హోం మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నిర్వహించిన మూడవ రెండు రోజుల "యాంటీ టెర్రర్ కాన్ఫరెన్స్"ను ప్రారంభించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు గత 9 సంవత్సరాలుగా దేశంలో అన్నిరకాల టెర్రరిజాన్ని దృఢంగా అరికట్టడంలో విజయం సాధించాయి.

మనం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడమే కాకుండా దాని మొత్తం పర్యావరణ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలి.

కొత్త ఉగ్రవాద సంస్థ ఏదీ ఏర్పడకుండా అన్ని ఉగ్రవాద వ్యతిరేక సంస్థలు నిర్దాక్షిణ్య వైఖరిని అవలంబించాలి.

నమూనా ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థ (మోడల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్) ను ఎన్ ఐ ఎ పరిధిలో ఏర్పాటు చేయాలి:

అన్ని రాష్ట్రాల్లోని అన్ని ఉగ్రవాద వ్యతిరేక సంస్థల దర్యాప్తు శ్రేణి, నిర్మాణం, ఎస్ ఒ పి లను కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య మెరుగైన సమన్వయం కోసం ఏకరీతిగా మార్చాలి

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విధానంలో ఏకరూపతను తీసుకురావడానికి ఒక కామన్ ట్రైనింగ్ మాడ్యూల్ ను రూపొందించడానికి మనం కృషి చేయాలి.

గడచిన 5 సంవత్సరాలలో, మోదీ ప్రభుత్వం అనేక భారీ డేటాబేస్ లను సిద్ధం చేసింది: ఉగ్రవాదంపై పోరాటంలో విజయం సాధించడానికి అన్ని కేంద్ర , రాష్ట్ర సంస్థలు ఈ డేటాబేస్ లను బహుముఖంగా ఉపయోగించుకోవాలి
ఇన్వెస్టిగేషన్, ప్రాసిక్యూషన్, ప్రివెన్షన్ , యాక్షన్ కోసం డేటాబేస

Posted On: 05 OCT 2023 6:07PM by PIB Hyderabad

జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) నిర్వహించిన రెండు రోజుల ఉగ్రవాద వ్యతిరేక సదస్సును కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రామాణిక్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్, ఎన్ఐఎ డైరెక్టర్ జనరల్, కేంద్ర సాయుధ పోలీసు దళాల డైరెక్టర్ జనరల్స్ , రాష్ట్ర పోలీసు చీఫ్  లు, , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

సేవలో ప్రతిభ కనబరిచిన ఎన్ఐ ఎ అధికారులకు హోంమంత్రి పతకాలు ప్రదానం చేశారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు గత 9 సంవత్సరాల్లో దేశంలో అన్నిరకాల టెర్రరిజాన్ని దృఢంగా అరికట్టడంలో  విజయం సాధించాయని శ్రీ అమిత్ షా తమ ప్రారంభోపన్యాసంలో తెలిపారు. ఎన్ ఐ ఎ పరిధిలో మోడల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ ను ఏర్పాటు చేయాలని, కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య మెరుగైన సమన్వయం కోసం అన్ని రాష్ట్రాల్లోని అన్ని ఉగ్రవాద వ్యతిరేక సంస్థల దర్యాప్తు శ్రేణి, నిర్మాణం, ఎస్ ఒ పి లను  ఏకరీతిగా రూపొందించాలని కేంద్ర హోం మంత్రి అన్నారు. కొత్త ఉగ్రవాద సంస్థ ఏర్పడకుండా అన్ని ఉగ్రవాద వ్యతిరేక సంస్థలు కఠిన వైఖరిని అవలంబించాలని, ఎన్ఐఎ, ఎటీఎస్, ఎస్ టి ఎఫ్ ల పని దర్యాప్తుకే పరిమితం కాకుండా, వారు కూడా ఆలోచించి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు వినూత్న చర్యలు చేపట్టాలని సూచించారు. ఉగ్రవాదంపై పోరాటానికి అంతర్జాతీయ స్థాయి నుంచి కిందిస్థాయి వరకు సహకారం అవసరమని, దేశంలోని వివిధ రాష్ట్రాల భాగస్వామ్యంతో పాటు అంతర్జాతీయ సహకారం అవసరమని ఆయన అన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003EZHM.jpg

క్రిప్టో, హవాలా, టెర్రర్ ఫండింగ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్స్, నార్కో టెర్రర్ లింకులు వంటి అన్ని సవాళ్లపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకుందని, ఇది చాలా మంచి ఫలితాలను ఇచ్చిందని, అయితే ఇంకా చాలా చేయాల్సి ఉందని శ్రీ అమిత్ షా అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే కేంద్రం, రాష్ట్రాలు, వాటి ఏజెన్సీలు, ఇంటర్ ఏజెన్సీ సహకారం, నేరుగా, సమాంతరంగా ఆలోచించాల్సి ఉంటుందన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గ త 5 సంవత్సరాలలో పలు డేటాబేస్ వర్టికల్స్ ను సిద్ధం చేసిందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని సంస్థలు బహుముఖ, కృత్రిమ మేధ ఆధారిత డేటాబేస్ ను ఉపయోగించుకోవాలని, అప్పుడే ఉగ్రవాదంపై పోరులో విజయం సాధిస్తామని ఆయన ఉద్ఘాటించారు. దర్యాప్తు, ప్రాసిక్యూషన్, నివారణ, చర్యల కోసం ఈ డేటాబేస్ ను వినియోగించుకోవాలని, ప్రతి పోలీస్ స్టేషన్ తో పాటు యువ పోలీసు అధికారులు డేటాబేస్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

డేటా బేస్  ఉపయోగం

ఇంటర్ ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐ సి జె ఎస్) - సి సి టి ఎన్ ఎస్ 99.93 శాతం అంటే 16,733 పోలీస్ స్టేషన్లు, 22 వేల కోర్టులను ఇ-కోర్టుకు అనుసంధానం చేసి, ఇ-జైలు ద్వారా సుమారు రెండు కోట్ల మంది ఖైదీల డేటా, ఇ-ప్రాసిక్యూషన్ ద్వారా కోటి మంది ఖైదీల డేటాను అందుబాటులో ఉంచారు.

ఇ -ఫోరెన్సిక్స్ నుంచి 17 లక్షలకు పైగా ప్రాసిక్యూషన్ డేటా, 17 లక్షలకు పైగా ఫోరెన్సిక్ డేటా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా నేషనల్ ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టం (ఎన్ఏఎఫ్ఐఎస్)లో 90 లక్షలకు పైగా వేలిముద్రల రికార్డులు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ మానిటరింగ్ ఆఫ్ టెర్రరిజం (ఐ-ఎంఓటీ) కింద, యుఎపిఎ నమోదైన కేసులను పర్యవేక్షించడానికి 22 వేల ఉగ్రవాద కేసుల డేటా అందుబాటులో ఉంది. నిడాన్ కింద 5 లక్షల మందికి పైగా నార్కో నేరస్థుల డేటా అందుబాటులో ఉంది, అంటే అరెస్టు అయిన  నార్కో-నేరస్థులపై నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేటాబేస్. నేషనల్ డేటాబేస్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అఫెండర్స్ (ఎన్ డి హెచ్ జి ఒ ) కింద సుమారు లక్ష మంది మానవ అక్రమ రవాణాదారుల డేటా అందుబాటులో ఉంది. క్రైమ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ (క్రి-మ్యాక్) కింద 14 లక్షలకు పైగా హెచ్చరికల డేటా అందుబాటులో ఉంది. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్ సి ఆర్ పి )లో 28 లక్షలకు పైగా ఫిర్యాదుల డేటా అందుబాటులో ఉంది. ఖైదీల బయోమెట్రిక్ డేటాబేస్ , వారి సందర్శకుల సమాచారం ప్రిజన్ డేటాబేస్ లో అందుబాటులో ఉంది. వీటితో పాటు ఎన్ఐ ఎకు చెందిన జాతీయ స్థాయి టెర్రరిజం డేటాబేస్ కూడా అందుబాటులో ఉంది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004AVCI.jpg

అన్ని కేంద్ర, రాష్ట్ర స్థాయి ఉగ్రవాద వ్యతిరేక సంస్థలకు ఉమ్మడి శిక్షణ మాడ్యూల్ ఉండాలని, తద్వారా ఉగ్రవాదంపై పోరాడే విధానంలో ఏకరూపతను తీసుకురావచ్చని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ దిశగా ఎన్ఐఎ, , ఐబీ చొరవ చూపాలని కోరారు. భాగస్వామ్యం చేయాల్సిన అవసరం, భాగస్వామ్య దృక్పథాన్ని పంచుకోవడం ఇప్పుడు అవసరం నుంచి పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని శ్రీ షా అన్నారు.

2001లో 6000 ఉగ్రవాద ఘటనలు జరిగాయని, 2022 నాటికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ సంఖ్యను 900కు తగ్గించిందన్నారు. ఎన్ఐ ఎ 94 శాతానికి పైగా కన్విక్షన్ రేటును  సాధించిందని, ఈ దిశగా మరింత కృషి అవసరమని ఆయన ప్రశంసించారు. శిక్షల శాతాన్ని పెంచేందుకు అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని కోరారు.

మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాల సహకారంతో మద్యానికి వ్యతిరేకంగా పోరాటంలో పెద్ద విజయాలు సాధించామని కేంద్ర హోం మంత్రి తెలిపారు. ఈ విజయాల లో ఎన్ సి బి ఆధ్వర్యంలో ఈ ఏడాది నిర్వహించిన ఆపరేషన్ సముద్రగుప్తలో ఏకకాలంలో రూ.12 వేల కోట్లకు పైగా విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం కూడా భాగం. వీటితో పాటు 10 లక్షల కిలోల మత్తు మందులను కూడా తరలించారు.

 ఉగ్రవాదానికి సరిహద్దులు లేవని, ఉగ్రవాదాన్ని ఏ రాష్ట్రం ఒంటరిగా ఎదుర్కోజాలదని అమిత్ షా అన్నారు. ఈ దురాచారాన్ని రూపుమాపడానికి మనమందరం కలిసి రావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రతి సెషన్ లో 5 కార్యాచరణ అంశాలను రూపొందించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపాలని హోం మంత్రి సూచించారు.

2004 నుంచి 2014 వరకు పదేళ్లతో పోలిస్తే 2014 నుంచి 2023 వరకు తొమ్మిదేళ్లలో జమ్మూకశ్మీర్ లో హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయి.

జమ్ముకశ్మీర్: అభివృద్ధి, శాంతికి కొత్త వెలుగు

 

సూచిక

జూన్ 2004 నుంచి మే 2014

జూన్  2014 నుంచి
ఆగస్టు 2023

తగ్గుదల శాతం 

మొత్తం ఘటనలు 

7217

2197

70 % తగ్గుదల

మొత్తం మరణాలు (పౌరులు+ భద్రతా సిబ్బంది)

2829

891

69 % తగ్గుదల 

పౌరుల మరణాలు 

1769

336

81 % తగ్గుదల 

భద్రతా సిబ్బంది మరణాలు

1060

555

48 % తగ్గుదల

 

***



(Release ID: 1964850) Visitor Counter : 89