గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
4వ జాతీయ ఈ ఎం ఆర్ ఎస్ సాంస్కృతిక, సాహిత్య మరియు కళా ఉత్సవ్ - 2023ను డెహ్రాడూన్‌లో 03 అక్టోబర్, 2023 వరకు ఎన్ ఈ ఎస్ టీ ఎస్ నిర్వహించనుంది.
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా మరియు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు.
దేశవ్యాప్తంగా 1500 మంది ఈ ఎం ఆర్ ఎస్ విద్యార్థులు పాల్గొననున్నారు. కళా ఉత్సవ్ ద్వారా పాఠశాల విద్యార్థుల కళాత్మక ప్రతిభను ప్రదర్శించే కార్యక్రమం
Posted On:
02 OCT 2023 4:02PM by PIB Hyderabad
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ (ఎన్ ఈ ఎస్ టీ ఎస్), ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 4వ జాతీయ ఈ ఎం ఆర్ ఎస్ సాంస్కృతిక, సాహిత్య మరియు కళా ఉత్సవ్ - 2023ని అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 6 వరకు నిర్వహిస్తోంది.
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి. రేణుకా సింగ్ సరుత మరియు ఇతర ప్రముఖులు ఈ వేడుకకు విచ్చేయనున్నారు.
నాలుగు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో దేశవ్యాప్తంగా 1500+ పైగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈ ఎం ఆర్ ఎస్ ) విద్యార్థులు పాల్గొంటారు. ఈ సంవత్సరం కూడా కళా ఉత్సవ్ కార్యక్రమం లో పాఠశాల విద్యార్థులు తమ కళాత్మక ప్రతిభను ప్రదర్శిస్తారు.
గిరిజనులను ప్రధాన స్రవంతితో అనుసంధానం చేయడం మరియు వివిధ రంగాలలో అభివృద్ధి చెందడానికి సమాన అవకాశాలను పొందడంలో సహాయపడటానికి మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఈ ఎం ఆర్ ఎస్ సాంస్కృతిక వేడుకలు మరియు క్రీడల పోటీలను నిర్వహిస్తోంది, గిరిజన విద్యార్థులకు వివిధ ప్రాంతాలలో ఆయా రంగాలలో తమలో దాగి ఉన్న ప్రతిభను ప్రదర్శించడానికి జాతీయ వేదికను అందిస్తోంది.
ఈ సంవత్సరం ఏకలవ్య విద్యాలయ సంగతన్ సమితి, ఉత్తరాఖండ్ (స్టేట్ ఈ ఎం ఆర్ ఎస్ సొసైటీ) డెహ్రాడూన్‌లోని మహారాణా ప్రతాప్ స్పోర్ట్స్ కాలేజీలో వేడుకను నిర్వహిస్తుంది.
ఈ ఎం ఆర్ ఎస్ అనేది భారతీయ గిరిజనుల (షెడ్యూల్డ్ తెగలు) కోసం భారతదేశం అంతటా ఆదర్శ రెసిడెన్షియల్ పాఠశాలల కోసం భారత ప్రభుత్వ పథకం. ఇది భారత ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన జోక్యాలలో ఒకటి. ఇది మారుమూల గిరిజన ప్రాంతాలలో గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి 2018-19లో పునరుద్ధరించబడింది.
***
(Release ID: 1963358)
Visitor Counter : 122