మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ప్రాజెక్టు సంవత్సరం 2023-24కు నేషనల్ మీన్స్-కమ్- మెరిట్ స్కాలర్‌షిప్ స్కీం (ఎన్ఎంఎంఎస్ఎస్) కోసం నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్ ఎస్‌పి) పై తాజా దరఖాస్తుల ఆన్‌లైన్ సమర్పణ, పునరుద్ధరణ ప్రారంభం
ఎనిమిదవ తరగతి నుంచి డ్రాప్ ఔట్లను తగ్గించేందుకు ఆర్ధికంగా బలహీన వర్గాలకు ప్రతిభావంతులైన విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌ల ప్రదానం
రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం అందుకుంటున్న, స్థానిక సంస్థల పాఠశాలల్లో ఎంపిక చేసిన 9వ తరగతి విద్యార్ధులకు వార్షికంగా లక్ష తాజా స్కాలర్‌షిప్‌ల ప్రదానం
प्रविष्टि तिथि:
04 OCT 2023 5:46PM by PIB Hyderabad
ప్రాజెక్టు సంవత్సరం 2023-24స్కాలర్‌షిప్‌ల కోసం నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (ఎన్ఎస్‌పి)లో దరఖాస్తుల ఆన్‌లైన సమర్పణ/ నమోదు ప్రక్రియ 01 అక్టోబర్ 2023న ప్రారంభమైంది.
విద్యా మంత్రిత్వ శాఖ 9 నుంచి 12 తరగతి వరకు పాఠశాల కోసం అమలు చేస్తున్న నేషనల్ మీన్స్ -కమ్- మెరిట్ స్కాలర్‌షిప్ పథకం కింద ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల విద్యార్ధులకు 8వ తరగతిలో డ్రాపౌట్‌ను తగ్గించి, సెకెండరీ దశలో విద్యను కొనసాగించేందుకు వారిని ప్రోత్సహించడానికి ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తారు. ప్రతి ఏడాదీ 9వ తరగతి నుంచి ఎంపిక చేసిన విద్యార్ధులకు ఒక లక్ష తాజా స్కాలర్‌షిప్‌ను అందిస్తారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందుతున్న, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు 10 నుంచి 12 వ తరగతుల వరకు స్కాలర్‌షిప్‌లు వారి కొనసాగింపు/ పునరుద్ధరణ తర్వాత అందిస్తారు. ఏడాదికి అందించే స్కాలర్‌షిప్ ఏడాదికి రూ.12000గా ఉంటుంది.
నేషనల్ మీన్స్ -కమ్- మెరిట్ స్కాలర్‌షిప్ పథకం (ఎన్ఎంఎంఎస్ఎస్)ను విద్యార్ధులకు ఉద్దేశించిన స్కాలర్‌షిప్ పథకాల కోసం ఏకగవాక్ష వేదిక అయిన నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో పొందుపరిచడం జరిగింది.ఎన్ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వ ఆర్ధిక నిర్వహణ వ్యవస్థ (పిఎఫ్ఎంఎస్) ద్వారా డిబిటి పద్ధతిని అనుసరించి ఎలక్ట్రానిక్ బదిలీ ద్వారా ఎంపిక చేసిన విద్యార్ధుల బ్యాంక్ ఎకౌంట్లలో జమ చేస్తారు. ఇది ప్రభుత్వ రంగ పథకం.
అన్ని మార్గాల ద్వారా తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 3,50,000కు మించని విద్యార్ధులు ఈ స్కాలర్‌షిప్‌లను పొందేందుకు అర్హులు. దీనిని పొందేందుకు 7వ తరగతి పరీక్షలో కనీసం 55% (ఎస్‌సి/ ఎస్‌టి విద్యార్ధులకు 5% సడలింపు) మార్కులు పొంది, స్కాలర్‌షిప్ కోసం ఎంపిక పరీక్షకు హాజరుకావాలి.
నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌పై రెండు స్థాయిలలో స్కాలర్‌షిప్ దరఖాస్తుల తనిఖీ జరుగుతుంది. మొదటి స్థాయిలో సంస్థ / పాఠశాల స్థాయిలో సంస్థ నోడల్ అధికారి (ఐఎన్ఒ), రెండవ స్థాయిలో జిల్లా నోడల్ అధికారి (డిఎన్ఒ) ద్వారా జరుగుతుంది.
ప్రస్తుత సంవత్సరంలో, తాజా దరఖాస్తుల నమోదుకు,దరఖాస్తుల పునరుద్ధరణకు, ఎన్ఎస్‌పిపై లెవెల్-1, లెవెల్ -2 తనిఖీలకు కాలక్రమాలు దిగువన పేర్కొన్నట్టు ఉన్నాయిః
స్కీం కార్యకలాపాలు తేదీ
దరఖాస్తులకు పోర్టల్ తెరవడం 1 అక్టోబర్ 2023
దరఖాస్తుల సమర్పణకు ఆఖరి తేదీ 30 నవంబర్ 2023
తొలి లెవెల్‌కు ఆఖరు తేదీ
(ఐఎన్ఒ తనిఖీ) 15 డిసెంబర్ 2023
రెండవ లెవెల్‌కు ఆఖరు తేదీ
(డిఎన్ఒ తనిఖీ) 30 డిసెంబర్ 2023
***
(रिलीज़ आईडी: 1964521)
आगंतुक पटल : 160