రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
రోడ్డు భద్రతపై చెక్ రిపబ్లిక్ ప్రాగ్‌లో జరిగిన 27వ ప్రపంచ రోడ్ కాంగ్రెస్ మంత్రుల స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన శ్రీ నితిన్ గడ్కరీ
స్టాక్‌హోమ్ డిక్లరేషన్‌లో పేర్కొన్న ప్రపంచ స్థాయి రోడ్డు భద్రతా లక్ష్యాలను సాధించడానికి భారతదేశం కట్టుబడి ఉంది ... శ్రీ గడ్కరీ
నాడు పోస్టు చేయడమైనది:
02 OCT 2023 5:57PM by PIB Hyderabad
రోడ్డు భద్రతపై చెక్ రిపబ్లిక్ ప్రాగ్‌లో జరిగిన 27వ ప్రపంచ రోడ్ కాంగ్రెస్ మంత్రుల స్థాయి సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ పాల్గొని ప్రసంగించారు.
శ్రీ గడ్కరీ అన్ని స్థాయిలలో సంబంధిత వర్గాలు సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గించడానికి సమగ్ర విధానాన్ని అవలంబించాలని శ్రీ గడ్కరీ అన్నారు. ప్రవర్తనలో మార్పు తెచ్చి ప్రమాదాలు తగ్గించడానికి, నిబంధనలు అమలు చేయడానికి భారతదేశంలో అమలు చేస్తున్న విధానాలను శ్రీ గడ్కరీ వివరించారు.
BHARAT NCAP వంటి ముఖ్యమైన కార్యక్రమాలు అమలు చేస్తూ వాహన భద్రత రంగంలో భారతదేశం సాధించిన పురోగతిని మంత్రి వివరించారు. స్టాక్‌హోమ్ డిక్లరేషన్‌లో నిర్దేశించిన ప్రపంచ రహదారి భద్రతా లక్ష్యాలను సాధించడానికి భారతదేశం చిత్తశుద్ధితో కార్యక్రమాలు అమలు చేస్తుందని ఆయన అన్నారు.
***
(రిలీజ్ ఐడి: 1963364)
సందర్శకుల సూచీ సంఖ్య : : 164