జల శక్తి మంత్రిత్వ శాఖ
జలవనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవన శాఖ ఛత్ ఘాట్, ఐ టీ ఓ వద్ద ‘పరిశుభ్రత కోసం శ్రమదానం ' ను నిర్వహించింది.
సుమారు 1000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని 6000 కిలోగ్రాముల వ్యర్థాలు సేకరించారు
Posted On:
01 OCT 2023 5:56PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి నుండి స్ఫూర్తిని పొందుతూ స్వచ్ఛతా హి సేవ (ఎస్ హెచ్ ఎస్ ), 2023 ప్రచారంలో భాగంగా జలవనరులు, నదుల అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవన శాఖ ( డీ ఓ డబ్లూ ఆర్ ) 'ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్' కోసం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టమైన పిలుపు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ ఎం సీ జీ )తో కలిసి గాంధీ జయంతి సందర్భంగా ఛత్ ఘాట్, ఐ టీ ఓ వద్ద పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పరిశుభ్రత కార్యక్రమంలో జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, దేబాశ్రీ ముఖర్జీ, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా డైరెక్టర్ జనరల్, శ్రీ జి. అశోక్ కుమార్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సభ తో పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు మరియు ఘాట్‌పై వీధి నాటకం ద్వారా స్వచ్ఛమైన నదుల ప్రాముఖ్యత గురించి పాల్గొనేవారికి అవగాహన కల్పించారు. సుమారు 1000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని 6000 కిలోగ్రాముల వ్యర్థాలు సేకరించారు.
శ్రీమతి దేబశ్రీ ముఖర్జీ మాట్లాడుతూ ‘స్వచ్ఛతా హి సేవా’ ప్రచారానికి పౌర ప్రమేయం ఎంతో కీలకమని, అనేక స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్ ఎం సీ జీ నేతృత్వంలోని జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయని ఆమె తెలిపారు.
2023 అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా జరుపుకునే స్వచ్ఛ భారత్ దివస్‌గా ‘స్వచ్ఛత హి సేవ’ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎన్ ఎం సీ జీ డీ జి అశోక్ కుమార్ తెలిపారు. ఈ ప్రచారంలో భాగంగా గంగా పరివాహక రాష్ట్రాల్లోని గంగా నది మరియు దాని ఉపనదుల ఘాట్‌ల వెంబడి గత కొన్ని రోజులుగా నమామి గంగ మరియు అర్థ గంగ కింద పరిశుభ్రత కార్యక్రమాలు, వీధి నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నదులను, నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి కర్తవ్యమని ఆయన అన్నారు. గత ఏడాదిన్నర కాలంగా 22 కి.మీ ఢిల్లీ మార్గంలో ఎన్ ఎం సీ జీ నిర్వహిస్తున్న స్వచ్ఛ యమునా ప్రచారంలో కూడా ఇది భాగమని శ్రీ కుమార్ చెప్పారు.
జాతీయ జలవనరుల మిషన్, సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, సీ ఎస్ ఎం ఆర్ ఎస్, ఎన్ డబ్ల్యూ డీ ఏ మొదలైన వాటితో సహా జలశక్తి మంత్రిత్వ శాఖకు చెందిన సంస్థలు కూడా స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఢిల్లీ జల్ బోర్డ్, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ, ఎన్ జీ ఓ ల వాలంటీర్లు ట్రీ క్రేజ్, వై ఎస్ ఎస్, ఎస్ వై ఏ, వై పీ ఎఫ్, ఎఫ్ ఓ వై, పర్యావరణ్ సంరక్షణ , భారతీయం, సాక్షం భూమి ఫౌండేషన్, పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు, గంగా విచార్ మంచ్ నుండి వాలంటీర్లు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎన్ ఎం సీ జీ తో చేతులు కలిపారు. కార్యక్రమ సమయంలో ఘాట్‌ను ఘన వ్యర్థాల తొలగించడం పై దృష్టి సారించింది. దక్షిణ ఢిల్లీలోని కాళింది కుంజ్ ఘాట్‌లో స్వచ్ఛంద సంస్థలు కూడా ఇదే విధమైన పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాయి.
గంగా నది మరియు దాని ఉపనదుల ఘాట్‌ల వెంబడి గంగా పరివాహక ప్రాంతం వెంబడి కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. స్వచ్ఛతా హి సేవా ప్రచారంలో భాగంగా గంగా ప్రహారీలు, గంగా మిత్రలు, గంగా దూత్‌లు, విద్యార్థులు, జిల్లా యంత్రాంగం అధికారులు, స్థానిక ప్రజలు తదితరులు స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎన్ ఎం సీ జీ యొక్క జిల్లా-స్థాయి విభాగం అయిన జిల్లా గంగా కమిటీల ద్వారా రాష్ట్రాల్లో స్వచ్ఛతా హి సేవా ప్రచార కాలమంతా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. గంగా టాస్క్ ఫోర్స్ (జీ టీ ఎఫ్ ) ప్రయాగ్‌రాజ్, వారణాసి మరియు కాన్పూర్ ఈవెంట్‌లలో కూడా పాల్గొంది. గంగా పరివాహక ప్రాంతంలోని నమామి గంగే మురుగునీటి శుద్ధి కర్మాగారాల (నిర్మల్ జల్ కేంద్రాలు) ప్రాంగణంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను అమలు చేసే ఏజెన్సీలు కూడా పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాయి.
***
(Release ID: 1963047)
Visitor Counter : 85