కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

వాటాదార్ల అభిప్రాయాల కోసం 'డ్రాఫ్ట్ టెలీకమ్యూనికేషన్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (తొమ్మిదో సవరణ) నిబంధనలు', 2023ను విడుదల చేసిన ట్రాయ్‌

Posted On: 27 SEP 2023 4:11PM by PIB Hyderabad

'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (ట్రాయ్‌), 'డ్రాఫ్ట్ టెలీకమ్యూనికేషన్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (తొమ్మిదో సవరణ) నిబంధనలు', 2023ను ఈరోజు విడుదల చేసింది.

ట్రాయ్‌ జారీ చేసిన 'టెలీకమ్యూనికేషన్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నిబంధనలు' 2009 (ఎనిమిదో సవరణ), దేశంలో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (ఎన్‌ఎన్‌పీ) కోసం నియంత్రణ పరమైన విధివిధానాలను నిర్దేశించింది. ఇప్పటి వరకు, 'టెలీకమ్యూనికేషన్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ నిబంధనలు, 2009'లో ఎనిమిది సవరణలు జరిగాయి.

ఇటీవలి కాలంలో, మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం నియంత్రణ విధివిధానాలకు సంబంధించి డాట్‌ కొన్ని సూచనలు చేసింది. డాట్‌ సూచనల ప్రకారం, వాటాదార్ల వ్యాఖ్యల కోసం ముసాయిదా సవరణ నిబంధనలను జారీ చేయాలని ట్రాయ్‌ నిర్ణయించింది.

వాటాదార్ల నుంచి అభిప్రాయాలు కోరుతూ, 'డ్రాఫ్ట్ టెలీకమ్యూనికేషన్ మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (తొమ్మిదో సవరణ) నిబంధనలు' 2023ను ట్రాయ్‌ వెబ్‌సైట్‌లో (www.trai.gov.in) ఉంచింది. ముసాయిదా సవరణ నిబంధనల్లో పేర్కొన్న అంశాలపై రాతపూర్వక వ్యాఖ్యలు 25 అక్టోబర్ 2023 లోపు పంపాలి.

అభిప్రాయాలను శ్రీ అఖిలేష్ కుమార్ త్రివేది, సలహాదారు (నెట్‌వర్క్, స్పెక్ట్రమ్ & లైసెన్సింగ్), TRAIకి పంపవచ్చు. ఎలక్ట్రానిక్ రూపంలో advmn@trai.gov.in కు ఈ-మెయిల్‌ చేయవచ్చు. మరింత స్పష్టత/సమాచారం కోసం శ్రీ అఖిలేష్ కుమార్ త్రివేదిని +91-11-23210481 టెలిఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు.

 

***



(Release ID: 1961540) Visitor Counter : 72


Read this release in: English , Urdu , Hindi