సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
భారతదేశంలో వృద్ధుల సంరక్షణకు సంబంధించి క్లిష్టమైన అంతర్దృష్టులను ఆవిష్కరించిన ‘ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023’
Posted On:
27 SEP 2023 12:47PM by PIB Hyderabad
యు.ఎన్.ఎఫ్.పి.ఏ (యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్) భారతదేశం, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ (ఐఐపీఎస్) సహకారంతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023ని ఆవిష్కరించింది.
"ఈ నివేదిక భారతదేశంలో వృద్ధుల సంరక్షణ చుట్టూ ఉన్న సవాళ్లు, అవకాశాలు మరియు సంస్థాగత ప్రతిస్పందనలను వెలుగులోకి తెచ్చింది, ఎందుకంటే భారతదేశం వృద్ధాప్య జనాభా వైపు జనాభా మార్పుముందుకు సాగుతోందని తెలిపింది. ఈ నివేదికను సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ (భారత ప్రభుత్వం) కార్యదర్శి శ్రీ సౌరభ్ గార్గ్ మరియు యు.ఎన్.ఎఫ్.పి.ఎ. భారతదేశ ప్రతినిధి, భూటాన్ కంట్రీ డైరెక్టర్ శ్రీమతి ఆండ్రియా ఎం. వోజ్నార్ సంయుక్తంగా విడుదల చేశారు. ఇండియా ఏజింగ్ రిపోర్ట్ -2023 భారతదేశంలోని వృద్ధుల జీవన పరిస్థితులు మరియు సంక్షేమం యొక్క సమగ్ర సమీక్షను సూచిస్తుంది. ఇది లాంగిట్యూడినల్ ఏజింగ్ సర్వే ఇన్ ఇండియా (ఎల్.ఎ.ఎస్.ఐ), 2017–18, భారత జనాభా లెక్కలు, భారత ప్రభుత్వంచే జనాభా అంచనాలు (2011–2036), యునైటెడ్ నేషన్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్, వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్-2022 నుండి అందుబాటులో ఉన్న తాజా సమాచారం ఆధారంగా చేపట్టడం జరిగింది. "భారతదేశం వృద్ధ జనాభా ఆరోగ్యంగా, గౌరవప్రదంగా మరియు సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి అవసరమైన సంరక్షణ మరియు మద్దతును పొందేలా చేయడం అత్యవసరం" అని సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ (ప్రభుత్వం) కార్యదర్శి శ్రీ సౌరభ్ గార్గ్ అన్నారు. "ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ఈ లక్ష్యాన్ని సాధించడానికి విలువైన రోడ్మ్యాప్ను అందిస్తుంది, దాని సిఫార్సులను అమలు చేయడానికి భాగస్వామ్య పక్షాలవారందరూ కలిసి పని చేయాలని నేను కోరుతున్నాను." అని అన్నారు. “ఈ సమగ్ర నివేదిక పండితులకు, విధాన రూపకర్తలకు, ప్రోగ్రామ్ మేనేజర్‌లకు మరియు పెద్దల సంరక్షణలో పాలుపంచుకునే వాటాదారులందరికీ విలువైన వనరుగా నిలుస్తుంది. వృద్ధులు సమాజానికి గణనీయమైన సహకారం అందించారు మరియు వారి శ్రేయస్సును నిర్ధారించడానికి మేము చేసే ఉత్తమ ప్రయత్నాల కంటే వారు తక్కువ అర్హులేమీ కాదు." అని యు.ఎన్.ఎప్.పి.ఎ. భారతదేశ ప్రతినిధి, కంట్రీ డైరెక్టర్ భూటాన్ శ్రీమతి ఆండ్రియా ఎం. వోజ్నార్ వ్యాఖ్యానించారు.
నివేదిక యొక్క కీలక ఫలితాలు వృద్ధుల శ్రేయస్సుకు సంబంధించిన అనేక విశ్లేషణలను కలిగి ఉన్నాయి. ఇందులో కొన్ని:
• వృద్ధుల ప్రత్యేక ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి వృద్ధుల సంరక్షణను మెరుగుపరచడం.
• వృద్ధుల ఆరోగ్యం, ఆర్థిక సాధికారత మరియు సామర్థ్యాన్ని పెంపొందించే అనేక ప్రభుత్వ పథకాలు మరియు విధానాలు చేపట్టడం.
• కమ్యూనిటీ-ఆధారిత సంస్థలు కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ వినియోగ సెషన్‌ల ద్వారా డిజిటల్ సాధికారతలో చురుకుగా నిమగ్నమై ఉండడం.
• వృద్ధుల సంక్షేమం కోసం విధానాలను రూపొందించడానికి అంకితమైన మంత్రుల కమిటీలు.
• సంతోషకరమైన వృద్ధాప్యం, సామాజిక సహాయం, వృద్ధాశ్రమాలు మరియు వృద్ధుల దుర్వినియోగంపై అవగాహన ప్రచారాల కోసం కార్పొరేట్ ప్రయత్నాలు.
పూర్తి ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023ని పొందేందుకు దయచేసి [https://india.unfpa.org/en]ని సందర్శించండి.
***
(Release ID: 1961541)
Visitor Counter : 208