గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డెహ్రాడూన్‌లో 4వ ఈఎంఆర్‌ఎస్‌ నేషనల్ కల్చరల్ & లిటరరీ ఫెస్ట్ మరియు కళా ఉత్సవ్- 2023ని ప్రారంభించిన శ్రీ అర్జున్ ముండా


పిల్లలు మరియు ఉపాధ్యాయులు దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతులను అర్థం చేసుకోవడానికి మరియు తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించే కార్యక్రమం ఈఎంఆర్‌ఎస్‌ ; ప్రధాని పిలుపునిచ్చిన 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్'కార్యక్రమాన్ని సాకారం చేస్తుంది: శ్రీ అర్జున్ ముండా

22 రాష్ట్రాల నుండి 2000 మందికి పైగా గిరిజన విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను ప్రదర్శించడానికి జాతీయ వేదికను అందించడానికి ఎన్‌ఈఎస్‌టిఎస్ నాలుగు రోజుల పాటు నిర్వహించబడుతుంది.

प्रविष्टि तिथि: 04 OCT 2023 12:13PM by PIB Hyderabad

3 అక్టోబర్ 2023న డెహ్రాడూన్‌లో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి సమక్షంలో 4వ ఈఎంఆర్‌ఎస్‌ నేషనల్ కల్చరల్ & లిటరరీ ఫెస్ట్ మరియు కళా ఉత్సవ్- 2023ని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా ప్రారంభించారు.కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్‌ఈఎస్‌టిఎస్‌) ద్వారా నిర్వహించబడింది. ఉత్తరాఖండ్‌లోని ఏకలవ్య విద్యాలయ సంగతన్ సమితి (ఈవిఎస్‌ఎస్‌) ద్వారా డెహ్రాడూన్‌లోని మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజీలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

 

image.png


వివిధ రంగాలలో తమకు ఉన్న ప్రతిభను ప్రదర్శించడానికి గిరిజన విద్యార్ధులకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్‌ఎస్‌) కల్చరల్ ఫెస్ట్ జాతీయ వేదికను అందిస్తుంది. ఈ నాలుగు రోజుల కార్యక్రమంలో (అక్టోబర్ 3 - 6) 22 రాష్ట్రాల నుండి 2000 మంది గిరిజన విద్యార్థులచే ప్రదర్శనలు ఇవ్వబడతాయి. ఈ ఉత్సవంలో నృత్యం మరియు పాటల ప్రదర్శనలు మొదలుకుని క్విజ్ మరియు దృశ్య కళల వరకు 20కి పైగా ఈవెంట్‌లు నిర్వహించబడతాయి. అలాగే గిరిజన సాంస్కృతిక ప్రదర్శనల కోసం వివిధ రాష్ట్రాల నుండి స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

 

154956 2.jpg


పిల్లలు మరియు ఉపాధ్యాయులు ఒకరినొకరు కలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి మరియు ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యొక్క 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' దృక్పథాన్ని నెరవేర్చడానికి దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి ఈఎంఆర్‌ఎస్‌ అవకాశం కల్పిస్తుందని శ్రీ అర్జున్ ముండా పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మీకు స్ఫూర్తిని ఇస్తాయని, మీ స్వంత సంస్కృతితో పాటు దేశంలోని వివిధ మూలల్లో నివసిస్తున్న గిరిజన వర్గాల గొప్ప సంప్రదాయాల గురించి తెలుసుకునే మంచి అవకాశాన్ని ఇస్తాయని తాను నమ్ముతున్నానని శ్రీ అర్జున్ ముండా చెప్పారు.

 

image.png


ఉత్తరాఖండ్‌లోని గిరిజనుల విభిన్న సంప్రదాయాలు మరియు సంస్కృతిని మరియు రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాలను ఈ సందర్భంగా శ్రీ పుష్కర్ సింగ్ ధామి హైలైట్ చేశారు.ఈ ప్రారంభ కార్యక్రమంలో ఎం/ఓ గిరిజన వ్యవహారాల జాయింట్ సెక్రటరీ  మరియు ఎన్‌ఈఎస్‌టిఎస్‌ డాక్టర్ నావల్‌ జిత్‌ కపూర్‌ ఈఎంఆర్‌ఎస్ పథకం గురించి వివరించారు.ప్రారంభ వేడుకలో ఉత్తరాఖండ్‌లోని గిరిజన సంఘాలు మరియు ఈఎంఆర్‌ఎస్‌ విద్యార్థుల నుండి అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి.

 

154956.jpg

   
'ఈఎంఆర్‌ఎస్ నేషనల్ కల్చరల్ ఫెస్ట్' అనేది ఈఎంఆర్‌ఎస్‌లలో విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులు ప్రతి సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమం. ఎన్‌ఈఎస్‌టిఎస్ భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగల కోసం ఈఎంఆర్‌ఎస్‌లను అమలు చేస్తోంది.ఈఎంఆర్‌ఎస్‌ పథకం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన కార్యక్రమాలలో ఒకటి. గిరిజన విద్యార్థులు మారుమూల గిరిజన ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను పొందేలా చూసేందుకు 2018-19 సంవత్సరంలో పునరుద్ధరించబడింది.

 

***


(रिलीज़ आईडी: 1964094) आगंतुक पटल : 129
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , हिन्दी , Tamil