వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రత్యేక ప్రచారం 3.0 కింద 2023 సెప్టెంబర్ 15 నుండి 30వ తేదీ వరకు సన్నాహక దశలో వ్యవసాయ శాఖ, రైతుల సంక్షేమం (డిఏ & ఎఫ్ డబ్లు) కార్యకలాపాలు

Posted On: 30 SEP 2023 6:00PM by PIB Hyderabad

అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ & పబ్లిక్ గ్రీవెన్స్ (డిఏఆర్పిజి) శాఖ సహాయ మంత్రి డా.జితేందర్ సింగ్ ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌ను తగ్గించడం కోసం 14.09.2023న న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ప్రత్యేక ప్రచారం 3.0ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం రెండు దశల్లో అమలు చేస్తారు. సన్నద్ధత దశ 15 నుండి 30 సెప్టెంబర్ వరకు,  ప్రధాన దశ 2 నుండి 31 అక్టోబర్, 2023 వరకు నిర్వహిస్తున్నారు.

సన్నాహక దశ కోసం, అన్ని విభాగాల నోడల్ అధికారులు, సబార్డినేట్ / అటాచ్డ్ ఆఫీసులు, పిఎస్యు, అటానమస్ బాడీలు, డిఏ ఎఫ్ డబ్ల్యూ పరిపాలనా నియంత్రణలో ఉన్న అధికారులు డిఏఆర్పిజి మార్గదర్శకాల పారామితుల ప్రకారం పెండెన్సీని గుర్తించాలని కోరారు. ట్విట్టర్, లింక్డ్‌ఇన్, ఇన్‌స్టాగ్రామ్, కూ, ఫేస్‌బుక్, థ్రెడ్‌లు, పబ్లిక్ వంటి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ డిపార్ట్‌మెంట్, దాని అటాచ్డ్/సబార్డినేట్/ఫీల్డ్ ఆఫీసులు మొదలైన వాటి ద్వారా ఒక పీఐబీ పత్రిక ప్రకటన, సన్నాహక దశలో 100 కంటే ఎక్కువ ట్వీట్లు,  యాప్, మొదలైనవి ఇప్పటికే విడుదల చేశారు.. కార్యదర్శి తో పాటు అదనపు సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ కృషి భవన్‌లోని వివిధ అంతస్తులను సందర్శించి భవనం పరిశుభ్రతను సమీక్షించారు.

 

నోడల్ అధికారి, డిఏ-ఎఫ్డబ్ల్యూ కి చెందిన ఇతర అధికారులతో కూడిన బృందం కూడా డిపార్ట్‌మెంట్  రికార్డ్ రూమ్‌ను సందర్శించింది. రికార్డ్ రూమ్‌లో ఉన్న 23343 ఫైల్‌లలో 8130 పాత ఫైళ్లను సమీక్షించాల్సి ఉందని అంచనాకు వచ్చారు.

డిపార్ట్‌మెంట్ నోడల్ ఆఫీసర్‌తో పాటు జాయింట్ సెక్రటరీ అధ్యక్షతన ఇప్పటి వరకు 3 వీడియో కాన్ఫెరెన్స్ సమావేశాలు డిపార్ట్‌మెంట్‌లోని వివిధ విభాగాలు, దాని అనుబంధ, సబార్డినేట్ కార్యాలయాల నోడల్ అధికారులందరితో నిర్వహించారు. వారు పరిశుభ్ర స్థలాలు, స్థలానికి సంబంధించి ఇచ్చిన లక్ష్యాలను అందించాలని అభ్యర్థించారు. నిర్వహణ, స్క్రాప్ & అనవసరమైన వస్తువులను పారవేయడం, ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అంతర్ మంత్రిత్వ శాఖల సూచనలు, పార్లమెంట్ హామీలు, పీఎంఓ సూచనలు, పబ్లిక్ గ్రీవెన్స్‌లు, దాని అప్పీల్స్, రికార్డ్ మేనేజ్‌మెంట్ మొదలైనవి ప్రిపరేటరీ దశ లో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.  

***


(Release ID: 1962944) Visitor Counter : 104


Read this release in: Tamil , English , Urdu , Hindi