భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సుస్థిర అభివృద్ధి, పరిశుభ్రత (స్వచ్ఛత) మరియు కర్బన ఉద్గార నియంత్రణ దిశగా భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ వివిధ కార్యక్రమాలు చేపట్టింది.


ఎఫ్ ఏ ఎం ఈ( ఫేమ్) ఇండియా పథకం II కింద మద్దతునిచ్చే ఎలక్ట్రిక్ వాహనాలు 26,041,426 లీటర్ల ఇంధనాన్ని ఆదా చేశాయి, ఫలితంగా ఇప్పటికే 37,718,893 కిలోల సీ ఓ 2 తగ్గింది

Posted On: 05 OCT 2023 3:02PM by PIB Hyderabad

భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ సుస్థిరమైన అభివృద్ధి, పరిశుభ్రత (స్వచ్ఛత) మరియు కర్బన ఉద్గార నియంత్రణకు సంబంధించిన అనేక కార్యక్రమాలను చురుకుగా తీసుకుంటోంది. నికర-సున్నా ఉద్గారాలను సాధించడంలో దేశం యొక్క నిబద్ధతకు అనుగుణంగా, ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను ప్రోత్సహించడంలో మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ఎం హెచ్ ఐ గణనీయమైన పురోగతి సాధించింది. ఫేమ్ ఇండియా స్కీమ్ II కింద, దాదాపు 1,016,598 ఎలక్ట్రిక్ వాహనాలు డిమాండ్ ప్రోత్సాహకం ద్వారా రూ. 4,807 కోట్లకు మద్దతునిచ్చాయి, దీని ఫలితంగా సుమారు 26,041,426 లీటర్ల ఇంధనం ఆదా అవుతుంది మరియు దాదాపు 37,718,893 కిలోల సీఓ2 తగ్గింది. గణాంకాలు కాలంతో పాటు పెరుగుతూనే ఉంటాయి. 2014లో అతితక్కువగా ఉన్న ఈవి ల విక్రయాలు ఇప్పుడు మొత్తం వాహన విక్రయాల్లో దాదాపు 5%కి చేరాయి. ఈ విజయాలు సుస్థిర అభివృద్ధికి మంత్రిత్వ శాఖ యొక్క నిబద్ధతను మరియు వాతావరణ మార్పుల సవాళ్లను పరిష్కరించడంలో దాని చురుకైన విధానాన్ని ప్రతిబింబిస్తాయి.

 

పరిశుభ్రమైన మరియు చెత్త రహిత భారతదేశాన్ని ప్రోత్సహించడానికి మరియు స్వచ్ఛత (పరిశుభ్రత)ని సంస్థాగతీకరించడానికి ఎం హెచ్ ఐ చేస్తున్న ప్రయత్నాలకు కొనసాగింపుగా, 15 సెప్టెంబర్, 2023 నుండి 30 సెప్టెంబర్, 2023 వరకు ప్రారంభమైన ప్రత్యేక ప్రచారం 3.0 యొక్క సన్నాహక దశలో లక్ష్యాలను గుర్తించడంలో గొప్ప విజయం సాధించబడింది.  ఈ సంవత్సరం చెప్పుకోదగిన 5.6 లక్షల చ.అ. చెత్త మరియు ఇతర అనవసరమైన పదార్థాన్ని పారవేయడం తర్వాత స్థలం ఖాళీ చేయబడుతుందని అంచనా. 65,944  ఫైల్‌లు సమీక్ష కోసం గుర్తించబడ్డాయి, 33,789  ఫైల్‌లు తొలగించబడతాయి మరియు 5,017 ఎలక్ట్రానిక్ ఫైల్‌లు ప్రచారం యొక్క ప్రధాన దశలో అంటే అక్టోబర్ 2, 2023 నుండి 31 అక్టోబర్, 2023 వరకు మూసివేయబడతాయి.

 

సుస్థిర అభివృద్ధి పట్ల మంత్రిత్వ శాఖ యొక్క నిబద్ధతకు అనుగుణంగా,  ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీ హెచ్ ఈ ఎల్ ), హరిత్ బిహెచ్‌ఇఎల్‌ను  హరిత కంపెనీగా నిలబెట్టడానికి మరియు దాని వ్యాపార వృద్ధి కోసం వ్యూహంలో ఒక భాగం చేయడానికి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. 

 

'హరిత్ బీ హెచ్ ఈ ఎల్' కింది లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది:

 

2047 నాటికి నికరసున్నా మరియు జల నిరాధార కంపెనీగా కనిష్ట పర్యావరణ ప్రభావంతో ఉండాలి.

 

దాని తయారీ యూనిట్లన్నింటికీ హరిత అంచనా వేయడానికి కంపెనీ హరిత రేటింగ్ (గ్రీన్‌కో రేటింగ్) కోసం 

 

బీ హెచ్ ఈ ఎల్ అంతటా 75,000 మొక్కలు నాటడం, నీరు మరియు ఇంధన ఆడిట్‌లు నిర్వహించడం, సున్నా ద్రవ విడుదల స్థితిని పొందడం, నీటి వనరులను సృష్టించడం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలను ఏర్పాటు చేయడం, ఘన వ్యర్థాలను నిర్వహించడం, సహజ సూర్యకాంతిని ఉపయోగించడం మరియు మరిన్ని సోలార్ పీ వీ ల విద్యుదుత్పత్తి కేంద్రాలను వ్యవస్థాపించడం వంటి తొమ్మిది కేంద్రీకృత సుస్థిరత్వ కార్యక్రమాలను అమలు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది

 

గౌరవ భారీ పరిశ్రమల మంత్రిచే తొలి మరియు 75000వ చెట్టు నాటారు

 

ఈ కార్యక్రమంలో భాగంగా భారీ పరిశ్రమల శాఖ మంత్రి డా.మహేంద్ర నాథ్ పాండే ఇటీవల 75000 చెట్ల పెంపకంలో పాల్గొన్నారు. హరిత్ బీ హెచ్ ఈ ఎల్ వాతావరణ సానుకూల చర్య  భారతదేశం యొక్క హరిత నిబద్ధతకు అనుగుణంగా ఉంది. ఇది బీ హెచ్ ఈ ఎల్ తన కార్బన్ పాదముద్రను తగ్గించడానికి, ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడానికి మరియు మార్కెట్‌లో పోటీతత్వాన్ని పొందేందుకు సహాయపడుతుంది. హరిత్ బీ హెచ్ ఈ ఎల్ అనేది బీ హెచ్ ఈ ఎల్ యొక్క పర్యావరణ స్పృహ మరియు సామాజిక బాధ్యతకు ప్రతిబింబం.

 

***


(Release ID: 1964722) Visitor Counter : 109


Read this release in: English , Urdu , Hindi