ఆర్థిక మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ, ఐఎన్ఎ వద్ద స్వచ్ఛత కోసం శ్రమదానాన్ని నిర్వహించిన కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్
Posted On:
01 OCT 2023 6:51PM by PIB Hyderabad
ఆర్ధిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం, కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయం (సిజిఎ) ఆదివారం న్యూఢిల్లీ ఐఎన్ఎలోని వికాస్ భవన్ ఎదురుగా గల కేంద్రీయ విద్యాలయ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో స్వచ్ఛత కోసం శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.
స్వచ్ఛత డ్రైవ్‌కు కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ శ్రీ ఎస్ ఎస్ దూబే నాయకత్వం వహించారు. ప్రదానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు స్పందించి ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయానికి చెందిన 50మందికన్నా ఎక్కువ మంది అధికారులు, సిబ్బంది గంటన్నరకు పైగా శ్రమదానం చేశారు.దాదాపు 50 సంచుల చెత్తను సేకరించి, వ్యర్ధాలను పారవేసే ప్రాంతాలకు రవాణా చేశారు.
దీని తర్వాత ఐఎన్ఎలో బ్లాక్ ఇ, జిపిఒ కాంప్లెక్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ కార్యాలయం వద్ద కూడా పారిశుద్ధ్య కార్యక్రమం జరిగడంతో పాటు శ్రీ ఎస్ఎస్ దూబే మొక్కలు నాటారు.
***
(Release ID: 1963352)
Visitor Counter : 72