విద్యుత్తు మంత్రిత్వ శాఖ
స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా శ్రమదానం నిర్వహించిన విద్యుత్ మంత్రిత్వ శాఖ శ్రస్వచ్ఛ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్క భారతీయుడు సహకరించాలి: కేంద్ర ఇంధన, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్
Posted On:
01 OCT 2023 12:55PM by PIB Hyderabad
' ఏక్ తారీఖ్ ఏక్ ఘంటా ఏక్ సాథ్ ' అంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన మంత్రిత్వ శాఖ శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించింది. కేంద్ర ఇంధన నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ కేంద్ర నాయకత్వంలో ఇంధన మంత్రిత్వ శాఖ,
మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, సంస్థల సిబ్బంది, అధికారులు శ్రమదానంలో పాల్గొన్నారు.
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అధికారులు, సిబ్బందితో స్వచ్ఛత హి సేవ ప్రతిజ్ఞ చేయించారు.
జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా ఇంధన మంత్రిత్వ శాఖలో జరిగిన శ్రమదానం కార్యక్రమానికి మంత్రి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛత కార్యక్రమంలో ప్రజలు స్వచ్చందంగా పాల్గోవాలని పిలుపు ఇచ్చారు.
. “పరిశుభ్రమైన భారతదేశం నిర్మాణం కోసం జరుగుతున్న కార్యక్రమానికి సహకరించడం ప్రతి పౌరుడి బాధ్యత. ప్రజల జీవన నాణ్యత మెరుగుపరచడానికి, అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం అవతరించడానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేయాలి" అని మంత్రి అన్నారు.
చెత్త రహిత భారతదేశం నిర్మాణం కోసం స్వచ్ఛతా పక్వాడా 2023 అమలు జరుగుతోంది. దేశంలోని గ్రామాలు, పట్టణాలు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, బహిరంగ ప్రదేశాలలో ప్రభుత్వ రంగ విద్యుత్ రంగ సంస్థలు వివిధ పరిశుభ్రత కార్యకలాపాలను నిర్వహించాయి.
విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి, ఆర్థిక సలహాదారుశ్రీ ఆశిష్ ఉపాధ్యాయ; పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ , శ్రీమతి. పర్మీందర్ చోప్రా; ఎంటీపీసీ సీఎండీ , శ్రీ గురుదీప్ సింగ్; పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సీఎండీ శ్రీ కె శ్రీకాంత్;పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ సీఎండీ శ్రీ ఎస్.ఆర్. . నరసింహన్, సీఈఏ చైర్‌పర్సన్ శ్రీ ఘనశ్యామ్ ప్రసాద్ ఈరోజు జరిగిన శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు, విద్యుత్ మంత్రిత్వ శాఖ, మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ సంస్థల అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1962957)
Visitor Counter : 124