పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛతా హి సేవా క్యాంపెయిన్ కింద పరిశుభ్రత డ్రైవ్‌కు నాయకత్వం వహించిన శ్రీ భూపేందర్ యాదవ్


భారతదేశం అంతటా ప్రజలు స్వచ్ఛ భారత్ అభియాన్‌లో చేరుతున్నారు..ప్రధాన మంత్రి ఇచ్చిన స్పష్టమైన పిలుపుతో దీనిని జన ఆందోళనగా మార్చారు: శ్రీ యాదవ్

Posted On: 01 OCT 2023 4:45PM by PIB Hyderabad

కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ స్వచ్ఛతా హి సేవా ప్రచారం క్రింద  న్యూఢిల్లీలోని  నేషనల్ జూలాజికల్ పార్క్ (ఎన్‌జడ్‌పి)లో చేపట్టిన స్వచ్ఛత డ్రైవ్‌కు కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మరియు కార్మిక మరియు ఉపాధి మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ నాయకత్వం వహించారు.

 

image.png


ఎంఒఈఎఫ్‌&సిసి సెక్రటరీ శ్రీమతి.లీనా నందన్, ఎంఒఈఎఫ్‌&సిసి, డిజిఎఫ్‌&సిసి శ్రీ.సి.పి. గోయల్, ఎంఒఈఎఫ్‌&సిసి, ఏడిజి(డబ్ల్యుఎల్‌) శ్రీ.బివాష్ రంజన్,  మెంబర్ సెక్రటరీ సెంట్రల్ జూ అథారిటీ  శ్రీ సంజయ్ శుక్లా మరియు జాయింట్ సెక్రటరీ శ్రీ సత్యజిత్ మిశ్రా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఔత్సాహిక విద్యార్థులతో సహా 200 మందికి పైగా కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారు. ఈ ముఖ్యమైన ప్రయత్నానికి సహకరించేందుకు సందర్శకులు తరలివచ్చారు.

 

image.png


స్వచ్ఛత ప్రచారంలో యువత పాల్గొనడం మరియు నీటి వనరులను శుభ్రపరచడం కోసం జూ క్లీనింగ్ కార్యక్రమాలలో పాల్గొనడం ఈ రోజు యొక్క ముఖ్యాంశం. జూను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (ఎస్‌యుపి) ఫ్రీ జోన్‌గా మార్చే దిశగా ఒక కీలకమైన అడుగు పెట్‌ బాటిల్ సేకరణ పాయింట్‌ను ప్రారంభించడం ద్వారా ఈ కార్యాచరణ జరిగింది. ఈ చొరవ పర్యావరణ స్థిరత్వంపై ఎన్‌జడ్‌పి  యొక్క తిరుగులేని నిబద్ధతను చాటిచెబుతుంది.

 

image.png


శ్రీ భూపేందర్ యాదవ్ విద్యార్థులకు పర్యావరణ అనుకూలమైన పునర్వినియోగ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. స్థిరమైన జీవనం మరియు పర్యావరణ స్పృహ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

 

image.png


బ్యాగుల పంపిణీ తర్వాత ఎన్‌జడ్‌పిలోని విభిన్న వన్యప్రాణులతో విద్యాసంబంధాన్ని పెంపొందించడానికి జూలో పర్యావరణం మరియు పరిశుభ్రత కోసం జీవనశైలిని ప్రోత్సహించడానికి ఒక జంతు పత్రికను ఆవిష్కరించారు.

 

image.png


స్వచ్ఛతా హి సేవా ప్రచారం కింద ఎన్‌జడ్‌పిలో శ్రమదాన్ కార్యకలాపం, కమ్యూనిటీలు భాగస్వామ్య దృష్టితో కలిసి వచ్చినప్పుడు అర్థవంతమైన మార్పును సాధించవచ్చని నిరూపిస్తుంది. వన్యప్రాణుల సంరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణకు ఎన్‌జడ్‌పి తన నిబద్ధతలో స్థిరంగా ఉంది.
 

***


(Release ID: 1962980) Visitor Counter : 87


Read this release in: English , Urdu , Hindi