హోం మంత్రిత్వ శాఖ

‘జమ్ము & కశ్మీర్ డెమోక్రటిక్ ఫ్రీడం పార్టీ’ని నిషేధించిన భారత ప్రభుత్వం

Posted On: 05 OCT 2023 9:00PM by PIB Hyderabad

చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ)-1967లోని సెక్షన్ 3(1) ప్రకారం, ‘జమ్ము&కశ్మీర్ డెమోక్రటిక్ ఫ్రీడమ్ పార్టీ’ని (జేకేడీఎఫ్‌పీ) 'చట్టవిరుద్ధమైన సంస్థ'గా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంస్థ 1998 నుంచి దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటోంది. ఈ పార్టీ సభ్యులు భారతదేశంలో వేర్పాటువాదం, ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్నారు. ప్రజలను రెచ్చగొట్టడం ద్వారా కశ్మీర్‌ను ప్రత్యేక ఇస్లామిక్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు, ఇది భారతదేశ సార్వభౌమాధికారం, భద్రత, సమగ్రతకు విఘాతం కలిగిస్తుంది. ఈ సంస్థపై యూఏపీఏ 1967, ఐపీసీ 1860, ఆయుధాల చట్టం 1959, రణ్‌బీర్ శిక్షాస్మృతి 1932లోని వివిధ సెక్షన్ల కింద చాలా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.

 

***(Release ID: 1964883) Visitor Counter : 105


Read this release in: Urdu , English , Hindi , Assamese