హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఏ ఎం సీ మరియు ఏ యూ డీ ఏ కి చెందిన సుమారు రూ. 1651 కోట్ల వ్యయమయ్యే వివిధ అభివృద్ధి పనులను కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు.


శ్రీ అమిత్ షా సర్ఖేజ్, భదాజ్ గ్రామం, ఓగ్నాజ్, జగత్‌పూర్ గ్రామం మరియు త్రాగడ్‌లోని చెరువుల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు.

గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో 52 నెలల్లో రూ.17,544 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయి

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో భార‌త‌దేశాన్ని ప్ర‌పంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్ర‌భుత్వం సంక‌ల్పించింది

నూతన పార్లమెంట్ భవనం, చంద్రయాన్, జీ20 మరియు నారీ శక్తి వందన్ చట్టం వంటి ముఖ్యమైన పథకాలు మరియు కార్యక్రమాలు కేవలం మూడు నెలల్లో పూర్తి చేయబడ్డాయి, ఇది మొత్తం ప్రపంచంలో భారతదేశ ప్రతిష్టను పెంచింది.

భారతదేశానికి ముందు చాలా దేశాలు జీ20 సదస్సును నిర్వహించాయి, అయితే భారతదేశం జీ20 ని నిర్వహించిన విధానం రాబోయే 25 సంవత్సరాలలో అన్ని దేశాలకు సవాలుగా ఉంటుందని అన్ని దేశాల అధినేతలు భావిస్తున్నారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాతృత్వాన్ని విన‌యంతో ఎలా పూజించ‌వ‌చ్చో అద్భుత‌మైన ఉదాహ‌ర‌ణ‌ను ప్ర‌పంచం ముందు ఉంచారు

భారతదేశ ప్రాచీన సంస్కృతి నుండి మనకు సంప్రదాయ వారసత్వంగా వచ్చిన స్త్రీలు మరియు తల్లులను గౌరవించే సంస్కృతికి చట్టబద్ధమైన రూపం కల్ప

Posted On: 30 SEP 2023 6:21PM by PIB Hyderabad

గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏ ఎం సీ) మరియు అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏ యూ డీ ఏ) యొక్క సుమారు 1651 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులను కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఈరోజు ప్రారంభించారు మరియు శంకుస్థాపన చేశారు. శ్రీ అమిత్ షా సర్ఖేజ్, భదాజ్ గ్రామం, ఓగ్నాజ్, జగత్‌పూర్ గ్రామం మరియు త్రాగడ్‌లోని చెరువుల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ సహా పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టని వార్డు లేదని కేంద్ర హోంమంత్రి అన్నారు. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మరియు గుజరాత్ ప్రభుత్వం ప్రజల నుండి డిమాండ్ కంటే ముందుగానే అభివృద్ధి పనులను ప్రారంభించాయని ఆయన అన్నారు. ఇందుకు అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మరియు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌కు కృతజ్ఞతలు తెలిపిన శ్రీ షా, ప్రజలు అడగకముందే ఇచ్చే సంప్రదాయం ఉందని చెప్పారు. గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గంలో గత 52 నెలల్లో రూ.17,544 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు.

 

ఈరోజు సుమారు రూ.1650 కోట్లతో ఏ ఎం సీ మరియు ఏ యూ డీ ఏ యొక్క 39 ప్రాజెక్టులను ప్రారంభించినట్లు శ్రీ షా తెలిపారు. వీటిలో 18 పథకాల ప్రారంభోత్సవం, 21 పథకాలకు భూమిపూజ చేశారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గత మూడు నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను పెంచారని శ్రీ అమిత్ షా అన్నారు. ప్రధాని మోదీ జీ కేవలం మూడు నెలల్లోనే కొత్త పార్లమెంట్, చంద్రయాన్, జీ20, నారీ శక్తి వందన్ చట్టం వంటి నాలుగు ముఖ్యమైన పనులను పూర్తి చేశారు. 50 ఏళ్లలో ఇలాంటి పని ఒకటి చేయగలమని, అయితే మోదీ జీ 3 నెలల్లోనే 4 పనులు పూర్తి చేశారని అన్నారు. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం భార‌త‌దేశాన్ని ప్ర‌పంచంలోనే ప్ర‌థ‌మంగా తీర్చిదిద్దేందుకు క‌ట్టుబ‌డ‌తోంద‌ని ఇదే నిదర్శనమని తెలియజేస్తోంది. ప్రధానమంత్రి అయిన తర్వాత శ్రీ నరేంద్ర మోదీ ఇస్రోకు పునర్వైభవం తీసుకొచ్చారని, అంతరిక్ష రంగంలో భారత్‌ను అగ్రస్థానానికి తీసుకెళ్లేందుకు శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిచ్చారని హోంమంత్రి అన్నారు. ఫలితంగా, భారతదేశం మరియు ప్రపంచం మొత్తం చంద్రయాన్‌పై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడాన్ని చూసింది, ఇది మనందరికీ చాలా గర్వకారణం. శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించిందని శ్రీ షా అన్నారు. భారతదేశానికి ముందు చాలా దేశాలు జీ20 సదస్సును నిర్వహించాయి, రాబోయే 25 సంవత్సరాలలో భారతదేశం జీ20ని నిర్వహించిదానికి ధీటుగా  నిర్వహించడం అన్ని దేశాలకు సవాలుగా ఉంటుందని అన్ని దేశాల దేశాధినేతలు భావిస్తున్నారు. ఢిల్లీ డిక్లరేషన్‌ను ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యావత్ ప్రపంచానికి ఒక సందేశాన్ని అందించారు. ఆఫ్రికన్ యూనియన్‌ను జీ20 లో చేర్చడంతో పాటు, భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు అండగా నిలుస్తుందని శ్రీ నరేంద్ర మోదీ సందేశం ఇచ్చారు. “మాతృశక్తి వందన” స్త్రీ పట్ల వినయం ఎలా ప్రదర్శించాలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అద్భుతమైన ఉదాహరణగా చేసి చూపారని కేంద్ర హోం మంత్రి మరియు సహకార మంత్రి అన్నారు. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నారీ శ‌క్తి వంద‌న చ‌ట్టం ద్వారా రాష్ట్రాల అసెంబ్లీలు మరియు లోక్‌స‌భ‌లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజర్వేషన్లు కల్పించారు. విధాన రూపకల్పన, చట్టాల రూపకల్పనలో మహిళల సహకారం ఎంతో కీలకమని అన్నారు. ఏళ్ల తరబడి ఈ బిల్లు పై తాత్సారం జరిగిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొత్త పార్లమెంటును నిర్మించి, గణేష్ చతుర్థి రోజున దానిని ప్రారంభించి, కొత్త పార్లమెంట్‌లో మొదటి బిల్లుగా నారీ శక్తి వందన్ బిల్లును తీసుకువచ్చారు. భారతదేశ ప్రాచీన సంస్కృతి నుండి మనకు వారసత్వంగా వచ్చిన స్త్రీలు మరియు తల్లులను గౌరవించే సంస్కృతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చట్టబద్ధమైన రూపం ఇచ్చారని శ్రీ షా అన్నారు.

 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అనేక ప‌థ‌కాలు తీసుకొచ్చార‌ని కేంద్ర హోం మంత్రి, స‌హ‌కార మంత్రి అన్నారు. వీటిలో ఇటీవల ప్రారంభించిన విశ్వకర్మ పథకం చాలా ప్రత్యేకం. దేశంలో కోట్లాది మంది వివిధ రకాల చిరు వ్యాపారాలు చేతి వృత్తులు చేసుకుంటున్నారని, అవి లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదన్నారు. విశ్వకర్మ యోజన కింద, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అటువంటి వారికి నైపుణ్యం కల్పించడం, నిపుణులను చేయడం, వారికి పరికరాలు ఇవ్వడం మరియు యంత్రాల కొనుగోలు కోసం రూ. 3 లక్షల వరకు రుణాలు అందించే ఏర్పాట్లు చేశారు. స్వాతంత్య్రానంతరం మొదటి సారిగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విశ్వకర్మ యోజనను ప్రారంభించడం ద్వారా 20 కంటే ఎక్కువ చిన్న చేతి వృత్తి శ్రామిక వర్గాలను ప్రభుత్వ పథకంలో చేర్చే దార్శనికతతో కూడిన పనిని చేసారు.  అభివృద్ధిలో వెనుకబడిన సమాజాన్ని ఇతరులతో సమానంగా తీసుకురావడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విశ్వకర్మ యోజన ద్వారా పెద్ద ముందడుగు వేశారని శ్రీ షా అన్నారు.

 

రాబోయే రోజుల్లో గుజరాత్ అంతటా పరిసరాలు పర్యావరణం మరింత పరిశుభ్రంగా మరియు అందంగా మారేందుకు తమ ఇంటి చుట్టూ కనీసం 3 చెట్లను నాటాలని శ్రీ అమిత్ షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, అహ్మదాబాద్ మేయర్ శ్రీమతి కృతజ్ఞతలు తెలిపారు. గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో సుమారు రూ. 1650 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాలలో ప్రతిభా జైన్ మరియు ఏ యూ డీ ఏ అధికారులందరూ పాల్గొన్నారు.

 


(Release ID: 1962942) Visitor Counter : 136


Read this release in: English , Urdu , Assamese , Tamil