులు , విధాన రూపకల్పన సంస్థలు, ప్రైవేట్ రంగానికి చెందిన నిపుణులు సదస్సులో పాల్గొంటారు. 

భారతదేశంలో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న దాదాపు 13 కోట్ల మంది సన్నకారు రైతుల  అభివృద్ధి కోసం ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్స్ కన్సార్టియం జెండర్ ఇంపాక్ట్ ప్లాట్‌ఫారమ్, ఇతర పరిశోఇధన సంస్థల సహకారంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కార్యక్రమాలు అమలు చేస్తోంది.   మహిళలకు అనువైన వ్యవసాయ విధానాలు రూపొందించి అమలు చేసి లింగ సమానత్వం సాధించి సుస్థిర సమాజ అభివృద్ధి సాధించడానికి ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్స్ కన్సార్టియం జెండర్ ఇంపాక్ట్ ప్లాట్‌ఫారమ్ కృషి చేస్తుంది.  ప్రపంచంలోని అతిపెద్ద జాతీయ వ్యవసాయ పరిశోధన,   విస్తరణ వ్యవస్థలలోఒకటిగా గుర్తింపు పొందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ తో కలిసి పనిచేస్తున్న ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్స్ కన్సార్టియం జెండర్ ఇంపాక్ట్ ప్లాట్‌ఫారమ్ పరిశోధన ఫలితాలు క్షేత్ర స్థాయిలో అమలు జరిగేలా చూసేందుకు కార్యక్రమాలు అమలు చేస్తోంది.   

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ పర్యవేక్షణలో దేశవ్యాప్తంగా 113 పరిశోధన సంస్థలు, 

 76 వ్యవసాయ విశ్వవిద్యాలయాలు పని చేస్తున్నాయి. వాతావరణ మార్పు , ఆహార భద్రత,  పోషకాహార రంగంలో మహిళల నాయకత్వంపై జీ-20 తీసుకున్న నిర్ణయాలు అమలు జరిగేలా చూసే అంశంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి రైతులకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్విలువైన సూచనలు, సలహాలు అందిస్తోంది. 

 

***



(Release ID: 1965060) Visitor Counter : 95