హోం మంత్రిత్వ శాఖ

కేంద్ర హోం మంత్రి, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన పంజాబ్ లోని అమృత్ సర్ లో ఉత్తర మండల (నార్తర్న్ జోనల్) కౌన్సిల్ 31వ సమావేశం


గత 5 సంవత్సరాలలో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, జోనల్ కౌన్సిళ్ల పాత్ర సలహా స్వభావం నుండి కార్యాచరణ వేదికలకు మారింది.

ఉత్తర జోనల్ కౌన్సిల్ దేశ అభివృద్ధి , భద్రత దృష్ట్యా ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది, దేశంలోని 21% భూభాగం ,13% జనాభాతో, 35% పైగా ఆహార ధాన్యాలు ఉత్తర ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్నాయి.

సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ (సి ఎ పి ఎఫ్) లోనూ, దేశ సరిహద్దులను పరిరక్షించే సైన్యం లోనూ ఎక్కువ మంది సిబ్బంది ఉత్తర జోనల్ కౌన్సిల్ లోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ప్రభుత్వం విజయవంతం అయింది.

సరిహద్దుల్లో భద్రతా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది: త్వరలోనే మన దేశ సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరిస్తాం.

నీటి పంపకాలకు సంబంధించిన వివాదాలను విశాల దృక్పథంతో , పరస్పర చర్చలతో పరిష్కరించుకోవాలని ఉత్తర జోనల్ కౌన్సిల్ లోని అన్ని సభ్య దేశాలను కోరిన హోంమంత్రి

దేశంలో సహకార ఉద్యమం, బడి పిల్లల డ్రాపవుట్ రేటు, పౌష్టికాహార లోపం వంటి అంశ

Posted On: 26 SEP 2023 8:11PM by PIB Hyderabad

కేంద్ర , సహకార శాఖల మంత్రి శ్రీఅమిత్ షా అధ్యక్షతన పంజాబ్ లోని అమృత్ సర్ లో నార్తర్న్ జోనల్ కౌన్సిల్ 31 సమావేశం జరిగింది. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్లు, చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్, సభ్య రాష్ట్రాలకు చెందిన సీనియర్ మంత్రులు, కేంద్ర హోం కార్యదర్శి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ కార్యదర్శి, నార్తర్న్ జోన్ లోని సభ్య రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001CUD7.jpg

గత 5 సంవత్సరాలలో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, జోనల్ కౌన్సిళ్ల పాత్ర సలహా స్వభావం నుండి కార్యాచరణ వేదికలకు మారిందని శ్రీఅమిత్ షా అన్నారు. దేశాభివృద్ధి, భద్రత దృష్ట్యా నార్తర్న్ జోనల్ కౌన్సిల్ కు ముఖ్యమైన స్థానం ఉందని, దేశ భూభాగంలో 21 శాతం, జనాభాలో 13 శాతంతో 35 శాతానికి పైగా ఆహార ధాన్యాలు ఉత్తర ప్రాంతంలో ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు.సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్సెస్ (సి ఎ పి ఎఫ్) లోనూ, దేశ సరిహద్దులను పరిరక్షించే సైన్యం లోనూ  ఎక్కువ మంది సిబ్బంది ఉత్తర  జోనల్ కౌన్సిల్ లోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారేనని శ్రీ షా అన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మాదక ద్రవ్యాలు, ఉగ్రవాదాన్ని  అణచివేయడంలో ప్రభుత్వం విజయవంతం అయిందని కేంద్ర హోం మంత్రి చెప్పారు. సరిహద్దుల్లో భద్రతా వ్యవస్థను బలోపేతం చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే మన దేశ సరిహద్దుల్లో యాంటీ డ్రోన్ వ్యవస్థను మోహరిస్తామని చెప్పారు. నీటి పంపకాలకు సంబంధించిన వివాదాలను విశాల దృక్పథంతో , పరస్పర చర్చలతో పరిష్కరించుకోవాలని ఉత్తర  జోనల్ కౌన్సిల్ లోని అన్ని సభ్య దేశాలను  హోంమంత్రి కోరారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002TR52.jpg

దేశంలో సహకార ఉద్యమం, బడిపిల్లల డ్రాపవుట్ రేటు, పౌష్టికాహార లోపం వంటి అంశాలపై సభ్య దేశాలన్నీ ప్రత్యేక దృష్టి సారించాలని, వాటిని సమిష్టి ప్రాధాన్యతగా పరిగణించాలని అమిత్ షా కోరారు. దేశంలో ఒక్క చిన్నారి కూడా పౌష్టికాహార లోపంతో ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. మధ్యలో బడి మానేసే వారి రేటును తగ్గించాల్సిన బాధ్యత మనందరిపై ఉందనిఅన్నారు. సహకార ఉద్యమానికి ఊతమివ్వడం ద్వారా దేశంలోని 60 కోట్ల మందికి పైగా ప్రజలను అభ్యున్నతి  వైపు తీసుకువెళ్లడంలో దోహద పడాలని పేర్కొన్నారు. దేశంలోని రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే సహజ, సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబించాలని సభ్య దేశాలను  శ్రీ అమిత్ షా కోరారు.

హిమాచల్ ప్రదేశ్ లో వరదల పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్రం నుండి సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర హోం మంత్రి హామీ ఇచ్చారు  ఈ సంక్షోభ సమయంలో దేశం మొత్తం హిమాచల్ కు అండగా నిలుస్తుందని అన్నారు.

కేంద్ర హోం మంత్రి సూచన మేరకు చంద్రయాన్ -3 అద్భుత విజయం, జీ20 సదస్సులో భారత నాయకత్వం, ప్రపంచ సంక్షేమంపై ప్రపంచవ్యాప్తంగా లభించిన ప్రశంసలు, చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదించడాన్ని  నార్తర్న్ జోనల్ కౌన్సిల్ స్వాగతించింది.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003LXBA.jpg

జోనల్ కౌన్సిళ్ల పాత్రను ప్రశంసిస్తూ, జోనల్ కౌన్సిళ్లు సలహా స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, సంవత్సరాలుగా, వివిధ రంగాలలో పరస్పర అవగాహన , సహకారాల ఆరోగ్యకరమైన బంధాన్ని ప్రోత్సహించడంలో అవి గణనీయమైన పాత్రను పోషించినట్టు నిరూపితమైందని శ్రీ షా అన్నారు. జోనల్ కౌన్సిళ్లు సభ్య దేశాల మధ్య అత్యున్నత స్థాయిలో వ్యక్తిగత పరస్పర చర్యకు అవకాశం కల్పిస్తాయనిసుహృద్భావ వాతావరణంలో క్లిష్టమైన , సంక్లిష్టమైన స్వభావం కలిగిన సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగకరమైన వేదికగా పనిచేస్తాయని అన్నారు. చర్చలుఅభిప్రాయాల మార్పిడి ద్వారా, జోనల్ కౌన్సిళ్లు సామాజికఆర్థిక అభివృద్ధి కి సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై రాష్ట్రాల మధ్య సమన్వయ విధానాన్ని అభివృద్ధి చేయడంలో సహాయపడతాయని, . జోనల్ కౌన్సిళ్లు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించి సిఫార్సులు చేస్తాయని అన్నారు.

శ్రీఅమిత్ షా మాట్లాడుతూ, ఐదు జోనల్ కౌన్సిల్ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ క్రమం తప్పకుండా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. జోనల్ కౌన్సిల్ లు, స్టాండింగ్ కమిటీల సమావేశాల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన అన్నారు. జూన్ 2014 నుండి, గత 10 సంవత్సరాలలో, జోనల్ కౌన్సిల్ , దాని స్టాండింగ్ కమిటీ సమావేశాలు మొత్తం 54 జరిగాయి, ఇది 2004 సంవత్సరం నుండి మే 2014 వరకు 10 సంవత్సరాలలో జరిగిన సమావేశాలతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0042D7R.jpg

అమృత్ సర్ లో జరిగిన 31 సమావేశంలో నార్తర్న్ జోనల్ కౌన్సిల్ మొత్తం 28 అంశాలపై చర్చించింది. సభ్య దేశాలకు, మొత్తం దేశానికి సంబంధించి చర్చించిన కొన్ని కీలక అంశాలలో-  'అంతర్రాష్ట్ర నదీ జలాల పంపకం, బ్యాంకు శాఖలు/ పోస్టల్ బ్యాంకింగ్ సౌకర్యాలను గ్రామాలకు విస్తరించడం, సామాజిక రంగ పథకాలకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీని సమర్థవంతంగా అమలు చేయడం, పంజాబ్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన సమస్యలు, పీఎంజీఎస్ వై కింద రోడ్డు కనెక్టివిటీ, సైబర్ నేరాల నిరోధం, జలజీవన్ మిషన్ఉడాన్ పథకం కింద విమానాల పునరుద్ధరణ, మహిళలు, చిన్నారులపై లైంగిక నేరాలు/ అత్యాచారాల కేసుల సత్వర దర్యాప్తు, పోక్సో చట్టం కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల (ఎఫ్ టీఎస్ సీ) పథకం అమలు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్ ) బలోపేతం, వ్యవసాయ భూముల కొనుగోలు”  మొదలైనవి ఉన్నాయి. సభ్య దేశాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను కూడా సమావేశంలో పంచుకున్నారు.

****



(Release ID: 1961146) Visitor Counter : 112