రక్షణ మంత్రిత్వ శాఖ
వేడుకగా మిలిటరీ నర్సింగ్ సర్వీస్ 98వ రైజింగ్ డే
Posted On:
01 OCT 2023 6:09PM by PIB Hyderabad
మిలిటరీ నర్సింగ్ సర్వీస్ (ఎంఎన్ఎస్) తన 98వ రైజింగ్ డేని అక్టోబర్ 1, 2023న జరుపుకుంది. సాయుధ దళాలలో అత్యంత పురాతనమైన, అత్యంత విశిష్టమైన మహిళా సేవల్లో ఒకటిగా ఈ సర్వీస్ భావించబడుతుంది. సాయుధ దళాలకు చెందిన వివిధ ఆసుపత్రులలో 5,000 కంటే ఎక్కువ మంది అధికారులను కలిగి ఉంది. 98వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, అడిషనల్ డీజీఎంఎన్ఎస్ మేజర్ జనరల్ I డెలోస్ ఫ్లోరా నేతృత్వంలో పనిచేసిన, పదవీ విరమణ పొందిన అధికారులు 30 సెప్టెంబర్ 2023న నేషనల్ వార్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు. ఢిల్లీ గారిసన్‌కు చెందిన ఎంఎన్ఎస్ అధికారుల కేక్ కటింగ్ వేడుక ఏహెచ్(ఆర్&ఆర్)లో జరిగింది. న్యూఢిల్లీలోని ఏహెచ్(ఆర్&ఆర్)లోని ఎంఎన్ఎస్ ఆఫీసర్స్ మెస్‌లో.. ఢిల్లీ గారిసన్‌లో పోస్ట్ చేయబడిన మొత్తం ఎంఎన్ఎస్ సోదర వర్గం అడిషనల్ డీజీఎంఎన్ఎస్ ద్వారా ఒక సోషల్ గెట్-టుగెదర్ నిర్వహించబడింది. త్రివిధ దళాలకు చెందిన సీనియర్ ప్రముఖులు మరియు అనుభవజ్ఞులైన ఎంఎఎన్ఎస్ అధికారులతో సహా 300 మందికి పైగా అతిథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
ఎంఎన్ఎస్ యొక్క మూలం స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్, భారతీయ సైనికులు బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన వలస రాజ్యాల కాలం నాటిది. బ్రిటిష్ భారత ప్రభుత్వం 1888లో ఇండియన్ ఆర్మీ నర్సింగ్ సర్వీసెస్ (ఐఏఎన్ఎస్)ని స్థాపించింది. ఇది భారతదేశంలో మిలిటరీ నర్సింగ్ యొక్క అధికారిక ప్రారంభం. ప్రపంచ యుద్ధం – l మరియు ll సమయంలో గాయపడిన సైనికులకు వైద్య సంరక్షణ అందించడంలో ఐఏఎన్ఎస్ అధికారులు కీలక పాత్ర పోషించారు. 1 అక్టోబరు 1926న, భారత సైన్యంలో శాశ్వత నర్సింగ్ సర్వీస్ను పెంచారు. ఇండియన్ మిలిటరీ నర్సింగ్ సర్వీస్గా నియమించబడ్డారు. స్వాతంత్ర్యం తర్వాత ఎంఎన్ఎస్ ఏఎఫ్ఎంఎస్లో భాగంగా స్థాపించబడింది. ఇది యుద్ధం మరియు శాంతి రెండింటిలోనూ అంకితభావం మరియు ఆదర్శప్రాయమైన సేవ యొక్క గొప్ప చరిత్రకు ప్రసిద్ధి చెందిన ఒక ప్రసిద్ధ సేవగా అభివృద్ధి చెందింది. ఎంఎన్ఎస్ అనేది దృఢ సంకల్పం, మనస్సు యొక్క బలం మరియు ధైర్యంతో ప్రపంచంలోని అత్యుత్తమ నర్సింగ్ సేవల్లో ఒకటి.
***
(Release ID: 1963044)
Visitor Counter : 83