కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కేదారా క్యాపిటల్ ఫండ్ III ఎల్ఎల్ పి ద్వారా లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో నిర్దిష్ట వాటాను కొనుగోలు చేయడానికి ఆమోదించిన సిసిఐ
प्रविष्टि तिथि:
03 OCT 2023 8:29PM by PIB Hyderabad
లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్ష్యిత) లో నిర్ధిష్ట వాటాను కేదారా కాపిటల్ ఫండ్ III ఎల్ఎల్‌పి (కొనుగోలుదారు) కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.
ప్రతిపాదిత కలయిక కేదారా కాపిటల్ ఫండ్ III ఎల్ఎల్‌పి ద్వారా లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు సంబంధించి పూర్తిగా పలచబడిన ప్రాతిపదికన జారీ చేసిన వాటా మూలధనంలో సుమారు 1.74 శాతం కొనుగోలుకు సంబంధించింది.
కొనుగోలుదారు ప్రైవేట్ ఈక్విటీ నిధి, ఇది సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాలో కేటగిరీ 2 ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధిగా నమోదు చేసినది. అంతేకాక, కంపెనీలలో పెట్టుబడి పెట్టే కార్యాచరణలో నిమగ్నమై ఉన్నది.
లక్ష్యిత సంస్థ భారతదేశంలో ఏర్పడిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ . భారతదేశంలో దిగువన పేర్కొన్న వ్యాపారాలను లక్ష్యిత సంస్థ చేస్తున్నది- 1) కళ్ళద్దాలు, చలువకళ్ళద్దాలు, కళ్ళజోడు ఉపకరణాల సహా కళ్ళజోళ్ళ తయారీ, అలా తయారుచేసిన ఉత్పత్తుల అమ్మకం (రిటైల్) తదితరాలు; 2) కళ్ళజోడు ఉత్పత్తుల టోకు వ్యాపారం.
సిసిఐ వివరణాత్మక ఉత్తర్వు వెలువడనుంది.
***
(रिलीज़ आईडी: 1963925)
आगंतुक पटल : 156