పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
భారత్‌పై సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేస్తూ సీటీసీ కంప్లైయన్స్ ఇండెక్స్‌లో చేర్చిన ఏడబ్ల్యూజీ
ఐబీసీ, 2016లోని సెక్షన్ 14 (3) ప్రకారం సీటీసీ పరిధిలోకి వచ్చే విమాన పరికరాలను మారటోరియం నుంచి మినహాయిస్తూ భారత ప్రభుత్వం ప్రకటన జారీ చేసిన నేపథ్యంలో చోటు చేసుకున్న సానుకూల పరిణామం
Posted On:
06 OCT 2023 3:51PM by PIB Hyderabad
'కేప్ టౌన్ కన్వెన్షన్ & ఎయిర్‌క్రాఫ్ట్ ప్రోటోకాల్'కు సంప్రదింపుల దేశమైన భారత్, కేప్‌టౌన్ ఒప్పందానికి అనుగుణంగా, కేప్ టౌన్ ఒప్పందంలోకి వచ్చే విమానాలు, విమాన ఇంజిన్లు, ఎయిర్‌ఫ్రేమ్‌లు, హెలికాప్టర్లకు దివాలా స్మృతి-2016 కింద మారటోరియం వర్తించదని ప్రకటన జారీ చేసింది. ఈ నెల 3వ తేదీన ఈ ప్రకటన జారీ అయింది.
ఈ ప్రకటన తర్వాత, ఏవియేషన్ వర్కింగ్ గ్రూప్ (ఏడబ్ల్యూజీ), తన సీటీసీ కంప్లైయన్స్ ఇండెక్స్‌లో భారతదేశంపై సానుకూల వాచ్‌లిస్ట్ నోటీసును జారీ చేసింది. విమాన పరికరాలను లీజుకు తీసుకోవడానికి/రుణాలను సులభంగా పొందడానికి భారత విమానయాన సంస్థలకు ఇది సానుకూల పరిణామం.
***
(Release ID: 1965046)