ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా క్రీడల మహిళ 800 మీటర్ల పరుగు రజతం సాధించిన హర్మిలన్ బెయిన్స్ను అభినందించిన ప్రధానమంత్రి

Posted On: 04 OCT 2023 7:21PM by PIB Hyderabad

   సియా క్రీడల్లో మహిళల 800 మీటర్ల పరుగులో రజత పతకం సాధించిన హర్మిలన్ బెయిన్స్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“ఆసియా క్రీడల్లో మహిళల 800 మీటర్ల పరుగులో భారత్‌కు మరో రజతం దక్కింది. ఈ మేరకు అద్భుత ప్రతిభ ప్రదర్శించిన హర్మిలన్‌ బెయిన్స్‌ @HarmilanBainsకు నా  అభినందనలు. దేశంలోని ఔత్సాహిక క్రీడాకారులందరికీ ఈ విజయం స్ఫూర్తిదాయకం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 1964509)